కృష్ణపట్నం ఓడరేవు
కేపీసీఎల్‌గా పిలువబడే కృష్ణపట్నం ఓడరేవు భారతదేశం తూర్పు తీరంలో అన్ని వాతావరణాలకు అనుకూలంగాఉండి, ప్రైవేటు యాజమాన్యంలో నిర్మించి, నడపుతున్నలోతైన నీటి ఓడరేవు. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఉంది. ఇది చెన్నై నౌకాశ్రయానికి ఉత్తరాన 190 కి.మీ, 18 నెల్లూరు నగరానికి తూర్పున 18 కి.మీ.దూరంలో ఉంది. [2] [3] ఈ నౌకాశ్రయం కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ లిమిటెడ్ (కెపిసిఎల్) యాజమాన్యంలో ఉంది.ఇది 92% ఆధారిత సివిఆర్ గ్రూప్,హైదరాబాదు యాజమాన్యంలో ఉంది. లండన్ ఆధారిత ఈక్విటీ సంస్థ 3ఐ గ్రూప్ పిఎల్సి కెపిసిఎల్‌లో మిగిలిన 8% ఈక్విటీని కలిగి ఉంది. [4]ఓడరేవు చరిత్రలోకి వెళ్లగా దీనిని శ్రీ కృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యంను పరిపాలించేకాలంలో దీనిని నడిపినందున, దీనికి కృష్ణపట్నం పోర్టు అని పేరు నిర్ణయించబడింది.[5] దీనిని కేపీసీఎల్ అని, కృష్ణపట్నం పోర్టు అని అంటారు
కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ లిమిటెడ్ (కెపిసిఎల్) | |
---|---|
దస్త్రం:Krishnapatnamport logo.jpg | |
Location | |
Country | India |
Location | Krishnapatnam |
Details | |
Opened | 2008 |
Operated by | KPCL- Krishnapatnam Port Company Limited |
Owned by | Navayuga Engineering Company Ltd |
No. of berths | 14 |
Statistics | |
Annual cargo tonnage | 45 million tonnes (2017-18)[1] |
Annual container volume | 4,81,408 TEUs (2017-18) [1] |
Annual revenue | ₹1800 crores (2014-15) |
Website http://www.kpcl.com/ |
స్థాపన, స్థాపకులు
మార్చుకృష్ణపట్నం పోర్ట్ (కెపిసిఎల్) భారతదేశంలో ప్రైవేట్ రంగంలో నడపబడుతున్న అతిపెద్ద ఓడరేవు.దీనిని 17 జూలై 2008 న యుపిఎ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ప్రారంభించారు. [6] సివిఆర్ గ్రూప్ ప్రధాన ఓడల యాజమాన్యానికి చెందిన నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ ఈ నౌకాశ్రయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో బిల్డ్-ఆపరేట్-షేర్-ట్రాన్స్ఫర్ (బోస్ట్) ఒప్పందం ప్రకారం నిర్మించింది. ఈ నౌకాశ్రయం 4,553 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.[7] 30 సంవత్సరాల వరకు చెల్లుబాటు అయ్యే, 50 సంవత్సరాల వరకు పొడిగించదగిన (బోస్ట్) ఒప్పందం ప్రకారం నిర్వహణదారులు ఓడరేవు స్థూల ఆదాయంలో 2.6% ను మొదటి 30 సంవత్సరాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెల్లించాలి. 30 వ సంవత్సరం నుండి, ఆ వాటా 5.4%గా, 40 వ సంవత్సరం నుండి 10.8%గా చెల్లించాలి. [8] మొదటి దశ జనవరి 2008 నాటికి, రెండవ దశ 2012 నాటికి, 2017 నాటికి చివరి దశతో మూడు దశల్లో ఓడరేవును అభివృద్ధి చేయాలనే షరతులతో ఈ ఒప్పందం జరిగింది [9] [10]
అనుసంధానం, లోతట్టుప్రాంతం
మార్చుకెపిసిఎల్ 2015 నాటికి సంవత్సరానికి 75 మిలియన్ టన్నుల (ఎంటి) సరుకును రవాణా నిర్వహించేస్థాయికి చేరింది.భారతదేశంలో ఈ ఓడరేవు18.5 మీటర్ల లాగగల సామర్థ్యం ఉన్నలోతైన ఓడరేవు. [4] ఓడరేవు వెనుక భూభాగాన దక్షిణ,మధ్య ఆంధ్రప్రదేశ్,తూర్పు కర్ణాటక, ఉత్తర తమిళనాడు,తూర్పు మహారాష్ట్ర ఉన్నాయి. ఈ నౌకాశ్రయాన్ని చెన్నై-కోల్‌కతా రైలు మార్గానికి 19 కి.మీ దూరం మార్గం ద్వారాజాతీయ రహదారి 16(భారతదేశం)కు అనుసంధానించారు.ఇది నాలుగు వరసల నుండి నుండి ఆరు వరసల రహదారికి పెంచబడింది. [2]
