కె.సీతారామపురం (రాజుగారి నరసన్నపాలెం)

కె.సీతారామపురము కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని రెవన్యూయేతర గ్రామం.

కె.సీతారామపురం
—  రెవెన్యూయేతర గ్రామం  —
కె.సీతారామపురం is located in Andhra Pradesh
కె.సీతారామపురం
కె.సీతారామపురం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°37′11″N 80°57′47″E / 16.619771°N 80.962933°E / 16.619771; 80.962933
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం బాపులపాడు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి సుదిమెళ్ళ భాగ్యం
పిన్ కోడ్ 521105
ఎస్.టి.డి కోడ్ 08656

గ్రామంలోని విద్యాసౌకర్యాలు

మార్చు

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

మార్చు

3 చెరువులు.

గ్రామ పంచాయతీ

మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి సుదిమెళ్ళ భాగ్యం, సర్పంచిగా ఎన్నికైనారు. [1]

గ్రామంలో ప్రధాన పంటలు

మార్చు

వరి, అపరాలు, కూరగాయలు, చేపలు పెంపకం

గ్రామంలో ప్రధాన వృత్తులు

మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

మార్చు
  1. ఎక్స్ సర్పంచి:: శ్రీ బళ్ళా వసంతరావు.
  2. ఎక్స్ సెక్రటరి:: శ్రీ బళ్ళా వెంకటేశ్వర రావు.
  3. ఈ గ్రామం నుండి అమెరికా, ఇంగ్లాండ్, సింగపూర్, కెనడా మొదలగు విదేశాలకు వెళ్ళినవారు చాలామంది కలరు. ఈ గ్రామం రాజులకు ప్రసిద్ధి. హనుమాన్ జంక్షన్ లారీ ట్రాన్స్ పోర్ట్ వ్యాపారములో ఈ ఊరికి ప్రత్యేక స్థానం ఉంది.
  4. ఈ గ్రామం త్వరలోనే కొత్తకళ సంతరించుకొనబోవుచున్నది. గ్రామంలోని చెరువుల అభివృద్ధి, శ్మశానవాటికలోని సౌకర్యాలతోపాటు, వాకింగ్ ట్రాక్, మిని ట్యాంక్ బండ్ వంటివి సాకారం కాబోతున్నవి. స్థానిక రాయలహంపి వ్యాపారసంస్థల అధునేత శ్రీ కనుమూరి రాజాబాబు, ఈ రకమైన గ్రామాభివృద్ధి పనులు చేపట్టడానికి ఇందుకు ముందుకు వచ్చారు. [2]

గ్రామ విశేషాలు

మార్చు

కె.సీతారామపురం గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా అభివృద్ధి చేయడానికై, ఈ గ్రామాన్ని, మండల తె.దే.పా.అధ్యక్షులు చెన్నుబోయిన శివయ్య దత్తత తీసుకున్నారు. [3]

మూలాలు

మార్చు


వెలుపలి లంకెలు

మార్చు

[1] ఈనాడు విజయవాడ; 2014,జనవరి-7; 5వపేజీ. [2] ఈనాడు విజయవాడ; 2014,సెప్టెంబరు-29; 4వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2016,జనవరి-5; 4వపేజీ.