కె. సుధాకరన్

కుంబకుడి సుధాకరన్ (జననం: 1948 ఏప్రిల్ 1) ఒక భారతీయ రాజకీయ నాయకుడు

కుంబకుడి సుధాకరన్ (జననం: 1948 ఏప్రిల్ 1) ఒక భారతీయ రాజకీయ నాయకుడు.[3] కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) అధ్యక్షుడు. కేరళ ప్రభుత్వంలో మాజీ క్యాబినెట్ మంత్రిగా కూడా పనిచేశాడు. ఇతను ప్రస్తుతం కేరళలోని కన్నూర్ నుండి పార్లమెంటు (MP), లోక్‌సభ సభ్యునిగా, ఓబిసిల గ్రామీణాభివృద్ధి, సంక్షేమ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల సభ్యునిగా పనిచేస్తున్నాడు. ఇతను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అంతేకాకుండా కేరళ శాసనసభలో నాలుగు పర్యాయాలు సభ్యుడు, 1996 నుండి 2009 వరకు కన్నూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు.[4]

కె. సుధాకరన్
కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
అంతకు ముందు వారుముల్లపల్లి రామచంద్రన్
పార్లమెంటు సభ్యుడు, లోక్ సభ
అంతకు ముందు వారుపి. కె. శ్రీమతి
నియోజకవర్గంకన్నూరు (లోక్ సభ నియోజకవర్గం)
పార్లమెంటు సభ్యుడు, లోక్ సభ
నియోజకవర్గంకన్నూరు (లోక్ సభ నియోజకవర్గం)
Assumed office
1996 (1996)
నియోజకవర్గంకన్నూరు (రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గం)
Assumed office
2001 మే 17 (2001-05-17)
వ్యక్తిగత వివరాలు
జననం (1948-06-07) 1948 జూన్ 7 (వయసు 75)
మలబార్ జిల్లా, మద్రాస్ రాష్ట్రం, డొమినియన్ ఆఫ్ ఇండియా
ప్రస్తుతం కన్నూరు, కేరళ, భారతదేశం
జాతీయతఇండియన్
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామికె.స్మిత
సంతానం2
తల్లిదండ్రులు
  • వి.,రాముణ్ణి [1]
  • మాధవి [2]
చదువుమాస్టర్ ఆఫ్ ఆర్ట్స్
కళాశాలప్రభుత్వ బ్రెన్నెన్ కళాశాల, తలస్సేరి
వృత్తిరాజకీయ నాయకుడు

వ్యక్తిగత జీవితం మార్చు

కె. సుధాకరన్ కన్నూర్ జిల్లాలోని నాదల్ అనే చిన్న గ్రామంలో 1948 జూన్ 7న జన్మించాడు. వి. రాముణ్ణి, కె. మాధవి ఇతని తల్లిదండ్రులు. తలస్సేరిలోని ప్రభుత్వ బ్రెన్నెన్ కళాశాలలో బిఏ (హిస్టరీ) చదివాడు, అంతేకాకుండా ఎంఏ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం మార్చు

  • 2021: కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) అధ్యక్షుడిగా నియమించబడ్డాడు.
  • 2019: కన్నూర్ నుంచి 17వ లోక్‌సభకు ఎన్నికై అక్కడ సీపీఐఎంకు చెందిన పీకేశ్రీమతిని 94,559 ఓట్ల తేడాతో ఓడించాడు.
  • 2009: కన్నూర్ నుంచి 15వ లోక్‌సభకు ఎన్నికై అక్కడ సీపీఐఎంకు చెందిన కేకే రాజేష్‌పై 43151 ఓట్ల తేడాతో విజయం సాధించాడు.
  • 2009: పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడు, వాణిజ్య కమిటీ సభ్యుడు.
  • 2001-2004: అటవీ, వన్యప్రాణి మంత్రి, కేరళ ప్రభుత్వం.
  • 2001: అటవీ, క్రీడల మంత్రి, కేరళ ప్రభుత్వం.
  • 1992: కన్నూర్ నియోజకవర్గం నుండి 1992–2009 కేరళ శాసనసభ సభ్యుడు.

మూలాలు మార్చు

  1. "K Sudhakaran(Indian National Congress(INC)):Constituency- KANNUR(KERALA) - Affidavit Information of Candidate". www.myneta.info.
  2. "Members - Kerala Legislature". niyamasabha.org.
  3. "Members - Kerala Legislature". www.niyamasabha.org. Retrieved 2022-09-03.
  4. "കേരളത്തിൽ കോൺഗ്രസിനെ നയിക്കാൻ കെ.സുധാകരൻ; ഫോൺ വിളിച്ച് രാഹുൽ". ManoramaOnline. Retrieved 2022-09-03.