కె.వి.పాలెం
కూనంనేని వారి పాలెం, ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°36′N 79°54′E / 15.6°N 79.9°ECoordinates: 15°36′N 79°54′E / 15.6°N 79.9°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | చీమకుర్తి మండలం |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( ) |
పిన్‌కోడ్ | 523 263 ![]() |
గ్రామ పంచాయతీసవరించు
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో రాయపూడి కోటయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. ఉప సర్పంచిగా కూనంనెని శ్రీనివాసరావు ఎన్నికైనారు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలుసవరించు
శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయంసవరించు
ఈ ఆలయంలో స్వామివారి వార్షిక తిరునాళ్ళు, ప్రతి సంవత్సరం వైశాఖమాసం (మే నెల) లో వైభవంగా నిర్వహించెదరు.
బొడ్డురాయి ప్రతిష్ఠసవరించు
ఈ గ్రామంలో 2014, ఆగస్టు-9వ తేదీ నుండి 11వ తేదీ వరకు పూజలు, హోమాలు నిర్వహించి, 11వ తేదీ సోమవారం ఉదయం, బొడ్డురాయి ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించెదరు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించెదరు.
ఈ గ్రామములో శీతలాంబ, నాభిశిల ప్రతిష్ట వేడుకలు నిర్వహించి మూడు సంవత్సరాలయిన సందర్భంగా, 2017,ఆగష్టు-13వతేదీ ఆదివారంనాడు, ఉత్సవాలు నిర్వహించినారు. ముందుగా మహిళలు పొంగళ్ళతో నాభిశిల వద్దకు చేరుకుని, పూజలు నిర్వహించినారు, నైవేద్యాలు సమర్పించినారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీ మడియాలమ్మ తల్లి విగ్రహంసవరించు
ఈ గ్రామములోని చాకలికుంట వద్ద, రజకుల ఇలవేల్పు అయిన మడియాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2016, ఫిబ్రవరి-11, గురువారంనాడు వైభవంగా నిర్వహించారు. చీమకుర్తి నుండి విగ్రహాన్ని గ్రామంలోనికి ఊరేగింపుగా తీసుకొని వచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిసరప్రాంతాలనుండి అధికసంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.
సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు
నాయుడు చెరువు:- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, 2015, ఆగస్టు-11వ తేదీనాడు, ఈ చెరువులో పూడికతీత పనులు చేపట్టినారు. జే.సి.బి.యంత్రం పూడికతీయుచుండగా రైతులు ట్రాక్టర్లతో పూడిక మట్టిని తమ పొలాలకు తరలించుకొనుచున్నారు. ఈ విధంగా చేయుట వలన, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరుగుటయేగాక, తమ పొలాలకు వేయవలసిన రసాయనిక ఎరువుల ఖర్చు గణనీయంగా తగ్గుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన పంటలుసవరించు
ప్రధాన వృత్తులుసవరించు
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ విశేషాలుసవరించు
ఈ గ్రామానికి చెందిన శ్రీ నల్లూరి వెంకటశేషయ్య, చిన్నప్పటినుండి ఎంతో కష్టపడి, ప్రభుత్వ పాఠశాలలో చదివి, విదేశాలలో స్థిరపడి సాఫ్ట్ వేర్ కంపెనీ అధినేతగా ఎదిగినా, తన జన్మభూమిని మర్చిపోకుండా, గ్రామాన్ని దత్తత తీసుకొని, వి.ఎస్.నల్లూరి ఫౌండేషను ద్వారా గ్రామాభివృద్ధికి తోడ్పడుచున్నారు.