హనుమాన్ జంక్షన్

ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా, బాపులపాడు మండల గ్రామం

ఇదే పేరుతో ఉన్న తెలుగు సినిమా హనుమాన్ జంక్షన్ గురించి చూడండి.

హనుమాన్ జంక్షన్
—  రెవిన్యూ గ్రామం  —
హనుమాన్ జంక్షన్ is located in Andhra Pradesh
హనుమాన్ జంక్షన్
హనుమాన్ జంక్షన్
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°38′08″N 80°58′19″E / 16.635472°N 80.971845°E / 16.635472; 80.971845
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం బాపులపాడు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521105
ఎస్.టి.డి కోడ్ 08656
నాలుగు రోడ్ల కూడలిలో అభయాంజనేయ స్వామి ఆలయం.
మెయిన్ రోడ్‌పై ఒక దృశ్యం

హనుమాన్ జంక్షన్ , కృష్ణా జిల్లా, బాపులపాడు మండలానికి చెందిన గ్రామం.

గ్రామ చరిత్ర

మార్చు

పట్టణం అభివృద్ధి

మార్చు
 
హనుమాన్ జంక్షన్ పాల ఉత్పత్తిదారుల సహకార సంస్థ

ముందు ఒక పల్లెటూరుగా ఉన్న ఈ జనావాసం లారీ రవాణా కేంద్రంగానూ, వ్యాపార కేంద్రంగానూ అభివృద్ధి చెందుతున్నది.

1950 దశకంలో చుట్టుప్రక్కల ప్రాంతాలనుండి జనులు ఇక్కడికి వచ్చి స్థిరపడడం మొదలయ్యింది. జాతీయరహదారిపైన ఉన్నందున మొదట్లో హోటళ్ళు వ్యాపారం సాగింది. ఇంద్రభవన్ అనే హోటల్ (ఇప్పుడు ఇది మూత పడింది. ప్రస్తుతం విజయవాడ రోడ్‌లో ఉన్న ఇంద్ర భవన్, ఇది ఒకటి కాదు), రామా స్వీట్స్ (ఇది కూడా మూతపడింది) ఇక్కడ సాగిన మొదటి దుకాణాలలో కొన్ని.

 • 1960 దశకంలో హనుమాన్ కో‌-ఆపురేటివ్ షుగర్స్' అనే చక్కెర ఫ్యాక్టరీ సమీపంలో వీరవల్లి వద్ద ప్రారంభించారు. ఇది తరువాత డెల్టా షుగర్స్ అనే ప్రైవేటు కంపెనీగా మారింది. (అమ్మబడింది)[1] ఈ పరిశ్రమ మొదలయిన తరువాత సమీప గ్రామాలలో వరి బదులు చెరకు వ్యవసాయం బాగా పెరిగింది. దానితోపాటు వ్యవసాయ కార్మికుల వలసలు కూడా అధికమయ్యాయి. పట్టణం నాలుగు రోడ్ల వెంటా జనావాసాలు, దుకాణాలు విస్తరించాయి. కోళ్ళ ఫారాలు, పొగాకు వ్యాపారం, పశువుల మారుబేరం, సినిమా హాళ్ళు, బియ్యపు మిల్లులు బాగా పెరిగాయి.
 • హనుమాన్ జంక్షన్‌లో జరిగే పశువుల సంత రాష్ట్రంలోనే అతి పెద్దది కావచ్చును. ప్రతి మంగళవారం, బుధవారం ఈ సంత జరుగుతుంది. కాని ప్రస్తుతం దుక్కి దున్నడానికి ట్రాక్టర్ల వాడకం పెరిగినందువలన ఈ సంతలో అమ్మకాలు కొంత తగ్గాయి. 1980 దశకంలో విజయ కోపరేటివ్ పాల పరిశ్రమ మొదలయ్యింది. ఇది లాభాలలో నడుస్తున్న కొద్ది సహకార పాలపరిశ్రమలలో ఒకటి.
 • అయితే హనుమాన్ జంక్షన్‌లోని వ్యాపారం ప్రధానంగా రవాణా వాణిజ్యానికి (స్పేర్ పార్టులు, రిపేరులు, లారీ సప్లై వంటివి) సంబంధించినదిగా ఉంటున్నది. 1990-2000 కాలంలో NH5 విస్తరణ కొఱకు చాలా నిర్మాణాలను పడగొట్టారు. తరువాత వాణిజ్యం జంక్షన్‌కు కాస్త దూరంగా పెద్ద పెద్ద భవనాలలోకి మారింది.

