కె. అచ్చిరెడ్డి

సినీ నిర్మాత

కె. అచ్చిరెడ్డి ప్రముఖ తెలుగు సినీ నిర్మాత. దర్శకుడు మరియు స్నేహితుడైన ఎస్. వి. కృష్ణారెడ్డితో కలిసి అనేక విజయవంతమైన సినిమాలు నిర్మించాడు.[1] ఆయన కొబ్బరిబోండాం, రాజేంద్రుడు - గజేంద్రుడు, మాయలోడు, యమలీల, ఘటోత్కచుడు, వినోదం, దీర్ఘ సుమంగళీభవ వంటి హిట్ చిత్రాల్ని మనీషా ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మించాడు.[2]

కె. అచ్చిరెడ్డి
జననంపశ్చిమ గోదావరి జిల్లా, ఆరవల్లి
వృత్తిసినీ నిర్మాత

వ్యక్తిగత జీవితంసవరించు

అచ్చిరెడ్డి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా, ఆరవల్లి. ఆరవల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. అప్పటి నుంచి ఎస్. వి. కృష్ణారెడ్డితో స్నేహం ఉంది.[1] తనకు సినిమా మీద ఆసక్తి లేకపోయినా కృష్ణారెడ్డి అవకాశాల కోసం మద్రాసు వెళ్ళినపుడు తనే నిర్మాత అయితే బాగుండుననిపించింది. హైదరాబాదుకు వచ్చి డబ్బు సంపాదించడానికి అనేక వ్యాపారాలు చేశాడు. మొదట్లో జంట నగరాల్లోని ఇరానీ కేఫ్ లకు స్వీట్లు సరఫరా చేశారు. అప్పట్లో పాప్ సంగీతం ప్రాచుర్యంలో ఉండటంతో పాప్ టీ పేరుతో అప్పట్లో ఉన్న డంకన్ టీకి పోటీగా తయారు చేశారు. గోల్డెన్ ఫింగర్స్ పేరుతో ఒక రకమైన వడియాలు లాంటి ఆహార ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారం చేశారు. కొంతమంది కలిసి బృందంగా ఏర్పడి డబ్బు సంపాదన కోసం ఈ వ్యాపారాలు నిర్వహించేవారు. ఖాళీ సమయాల్లో తెలుగు, హిందీ, ఇంగ్లీషు సినిమాలు చూసేవారు. వ్యాపారాల ద్వారా కొంత డబ్బును కూడబెట్టారు కానీ సినిమా నిర్మాణానికి అవి సరిపోవని తెలిసింది. సినీరంగంతో పరిచయం కలగడం కోసం అప్పుడే ప్రాచుర్యం పొందుతున్న దూరదర్శన్ చానల్లో అధికారులకు, నిర్మాతలకు మధ్య వారధిగా వ్యవహరించడం ద్వారా సినీ ప్రముఖులతో పరిచయాలు పెంచుకున్నారు. అప్పుడే మరో నిర్మాత కిషోర్ రాఠీతో పరిచయం ఏర్పడింది. ఆయనకు అప్పుడే మనీషా వీడియోస్ పేరుతో సినిమాలకు సంబంధించిన ఒక సంస్థ ఉండేది. మొదట్లో మూడు రీమేక్ చిత్రాలు నిర్మించాక కొబ్బరి బోండాం సినిమా తీశారు.

కెరీర్సవరించు

1988లో ఆయన కెరీర్ ప్రారంభమైంది.[3]మొదట్లో మనీషా ఫిలిమ్స్ బ్యానర్‌పై కొబ్బరిబోండాం, రాజేంద్రుడు - గజేంద్రుడు, మాయలోడు, యమలీల, ఘటోత్కచుడు, వినోదం, దీర్ఘ సుమంగళీభవ వంటి హిట్ చిత్రాల్ని నిర్మించాడు. తర్వాత ఆర్.ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై హంగామా, సామాన్యుడు, గుండమ్మగారి మనవడు, కిక్ వంటి చిత్రాలకు సమర్పకుడుగా వ్యవహరించాడు. తర్వాత మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ అనే నూతన సంస్థను స్థాపించి ఆది హీరోగా ప్రేమ కావాలి సినిమా తీశాడు.

మూలాలుసవరించు

  1. 1.0 1.1 "స్నేహమే మా బంధాన్ని నిలబెట్టింది". sakshi.com. సాక్షి. Retrieved 18 November 2016.
  2. "విజయభాస్కర్ - అచ్చిరెడ్డి కాంబినేషన్‌లో కొత్త చిత్రం". telugu.webdunia.com. వెబ్ దునియా. Retrieved 18 November 2016.
  3. "ఖర్చు నిర్వహణ నిర్మాత చేతుల్లోనే ఉంటుంది:- కె. అచ్చిరెడ్డి". suryaa.com. సూర్య. Retrieved 18 November 2016.[permanent dead link]