కె.హెచ్.మునియప్ప కర్ణాటాక రాష్ట్రమునకు చెందిన రాజకీయ నాయకుడు. 10, 11, 12, 13, 14, 15, 16 వ లోక్‌సభ సభ్యుడు. ఇతను కర్నాటక లోని కోలార్ (ఎస్.సి) పార్లమెంటు నియోజిక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరుపున్ గెలిచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

K.H. Muniyappa
కె.హెచ్.మునియప్ప

K. H. Muniyappa Union Minister of State for Railways


Union Minister of State(Independent charge), Minister of Micro, Small and Medium Enterprises
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
28 October 2012
ప్రధాన మంత్రి Dr Manmohan Singh
ముందు Vayalar Ravi
నియోజకవర్గము Kolar

వ్యక్తిగత వివరాలు

జననం (1948-03-07) 7 మార్చి 1948 (వయస్సు 73)
Kolar, కర్నాటక
రాజకీయ పార్టీ INC
జీవిత భాగస్వామి M. Nagarathnamma
సంతానము 1 son and 4 daughters
నివాసము Bangalore
మతం Hinduism
వెబ్‌సైటు www.khmuniyappa.com
మూలం biodata website

బాల్యంసవరించు

మునియప్ప 7 మార్చి 1948 వ సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలో కోలార్ జిల్లా కంబద హళ్ళిలో జన్మించాడు. ఇతడి తల్లి దండ్రులు: శ్రీమతి వెంకట్మ ., శ్రీ హనుమప్ప.

విద్యభ్యాసముసవరించు

ఇతడు బెంగళూరు విశ్వ విద్యాలయం నుండి బి.ఎ. ఎల్.ఎల్.బి పట్టా పొందాడు. కొంతకాలము న్యాయవాద వృత్తిని స్వీకరించాడు., సామాజిక కార్యకర్తగా పనిచేశాడు.

కుటుంబముసవరించు

మునియప్ప 22 జూన్ నెల 1978 వ సంవత్సరంలో నాగరత్నమ్మను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు కలరు.

రాజకీయ ప్రస్తానంసవరించు

ఇతడు 1991 లో 10 వ లోక్ సభకు కాంగ్రెస్ పార్టీతరపున లోక్ సభలో సభ్యుడయ్యాడు. 1994 లో అఖిల భారత కాంగ్రెస్ కు జాయింట్ సెక్రట్రెటరీగా వ్యవహరించాడు. 1996 లో తిరిగి 11 వ లోక్ సభకు ఎన్నికయ్యాడు. 1998 లో 12 వ లోక్ సభకు ఎన్నియ్యాడు. 13 వ లోక్ సభకు కూడా వరుసగా నాలుగవ సారి కూడా ఎన్నికయ్యాడు. 2004 లో కూడా 14 వ లోక్ సభకు ఎన్నికయి కేంద్రంలో నౌకా రవాణ మంత్రిగా పనిచేశాడు. 2009 లో 15 వ లోక్ సభకు ఎన్నికయి కేంద్రంలో రైల్వే శాఖా మంత్రిగా పనిచేశాడు[1].

మూలాలుసవరించు

  1. "Ministers of State (as on 15.11.2010)". Government of India. Archived from the original on 13 ఫిబ్రవరి 2011. Retrieved 11 December 2010. Check date values in: |archive-date= (help)

ఇతర లింకులుసవరించు