కూర్మా వెంకటరెడ్డి నాయుడు

కూర్మా వెంకటరెడ్డి నాయుడు గారు (1875 - 1942) ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది, ప్రొఫెసర్, రాజకీయవేత్త ప్రజా సేవకులు. మద్రాస్ ప్రెసిడెన్సీ యొక్క ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు.

సర్ కూర్మా వెంకటరెడ్డి నాయుడు KCSI
కూర్మా వెంకటరెడ్డి నాయుడు

కూర్మా వెంకటరెడ్డి నాయుడు


ముఖ్యమంత్రి, మద్రాస్ ప్రెసిడెన్సీ
పదవీ కాలం
1 ఏప్రిల్ 1937 – 14 జూలై 1937
గవర్నరు లార్డ్ ఎర్‌స్కైన్
ముందు బొబ్బిలి రాజా
తరువాత చక్రవర్తి రాజగోపాలాచారి

గవర్నరు, మద్రాస్ ప్రెసిడెన్సీ (యాక్టింగ్)
పదవీ కాలం
18 జూన్ 1936 – 1 అక్టోబర్ 1936
Premier బొబ్బిలి రాజా,
పి.టి.రాజన్

సభ్యుడు, వైస్రాయి కార్యనిర్వాహక సభ
పదవీ కాలం
1934 – 1937
Governor–General థామస్ ఫ్రీమన్,
విక్టర్ హోప్

ప్రతినిధి, దక్షిణ ఆఫ్రికా యూనియన్
పదవీ కాలం
1929 – 1932
చక్రవర్తి ఐదవ జార్జి
Governor–General ఇ.ఎఫ్.ఎల్.వుడ్,
థామస్ ఫ్రీమన్
ముందు వి.ఎస్.శ్రీనివాస శాస్త్రి
తరువాత కున్వర్ మహరాజ్ సింగ్

మినిస్టర్ ఆఫ్ డెవెలప్‌మెంట్
పదవీ కాలం
1920 – 1923
Premier ఎ.సుబ్బారాయలు రెడ్డి,
పానగల్ రాజా
గవర్నరు థామస్ ఫ్రీమన్
ముందు -
తరువాత టి.ఎన్.శివజ్ఞానం పిళ్లై

వ్యక్తిగత వివరాలు

జననం 1875
మరణం 1942
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ జస్టిస్ పార్టీ
వృత్తి రాజకీయనాయకుడు
మతం హిందూ

వీరు రాజమండ్రిలో ప్రఖ్యాత తెలగ సైనిక యోధుల కుటుంబీకులగు బాపనయ్య నాయుడు దంపతులకు జన్మించారు. వీరు యునైటెడ్ హైస్కూలులో చదివి మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. మద్రాసు క్రైస్తవ కళాశాలలో బి.ఎ.పరీక్షలో 1894లో కృతార్థులయ్యారు. రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో ఉపన్యాసకునిగాను, అమలాపురం బోర్డు హైస్కూలులో ఉపాధ్యాయునిగా కొంతకాలం పనిచేసి, వీరు 1900 సంవత్సరంలో బి.ఎల్. పరీక్షలో ఉత్తీర్ణులై రాజమండ్రిలో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. అచిరకాలంలోనే మంచి పేరుతెచ్చుకున్నారు. గోదావరి జిల్లా విభజన తర్వాత ఏలూరుకు నివాసాన్ని మార్చి అక్కడి న్యాయవాదులలో అగ్రశ్రేణికి అందుకున్నారు. కొంతకాలం రాజమండ్రి, ఏలూరు పురపాలక సంఘాలకు అధ్యక్షులుగా పనిచేశారు.

గ్రామ ప్రజల శ్రేయోభివృద్ధికి, వారి ఇబ్బందులను తొలగించడానికి, ప్రారంభ విద్యా వ్యాప్తికి మిక్కిలి కృషిచేశ్తూ స్థానిక సంస్థలలో తన పలుకుబడిని వినియోగించి ప్రజల ఆదరానికి పాత్రులయ్యారు.

వీరు 1929లో జెనీవాలో జరిగిన అంతర్జాతీయ మహాసభా సమావేశానికి భారత ప్రభుత్వ ప్రతినిధిగా వెళ్ళారు. దక్షిణాఫ్రికాలో భారత ప్రభుత్వ ప్రతినిధిగా నియమితులయ్యారు. తరువాత మద్రాసు ప్రభుత్వ లా మెంబరుగా నియమించబడ్డారు. ప్రభుత్వ కార్యనిర్వహక సభ్యులై శాసనసభకు నాయకులయ్యారు. మద్రాసు గవర్నరు ఎర్ స్కిన్ సెలవు పుచ్చుకున్నప్పుడు వీరు మద్రాసు గవర్నరు పదవిని అలంకరించారు.

1936లో ఎన్నికలకు తరువాత, కాంగ్రెస్ పరిపాలన నిరాకరించిన రోజులలో ఉమ్మడి మద్రాసు మధ్యంతర మంత్రి మండలిని ఏర్పరచి మూడు నెలలు ప్రధానిగా పరిపాలన నిర్వహించారు.

1940లో చిదంబరంలో అన్నామలై విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షులయ్యారు. సుప్రసిద్ధ నాటక విమర్శకులు, న్యాయవాది కూర్మా వేణుగోపాల స్వామి వీరి కుమారుడు.

మూలాలు

మార్చు
  • 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.
  • ఆంగ్ల వికీలో వ్యాసం