కూతురు కోడలు 1971లో విడుదలైన తెలుగు చిత్రం. పూర్ణ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై అట్లూరి పూర్ణచంద్రరావు, ఎం. చంద్రశేఖర్ లు నిర్మించిన ఈ సినిమాకు పి. లక్ష్మీ దీపక్ దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, విజయలలిత ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]

కూతురు కోడలు
(1971 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం లక్ష్మీదీపక్
తారాగణం శోభన్ బాబు,
విజయలలిత
నిర్మాణ సంస్థ పూర్ణ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • స్టూడియో: పూర్ణ ఆర్ట్ పిక్చర్స్
  • నిర్మాత: అట్లూరి పూర్ణచంద్రరావు, ఎం. చంద్రశేఖర్;
  • ఛాయాగ్రాహకుడు: శేఖర్ - సింగ్;
  • కూర్పు: ఎ. దండపాణి;
  • స్వరకర్త: కె.వి. మహదేవన్;
  • గీత రచయిత: సి.నారాయణ రెడ్డి, దాశరథి, కోసరాజు రాఘవయ్య చౌదరి
  • విడుదల తేదీ: అక్టోబర్ 30, 1971
  • అసోసియేట్ డైరెక్టర్: దాసరి నారాయణరావు;
  • కథ: పి.కృష్ణన్; సంభాషణ: దాసరి నారాయణరావు, అదుర్తి నరసింహ మూర్తి
  • గాయకుడు: పి.సుశీల, ఎస్.జానకి, ఎల్.ఆర్. ఈశ్వరి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బి. వసంత
  • ఆర్ట్ డైరెక్టర్: బి.ఎన్. కృష్ణుడు;
  • డాన్స్ డైరెక్టర్: టి.సి. తంగరాజ్



పాటల జాబితా

మార్చు

1 . ఇంతకన్నా మంచితరుణం ఏమున్నదిరా, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.శిష్ట్లా జానకి

2.కన్నయ్యా నా కన్నయ్యా అమ్మవైనా నాన్నవైనా , రచన: దాశరథి కృష్ణమాచార్య, గానం.పులపాక సుశీల

3.గాజులు ఘల్లనగానే జాజులు జుమ్మ్మనగానే, రచన: దాశరథి కృష్ణమాచార్య , గానం.బొడ్డుపల్లి బాల వసంత, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

4.చిన్నారి బాలల్లారా రారండి ఎన్నెన్ని, రచన: సి నారాయణ రెడ్డి, గానం. పి .సుశీల బృందం

5.జల్లు కురిసింది వళ్ళు తడిసింది చలికి ,రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎల్.ఆర్.ఈశ్వరి

6.వింతవింత లోకంలో ఎంతెంతో తిరిగాను , రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

7.వేషం వేషం రయ్యో అంతా మోసంరయ్యో, రచన:కొసరాజు, గానం.పి . సుశీల

మూలాలు

మార్చు
  1. "Kuthuru Kodalu (1971)". Indiancine.ma. Retrieved 2020-08-24.

. 2.ghantasala galaamrutamu ,kolluri bhaskarrao blog.

బాహ్య లంకెలు

మార్చు