గ్రామం పేరు వెనుక చరిత్ర

మార్చు

ఇది కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దులో ఉంది. నాలుగు ముఖ్య పట్టణాల కూడలి గనుక ఇది "జంక్షన్" అని వ్యవహరింప బడుతుంది. ప్రధాన కూడలి నుండి నాలుగు రోడ్లను ఏలూరు రోడ్,గుడివాడ రోడ్, నూజివీడు రోడ్, విజయవాడ రోడ్ - అనిపిలుస్తారు.

సమీప గ్రామాలు

మార్చు

సీతారాంపురం ఆంధ్ర పురం బొమ్ములూరు మల్లవల్లి కనుమలు నూజివీడు రైల్వేస్టేషన్

గ్రామానికి రవాణా సౌకర్యాలు

మార్చు

రోడ్లు

మార్చు

ఐదవ నెంబరు జాతీయ రహదారి 5 (NH5) (కలకత్తా - మద్రాసు రోడ్డు) [2], బందరు-నూజివీడు రోడ్లు ఇక్కడ "హనుమాన్ మందిరం" వద్ద కలుస్తాయి. ఈ నాలుగురోడ్ల కూడలిలో అభయాంజనేయస్వామి మందిరం ఉంది. ఇక్కడి ఆంజనేయ స్వామి విగ్రహం ముఖంలో వానర లక్షణాలకంటే మానవ ముఖం లక్షణాలు అధికంగా కనిపిస్తాయి. స్వామి పాదాలు పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల సరిహద్దుగా ఉన్నాయి. ఈ స్వామి భయాలను హరించి రక్షణనిస్తాడని ఇక్కడివాఱి నమ్మకం.

ఇక్కడినుండి ఉన్నరోడ్లు

మార్చు

రైలు మార్గం

మార్చు

ఈ గ్రామానికి 1.9 కి.మీ.ల దూరంలో నూజివీడు రైల్వే స్టేషను ఉంది. విజయవాడ, ఏలూరు నగరాల వైపు ఇక్కడి నుండి రైలు సదుపాయం ఉంది.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

మార్చు
 1. గీతాంజలి పాఠశాల.
 2. ఆదిత్య బధిర పాఠశాల.
 3. సిద్ధార్థ పబ్లిక్ స్కూల్
 4. సాయి గౌతం పబ్లిక్ స్కూల్
 5. బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్
 6. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాపులపాడు
 7. ప్రాథమిక పాఠశాల రైల్వే స్టేషన్

గ్రామంలో మౌలిక వసతులు

మార్చు

బ్యాంకులు

మార్చు
 1. ది కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్.
 2. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
 3. కార్పొరేషన్ బ్యాంక్:- హనుమాన్ జంక్షనులో ఈ బ్యాంకు శాఖను, 2015,మార్చి-12వ తేదీ గురువారం నాడు ప్రారంభించారు. విజయవాడ జోనులో ఇది 89వ శాఖ, జిల్లాలో ఇది 20వ శాఖ. [7]
 4. యుకో బ్యాంక్ (UCO Bank):- హనుమాన్ జంక్షనులో ఈ బ్యాంక్ శాఖను 2015,మే-27, ఉదయం 11 గంటలకు ప్రారంభించారు. [10]