2009 నాటికి నౌకాశ్రయం మొదటి దశ అభివృద్ధికి రు.1400 కోట్ల వ్యయంతో పూర్తయింది.ఈదశలో ఓడరేవు 25 మిలియన్ టన్నుల వార్షిక రవాణాచేేసే సామర్థ్యాన్నిఅభివృద్ధికి చేరుకుంది.[7] ఈ దశలో ఇనుప ఖనిజం రెండు లంగరుదించే యాంత్రికస్థలాలు,బొగ్గు లంగరుదించే యాంత్రికస్థలం,సాధారణ సామానులు లంగరుదించే యాంత్రికస్థలం ఏర్పాటు చేయబడ్డాయి.ఓడరేవు అభివృద్ధి రెండవ దశలో 40 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసేస్థాయికి 2 బిలియన్ల పెట్టుబడితోసామర్థ్యాన్నిపెంచింది.2017 నాటికి ఓడరేవు పూర్తిగా అభివృద్ధి చెంది ఏటా 200 మిలియన్ టన్నుల సరుకు రవాణా నిర్వహించగలస్థాయికి చేరుకుంది.రెండవ దశ విస్తరణలో మొత్తం లంగరుదించే యాంత్రిక స్థలాలను పన్నెండుకు పెంచుతుంది.అందులో సగం బొగ్గురవాణా, మిగిలిన సగం సాధారణ సరుకును ఏకమొత్తంలో భారీ వాహనాల ద్వారా రవాణా నిర్వహిస్తుంది. ఓడరేవు సామార్థ్యం స్థాయిని ప్రస్తుత 18 మీటర్ల నుండి 21 మీటర్లకు పెంచబడుతుంది. [11]
భారీవాహన చివరి మజిలీ
మార్చుకెపిసిఎల్ సెప్టెంబరు 2012 ల, తన భారీఓడల మజిలీలను సంవత్సరానికి 1.2 మిలియన్ ప్రామాణిక భారీవాహనాలు నిర్వహించగల సామర్థ్యాన్ని ప్రారంభించింది. ఈ మజిలీలలో 5 పనామాక్సు బరువులను ఎత్తి దించే యంత్రం, 650 మీటర్ల నిడివితో రెండు సరుకుదించే స్థలాలు,13.5 మీటర్ల లోతులోఉన్న నీటి మార్గాలు ఉన్నాయి.ఇది 8,000 భారీ డబ్బాలను మోసుకెళ్ళే పెద్ద ఓడలను మరమతు చేయటానికి ఈ స్థలం వీలు కల్పిస్తుంది. దాని అభివృద్ధి రెండవ దశ రు.11,000 కోట్లు పెట్టుబడితో, మరొక 4.8 మిలియన్ టన్నుల సామర్ధ్యం విస్తరణకు అవకాశం కలిగింది. ఓడరేవు ద్వారా వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి కెపిసిఎల్ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాన్కోర్) తో ఓడరేవు వద్ద కంటైనర్ ఫ్రైట్ స్టేషన్, నౌకాశ్రయంతో సంబంధంగల లోతట్టు ప్రాంతంలో భారీ వాహనాల విలుపుదల స్థలం అభివృద్ధి చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. [12] [13] [14]సరుకు రవాణాచేసే కొన్ని అంతర్జాతీయ భారీ ఓడలు, క్రియాశీల మార్గాల చొరవలను అనుసరించి కృష్ణపట్నం ఓడరేవు అంతిమ స్థావరం, తూర్పుతీరంలో పారదర్శకంగా సరుకు రవాణా కేంద్రంగా ఏర్పడింది.[15]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Krishnapatnam port's cargo handling up by 25%". The Hindu. 20 April 2018. Retrieved 22 May 2019.
- ↑ 2.0 2.1 "Chennai port loses out to new facility". The Hindu. 11 June 2012. Retrieved 22 November 2012.
- ↑ "FOCUS: NELLORE DISTRICT". Frontline. 30 (03). 9–22 February 2013. Retrieved 17 February 2013.
- ↑ 4.0 4.1 "New port plan raises viability concerns for Krishnapatnam". 20 November 2012. Retrieved 22 November 2012.
- ↑ "About The Port". Krishnapatnam Port. Archived from the original on 7 ఫిబ్రవరి 2016. Retrieved 8 June 2015.
- ↑ "Andhra to get new port in Krishnapatnam". Economic Times. 11 July 2008. Retrieved 22 November 2012.
- ↑ 7.0 7.1 "Krishnapatnam Port gets Rs4,000 cr for next phase". 18 March 2009. Retrieved 22 November 2012.
- ↑ "Krishnapatnam Port plans to set up car terminal by Jun 2013". Retrieved 22 November 2012.
- ↑ "Krishnapatnam port to give fillip to ore exports". The Economic Times. 17 October 2005. Retrieved 22 November 2012.
- ↑ "3i Fund picks up stake in Krishnapatnam Port for $161 mn". The Economic Times. 24 February 2009. Retrieved 22 November 2012.
- ↑ "Krishnapatnam Port begins operations; to invest $2 billion in 2nd phase". 27 September 2012. Retrieved 22 November 2012.
- ↑ "Krishnapatnam Port ties up with CONCOR". The Hindu. 5 July 2011. Retrieved 22 November 2012.
- ↑ "Krishnapatnam to Singapore feeder service begins". 27 September 2012. Retrieved 22 November 2012.
- ↑ "Krishnapatnam Port starts operating container terminal". 27 September 2012. Retrieved 22 November 2012.
- ↑ "Krishnapatnam port terminal set to emerge as a hub". 6 March 2017. Retrieved 6 March 2017.