కె.యల్.ఎన్.ప్రసాద్

కె.యల్.ఎన్. ప్రసాద్ (1928 - 1987) భారత పార్లమెంటు సభ్యులు. ప్రముఖ పారిశ్రామిక వేత్త. ఆంధ్రజ్యోతి తెలుగు దినపత్రిక వ్యవస్థాపకులు.[1]

కానూరి లక్ష్మీ నారాయణ ప్రసాద్ (కె.యల్.ఎన్. ప్రసాద్) గారు కృష్ణా జిల్లా కౌతవరం గ్రామంలో 1928 జనవరి 1 న కానూరి దామోదరయ్య, శాంతమ్మ దంపతులకు జన్మించారు. వీరి ధర్మపత్ని శ్రీమతి ప్రభావతి. వీరికి ఐదుగురు కుమారులు ఇద్దరు కుమార్తెలు.

పారిశ్రామిక వేత్త

మార్చు
 
ఆంధ్రజ్యోతి మొదటిపేజీ 1961, ఆగస్టు, 1

సామన్యమైన చదువుతో అసమాన్యమైన స్థాయికి చేరిన వ్యక్తి. ప్రముఖ సంపాదకుడు నార్ల వెంకటేశ్వరరావు గారి కొరకు కె.యల్.ఎన్.ప్రసాద్ గారు మరికొందరు మిత్రులతో కలసి 1960 జూలై 1న ఆంధ్ర జ్యోతి దిన పత్రికను విజయవాడలో ప్రారంభించారు. ఆంధ్రా బ్యాంకు, లక్ష్మీ ఫిలింస్ వంటి వ్యాపార సంస్థలను నిర్వహించారు.ఆంధ్ర ప్రదేశ్ వాణిజ్యమండలి అధ్యక్షునిగా, ప్రభుత్వ ఆర్ధిక సంఘం చైర్ మన్ గా పనిచేసారు. విజయవాడ మేరిస్ స్టెల్లా మహిళా కళాశాల పాలకవర్గ కమిటీ అధ్యక్షునిగా పనిచేసారు.[1]

రాజకీయ జీవితం

మార్చు

1970 ఏప్రియల్ 3 న జాతీయ కాంగ్రెస్ తరుపున మొదటి సారి రాజ్యసభకు ఎన్నికైనారు. ఆ తరువాత 1976 లోను 1982 లోనూ వరుసగా రాజ్య సభకు ఏన్నికై 1987 జూలై 16 వరకు 17 సంవత్సరాలు పాటు మరణించే వరకు సభ్యునిగా పనిచేసారు.[2]

కె.యల్.ఎన్. ప్రసాద్ గారు తన 59 ఏళ్ళ వయస్సులో 1987 జూలై 16న మరణించారు.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 కొత్త, భావయ్య చౌదరి (2005). కమ్మవారి చరిత్ర. గుంటూరు: పావులూరి పబ్లికేషన్. p. 223.
  2. "RAJYA SABHA MEMBERS BIOGRAPHICAL SKETCHES 1952 - 2003" (PDF). Rajya Sabha. Retrieved 16 April 2018.