గ్రామానికి త్రాగునీటి సౌకర్యం

మార్చు

శ్రీ అభయాంజనేయస్వామి త్రాగునీటి పథకం

మార్చు

హనుమాన్ జంక్షన్ స్థాపన, అభివృద్ధికి కారకుడిగా భావించే శ్రీ అభయాంజనేయస్వామి పేరుమీద ఒక త్రాగునీటి పథకం ప్రారంభింంచాలనే కోరికతో శ్రీ నందిగం అప్పారావు అను భక్తుడు, తనకు వేలేరు గ్రామంలో ఉన్న కొద్దిపాటి స్థలాన్నీ, హనుమాన్ జంక్షనులోని ఆంజనేయస్వామికి విరాళంగా ఇవ్వడమేగాక, ఈ పథకానికి అవసరమైన భవన నిర్మాఅనికి ఒక లక్ష రూపాయల నగదును గూడా అందజేసినారు. ధర్మకోనేరు చెరువుగట్టున ప్రారంభమైన భవన నిర్మాణం పూర్తికాకముందే ఆయన రహదారి ప్రమాదంలో అసువులుబాసినారు. అయినా ఆయన సంకల్పాన్ని సాకారం చేయాలనే ఉద్దేశంతో, గ్రామపెద్దలు పూనుకొని, నీటిశుద్ధియంత్రాలను ఏర్పాటుచేసి, ఈ పథకాన్ని పూర్తిచేసారు. ఒకటిన్నర నెలలనుండి, గ్రామస్థులకు శుద్ధినీటిని అందించుచున్నారు. [9]

పరిపాలన

మార్చు

నియోజకవర్గాల పునర్విభజన అనంతరం హనుమాన్ జంక్షన్, ఇప్పుడు గన్నవరం శాసనసభ నియోజకవర్గంలో ఉంది.

గ్రామ పంచాయతీ

మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి kakani aruna garu, సర్పంచిగా ఎన్నికైనారు. [4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయం

మార్చు

ఈ ఆలయం స్థానిక నూజివీడు రహదారిపై ఉంది. ఈ ఆలయంలో ధనుర్మాసం ఉత్సవాలు ప్రతి సంవత్సరం వైభవంగా నిర్వహించెదరు. [5] ఈ ఆలయ 31వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 2016,మే-1వ తేదీ ఆదివారంనాడు, స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. 2వతేదీ సోమవారం ఉదయం స్వామివారికి మూలమంత్ర హోమం నిర్వహించారు. ఆఖరిరోజైన 3వతేదీ మంగళవారంనాడు, ఉదయం మహాపూర్ణాహుతి, కొట్నాలు, అవభృత చక్రస్నానం నిర్వహించారు. సాయంత్రం ధ్వజారోహణం, ద్వాదశ ప్రదక్షిణలు నిర్వహించారు. [11]

అభయాంజనేయస్వామి ఆలయం

మార్చు

ఈ ఆలయంలో వాహన పూజలు అధికంగా జరుగుతాయి.

శ్రీరామమందిరం

మార్చు

స్థానిక అభయాంజనేయస్వామి కూడలిలో ఉన్న ఈ ఆలయం 1934లో అప్పటి నూజివీడు జమీందారులచే నిర్మితమైనది.

శ్రీ కోదండరామాలయం

మార్చు

ఈ ఆలయం తిమ్మనీడు ప్రాంతంలో ఉంది.

