ప్రధాన మెనూను తెరువు

ఘటోత్కచుడు (సినిమా)

1995 సినిమా

ఘటోత్కచుడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో 1995 లో వచ్చిన ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా.[1] ఆలీ, రోజా, బేబీ నికిత, సత్యనారాయణ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఘటోత్కచుడు భూలోకానికి వచ్చి ఆపదలో ఉన్న ఒక పాపను రక్షించుట ఈ చిత్ర ప్రధాన కథాంశం.

ఘటోత్కచుడు
(1995 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్. వి. కృష్ణారెడ్డి
తారాగణం ఆలీ,
అక్కినేని నాగార్జున,
రోజా
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ మనిషా ఫిల్మ్స్
భాష తెలుగు

కథసవరించు

ద్వాపర యుగంలో మహాభారత యుద్ధ సమయంలో ఘటోత్కచుడు మరణించబోయే ముందు ఒక పాప అతనికి సపర్యలు చేస్తుంది. ఘటోత్కచుడు ఆమె చేసిన సాయానికి ముచ్చటపడి మరేదైనా జన్మలోనైనా ఆమెకు సహాయం చేస్తానని మనసులో అనుకుంటాడు. కలియుగానికి వస్తే చిట్టి అనే పాప ధనవంతుల బిడ్డ. ఆస్తి కోసం పాప తల్లిదండ్రులను ఆమె బంధువులు పొట్టనబెట్టుకుంటారు. పాపను కూడా చంపబోతుంటే రంగా తండ్రి రౌడీలకు అడ్డుపడి ప్రాణాలు విడుస్తాడు. రంగా ఆమెను కాపాడటానికి ప్రయత్నం చేసినా చివరకు ఆమెను గూండాలు చుట్టుముట్టగా పాప దీనాలాపనలు స్వర్గంలో ఉన్న ఘటోత్కచుడి చెవినవడి భువికి దిగివచ్చి ఆ పాపకు రక్షలా ఉంటాడు. మరో పక్క ఓ మాంత్రికుడు అరిచేతిలో పుట్టుమచ్చ ఉన్న చిట్టికి దేవతకు బలి ఇవ్వాలని ఆ పాపకోసం తన శిష్యుని పంపి వెతికిస్తుంటాడు.

తారాగణంసవరించు

అతిథి పాత్రలుసవరించు

ఈ సినిమా ప్రారంభానికి ముందు వచ్చే మహాభారత యుద్ధ దృశ్యంలో పలువురు ప్రముఖ నటులు నటించారు.

  • అర్జునుడుగా శ్రీకాంత్
  • కర్ణుడుగా రాజశేఖర్
  • ధర్మరాజుగా గిరిబాబు
  • ప్రసాద్ బాబు

మూలాలుసవరించు

  1. "Ghatotkachudu songs". naasongs.com. Retrieved 24 October 2016.

బయటి లింకులుసవరించు