కొండముది గోపాలరాయశర్మ

(కె.జి.శర్మ నుండి దారిమార్పు చెందింది)

కొండముది గోపాలరాయశర్మ ప్రముఖ నాటక, సినీ రచయిత.[1] సామాజిక ఇతివృత్తంతో నాటకాలు రాసేవాడు.

కొండముది గోపాలరాయశర్మ
జాతీయతభారతీయుడు
వృత్తినాటక, సినీ రచయిత

నాటకరంగ ప్రస్థానం మార్చు

ఆంధ్ర నాటక కళా పరిషత్తు నాటకపోటీలు ప్రారంభమైన తొలిరోజుల్లో నాటక రచనలు చేశాడు. ఈయన తొలి నాటకమైన ఎదురీతను ఆంధ్ర నాటక కళా పరిషత్తు వారు ముద్రించారు. గోపాలరాయశర్మ రచనలు సామాజిక ఇతివృత్తాన్ని కలిగి ఉంటాయి.

రచించిన నాటకాలు మార్చు

  • ఎదురీత (1945): కులాంతర వివాహం చేసుకోవాలనుకునేవాళ్లకి సమాజంలో ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వుతాయో, వాటిని ఎదుర్కొని ఎలా విజయం సాధించారో ఈ నాటకంలో చూపించబడింది. దీనికి ఆంధ్ర నాటక కళా పరిషత్తు పోటీలలో ఉత్తమ రచన, ప్రదర్శనల విభాగంలో బహుమతులు లభించాయి.[2]
  • ఇదీలోకం (1946): పెట్టబడిదారుల అరాచకాలు, పేదవారి ఆకలి చావుల గురించి ఈ నాటకంలో చెప్పబడింది.
  • న్యాయం (1947): అగ్ర తరగతులవారిచే మధ్య తరగతివారికి కలిగిన అవమానాలను ఈ నాటకంలో చూపించబడింది.
  • ఏకదేశం (1947): ఇది చారిత్రక నాటకం ఆంగ్లేయుల రాక నుండి స్వాతంత్ర్యం వచ్చినంతవరకు జరిగిన సంఘటనలను ఇందులో చూపబడింది.
  • గౌతమబుద్ధ (1949)

మాలాలు మార్చు

  1. కొండముది గోపాలరాయశర్మ, తెలుగు నాటక వికాసము, పి.ఎస్.ఆర్. అప్పారావు, నాట్యమాల ప్రచురణ, ప్రథమ ముద్రణ (డిసెంబర్ 23, 1967), పుట. 424.
  2. సమాజ దర్పణం ఎదురీత, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 3 జూలై 2017, పుట.14