కొచ్చక్కన్ చాకో అబ్రహాం 1978 ఆగస్టు 15 నుండి 1983 ఆగస్టు 14 వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా ఉన్నాడు.[1][2] ఈయన భారత జాతీయ కాంగ్రేసుకు చెందిన రాజకీయనాయకుడు, గాంధేయవాది.

కె.సి.అబ్రహాం
ఆంధ్రప్రదేశ్ గవర్నరు
In office
ఆగస్టు 15 1978 – ఆగస్టు 14 1983
అంతకు ముందు వారుశారద ముఖర్జీ
తరువాత వారురామ్‌ లాల్
కేరళ శాసన సభ్యుడు
In office
మార్చి 16 1957 – సెప్టెంబరు 10 1964
తరువాత వారుఎ.ఎస్.పురుషోత్తమన్
నియోజకవర్గంనరక్కల్ నియోజకవర్గం
తిరుకొచ్చి శాసన సభ్యుడు
In office
1954–1956
అంతకు ముందు వారురామకృష్ణన్
వ్యక్తిగత వివరాలు
జననం
కొచ్చక్కన్ చాకో అబ్రహాం

(1899-01-20)1899 జనవరి 20
మరణం1986 మార్చి 14(1986-03-14) (వయసు 87)
రాజకీయ పార్టీకాంగ్రెస్
జీవిత భాగస్వామిఎలిజబెత్
సంతానం1
తండ్రికొచ్చక్కన్ చాకో
As of జూలై 8, 2021

ప్రారంభ జీవితం మార్చు

అబ్రహాం 1899, జనవరి 20న కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్లో జన్మించాడు. ఈయన తండ్రి కొచ్చక్కన్ చాకో. పట్టభద్రుడైన తర్వాత 30 ఏళ్ళపాటు పాఠశాల అధ్యాపకుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశాడు.

రాజకీయాల్లో మార్చు

అధ్యాపక వృత్తినుండి విరమణ పొందిన తర్వాత అబ్రహాం క్రియాశీలక రాజకీయల్లోకి అడుగుపెట్టాడు. అబ్రహాం 1954 నుండి 1956 వరకు ట్రావెంకూరు శాసనసభ సభ్యుడిగా ఉన్నాడు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటవ, రెండవ కేరళ శాసనసభల్లో నరక్కల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు.[3][4] 1964లో కేరళ పిసిసి అధ్యక్షుడుగా పనిచేశాడు. 1969లో జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ చీలినప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. 21 మంది కమిటీ సభ్యుల్లో, పది మంది సిండికేటుకు, పది మంది ఇందిరకు మద్దతుగా చీలినప్పుడు, కె.సి.అబ్రహాం సిండికేటు వైపు మొగ్గుచూపినా, ఈయన ఇరువర్గాలకు సయోధ్య కుదుర్చటానికి మధ్యవర్తిత్వం వహించాడు. చర్చలు విఫలమై చివరకు అబ్రహాం సిండికేటుకు మద్దతివ్వడంతో భారత జాతీయ కాంగ్రెస్ నుండి ఇందిరా గాంధీ బహిష్కరణకు గురైంది.

వ్యక్తిగత జీవితం మార్చు

ఈయన భార్య ఎలిజబెత్. వీరి ఏకైక సంతానం, వీరి కుమారుడు కొచ్చిలో ప్రముఖ హృదయవైద్యుడు. అబ్రహాం 1986 మార్చి14న మరణించాడు.

మూలాలు మార్చు

  1. "Former governors of Andhra Pradesh". Archived from the original on 2014-04-03. Retrieved 2017-10-20.
  2. "OMC alumni to fight against medical reimbursement". Archived from the original on 2014-01-09. Retrieved 2017-10-20.
  3. "K. C. Abraham".
  4. "Governor row". 30 April 1986.