భారీ ఆంజనేయస్వామి విగ్రహo

మార్చు

ఈ గ్రామంలోని నూజివీడు రహదారి వద్ద, మచిలీపట్నం - కల్లూరు రాష్ట్ర రహదారిపై, రైల్వే పై వంతెన (ఫ్లైవోవరు) సమీప ంలోని శ్రీ సీతారామాలయంలో నిర్మించనున్న 45 అడుగుల ఎత్తయిన భారీ ఆంజనేయస్వామి విగ్రహానికి, 2013 నవంబరు 20 నాడు, శంకుస్థాపన మరియూ భూమిపూజ, జరిగింది. 16 అడుగుల ఆధారపీఠం, ఆపైన 3 అడుగుల పద్మపీఠం పైన, 45 అడుగుల ఎత్తయిన స్వామివారి విగ్రహం ఉంటుంది. రు. 20 లక్షల అంచనా వ్యూయంతో నిర్మించిన ఈ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015,ఫిబ్రవరి-20వ తేదీ శుక్రవారం నుండి 23వ తేదీ సోమవారం వరకు నిర్వహించారు. చివరి రోజైన 23వ తేదీ, సోమవారం ఉదయం ప్రాణప్రతిష్ఠ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుఝామున స్వామివారి ఉత్సవ విగ్రహాలకు చతుస్నానార్చనలు నిర్వహించిన తరువాత, తొమ్మిది గంటలకు మహాపూర్ణాహుతి, 10-26 కి కుంభప్రోక్షణ ప్రతిష్ఠా కార్యక్రమం, గోదర్శనం, దర్పణదర్శనం, దిష్టికుంభం, మహా హారతి నిర్వహించారు. అనంతరం దాసాంజనేయస్వామివారి ఆలయంలో శాంతికళ్యాణం, అన్నసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, విశేషంగా వేల సంఖ్యలో పాల్గొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. [1], [3] & [6]

శ్రీ హరిహర అమరజ్యోతి ప్రమీలారాణి పేరంటాలు అమ్మవారి ఆలయం

మార్చు

ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక సంబర మహోత్సవాలు, 2015,మార్చి-21వ తేదీ శనివారం, ఉగాది రోజున నిర్వహించెదరు. ఉదయం 11 గంటలకు గోవిందమాంబ, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారలకు కళ్యాణం నిర్వహించి, కళ్యాణమూర్తులను, పేరంటాలు అమ్మవార్లను, సాయంత్రం ఊరేగించెదరు. రాత్రి 7 గంటలకు అన్నసమారాధన, అనంతరం భక్తిరంజని కార్యక్రమాలు నిర్వహించెదరు. [8]

శ్రీ అష్టలక్ష్మీసమేత శ్రీ లక్ష్మీనారాయణస్వామివారి ఆలయం

మార్చు

హనుమాన్ జంక్షన్ ఏలూరు రహదారిలో ఉన్న అప్పనవీడులో, మహావిష్ణు లోకకళ్యాణసమితి ఆధ్వర్యంలో, 2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ ఆలయానికి, 2016,ఫిబ్రవరి-28, ఆదివారంనాడు శంకుస్థాపన నిర్వహించెదరు. ఈ ఆలయ ప్రాంగణంలో, 29 అడుగుల గాలిగోపురం, వేదగాయత్రి ఆగమ పాఠశాల, నందగోకులం గూడా నిర్మించెదరు [11]

గ్రామంలో ప్రధాన వృత్తులు

మార్చు

వ్యవసాయం

మార్చు

మెరక వ్యవసాయమూ,పల్లపు వ్యవసాయమూ కూడా బాగా జరుగుతాయి. వరి, చెరకులతో పాటు ఆయిల్ పామ్ సాగు కూడా పెరిగింది. అంపాపురం వద్ద నూనెమిల్లులో పామాయిల్ ఉత్పత్తి జరుగుతున్నది.

