కె.నాగమణి
కె.నాగమణి తెలుగు చలనచిత్ర నిర్మాతలలో ఒకరు. ఈయన ప్రముఖ నటీమణులు శ్రీరంజని సీనియర్, శ్రీరంజని జూనియర్‌ల భర్త. తెలుగు చలనచిత్ర రంగంలో ప్రముఖ దర్శకుడు ఎం.మల్లికార్జునరావు ఈయన, శ్రీరంజని సీనియర్ల ముగ్గురు కుమారులలో పెద్దవాడు.
వైవాహిక జీవితం
మార్చునాగమణి గారు బెజవాడ హనుమాన్‌దాసు గారి దగ్గర హార్మోనియం నేర్చుకున్నారు. శ్రీరంజని కూడా హనుమాన్ దాసు గారి దగ్గరే సంగీతం నేర్చుకుంది. శ్రీరంజని నాటకాలలో నటిస్తున్నప్పుడు నాగుమణి గారు హార్మోనియం వాయించేవారు. పరిచమయిన కొన్నాళ్ళకి వారిద్దరు భార్యాభర్తలయ్యారు. వారికి ఇద్దరు పిల్లలు కలిగారు. శ్రీరంజని తను చనిపోయేముందు పిల్లల సంరక్షణార్థం తన భర్తను తన చెల్లెలు మహాలక్ష్మిని పెళ్ళి చేసుకోమని చెప్పారు. తర్వాత ఆమె పేరును కూడా శ్రీరంజనిగా మార్చారు. ఆవిడ శ్రీరంజని జూనియర్ గా ప్రసిద్ధి పొందారు, అందువలనే శ్రీరంజనికి సీనియర్ శ్రీరంజని అని పేరు వచ్చింది.
చలనచిత్రరంగ జీవితం
మార్చునాగమణి గారు ఎస్.ఆర్.మూవీస్ పేరుతో ఒక చలనచిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి, మహాకవి కాళిదాసు (1960), ప్రమీలార్జునీయం (1965) వంటి చిత్రాలను నిర్మించారు.