గ్రామ ప్రముఖులు

మార్చు
 1. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ తోట సోమేశ్వరరావు గారు బందరు మండలం చిన్నాపురంలో జన్మించారు. వీరు తన 11వ ఏటనే హనుమాన్ జంక్షనుకు తరలి వచ్చారు. వీరు గాంధేయవాదం పట్ల ఆకర్షితులై, స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా, ఆయనపై కేసులుగూడా నమోదైనవి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాతగూడా, ఆయన ఖద్దరు ధారణకూ, గాంధేయవాదానికీ కట్టుబడి జీవించారు. అదే విధానం ప్రాతిపదికగా, ప్రభుత్వం ఇస్తానన్న సమరయోధుల పింఛనుగాడా తిరస్కరించారు. వీరు మంచి నాటకకళాకారుడిగా గూడా ప్రసిద్ధులు. వీరు తన 96వ ఏట, హనుమాన్ జంక్షనులో, 2014,జనవరి-23న, అనారోగ్యంతో కన్నుమూశారు. [2]
 2. ప్రముఖ దాత, దుట్టా సీతయ్య గారు, దుట్టా రామచంద్రరావు గారు కూడా ఈ గ్రామానికి చెందినవారు. హనుమాన్ సుగర్స్ ఇక్కడ ఏర్పడడానికి వీరి సహాయ సహకారాలు ఎంతో తోడ్పాటు నిచ్చాయి. మరొక్క ముఖ్య విశేషమేంటంటే రాజశేఖర రెడ్డి గారు వారి స్నేహితులయిన దుట్టా రామచంద్రరావు గారి ఇంటి నుంచే అనేక పేదల పధకాలు వెలువరించారు.

గ్రామ విశేషాలు

మార్చు

చిత్రీకరణలలో

మార్చు

హనుమాన్ జంక్షన్ కథా కేంద్రంగా 2001 లో హనుమాన్ జంక్షన్ అనే తెలుగు సినిమా విడుదలైంది. ఈ సినిమాలో హనుమాన్ జంక్షన్ గా చిత్రీకరించిన ఊరికి అసలు హనుమాన్ జంక్షన్ కీ పోలికే లేదు. మలయాళంలో విజయవంతమైన తేన్‌కాశి పట్టణమ్ సినిమాను తెలుగుసేతే ఈ సినిమా. ఎం.రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జగపతి బాబు, అర్జున్, స్నేహ, లయ నటించారు.

సమస్యలు

మార్చు

వివిధ జిల్లాలు (కృష్ణా, పశ్చిమ గోదావరి), నియోజక వర్గాలు, మండలాలు (బాపులపాడు, ఏపూరు), పంచాయితీల (బాపులపాడు, ఏపూరు, తాళ్ళమూడి, అప్పనవీడు) మధ్య పట్టణం విభజింపబడి ఉండడం వలన పౌర సమస్యల పరిష్కారానికి, పట్టణం అభివృద్ధికి అనేక ఇబ్బందులు ఎదురౌతున్నాయి. హనుమాణ్ జంక్షన్‌కు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్‌కు "నూజివీడు రైల్వేస్టేషన్" అని పేరు (అప్పటికి హనుమాన్ జంక్షన్ జనావాసంగా అభివృద్ధి కాలేదు)

Smart junction app

వెలుపలి లంకెలు

మార్చు

[1] ఈనాడు విజయవాడ; 2013,నవంబరు 21; 5వపేజీ. [2] ఈనాడు కృష్ణా; 2013,జనవరి-24; 15వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2014,జూన్-16; 2వపేజీ. [4] ఈనాడు విజయవాడ; 2014,నవంబరు-4; 4వపేజీ. [5] ఈనాడు విజయవాడ; 2014,డిసెంబరు-16; 5వపేజీ. [6] ఈనాడు కృష్ణా; 2015,ఫిబ్రవరి-24; 3వపేజీ. [7] ఈనాడు విజయవాడ; 2015,మార్చి-13; 4వపేజీ. [8] ఈనాడు విజయవాడ; 2015,మార్చి-21; 5వపేజీ. [9] ఈనాడు అమరావతి; 2015,మే-12; 4వపేజీ. [10] ఈనాడు అమరావతి; 2015,మే-27; 5వపేజీ. [11] ఈనాడు అమరావతి; 2016,మే-4; 5వపేజీ.