కైరంకొండ నరసింహులు

కైరంకొండ నరసింహులు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన కవి, రచయిత. తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియలలో రచనలు సాగించిన నరసింహులు పోచంపల్లి పోతనగా పేరొందాడు.[1] తన సహజ కవిత్వంతో పలు యక్షగానాలు, భక్తి కీర్తనలు రచించాడు.

కైరంకొండ నరసింహులు
జననం
కైరంకొండ నరసింహులు

(1948-10-23)1948 అక్టోబరు 23
మరణం2021 నవంబరు 4(2021-11-04) (వయసు 73)
మార్కండేయనగర్‌ కాలనీ, పోచంపల్లి
జాతీయతభారతీయుడు
వృత్తిచేనేత కార్మికుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కవి, రచయిత

జననం, విద్యాభ్యాసం మార్చు

నరసింహులు 1948, అక్టోబరు 23న కొండయ్య - నరసమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా, ఘటకేసర్ మండలం, ఔషాపూర్ గ్రామంలోని ఒక చేనేత కుటుంబంలో జన్మించాడు. పాఠశాల విద్యను పూర్తిచేశాడు. తండ్రితోపాటు బతుకుదెరువుకోసం మహారాష్ట్రలోని సోలాపూర్కు వెళ్ళాడు. అక్కడి గ్రంథాలయంలో తెలుగు పుస్తకాలు, దినవారపత్రికలు, శతకాలు చదివి సాహిత్యంపై అవగాహన పెంచుకున్నాడు. కొంతకాలం తరువాత యాదాద్రి భువనగిరి జిల్లా, పోచంపల్లి గ్రామానికి వెళ్ళి స్థిరపడ్డాడు. చేనేత వృత్తిని కొనసాగించాడు.[2]

కుటుంబం మార్చు

నరసింహులుకు భార్య, ఇద్దరు కూతుళ్ళు, ఒక కొడుకు ఉన్నారు.[3]

కళారంగం మార్చు

జానపద కళలపై ఇష్టంలో యక్షగానాన్ని నేర్చుకొని ప్రదర్శనలు ఇచ్చాడు. స్త్రీ, యువరాజు పాత్రలు పోషించేవాడు.

రచనా ప్రస్థానం మార్చు

చిన్పప్పటినుండి పౌరాణిక చిత్రాలు చూడడంతోపాటు యక్షగాన ప్రదర్శనలతో పద్యాలపై ఆసక్తి పెంచుకున్న నరసింహులు పద్యంపై ఇష్టంతో చందస్సు పుస్తకాలు చదివి పద్యాలను రాసేవాడు. భజన కీర్తనలతోపాటు, పలు యక్షగానాలను రాసి, ప్రదర్శించాడు. అనేక కవి సమ్మేళన కార్యక్రమాల్లో పాల్గొని తన కవిత్వాన్ని వినిపించాడు.

ముద్రిత రచనలు మార్చు

  1. పాండురంగ భజన కీర్తనలు (1979)
  2. శ్రీ వీరాంజనేయ భజన కీర్తనలు (1994)
  3. పద్మశాలీ శతకం (2002)[4]
  4. భార్గవీ శతకం (2011)
  5. శ్రీ అచల సంప్రదాయక నిజ గురు పూజా విధానం - కందార్థములు (2013)

అముద్రిత రచనలు మార్చు

  1. బసవలింగ శతకం
  2. శ్రీరామ శతకం
  3. సీతారామ కళ్యాణం (యక్షగానం)
  4. భీష్మ ప్రతిజ్ఞ (యక్షగానం)
  5. అరుంధతీ కళ్యాణం (యక్షగానం)
  6. దాంగ్నేయోపాఖ్యానం (యక్షగానం)
  7. శివభజన కీర్తనలు
  8. శ్రీ లక్ష్మీనారాయణ భజన కీర్తనలు
  9. బసవలింగ భజన కీర్తనలు
  10. శ్రీరామాంజనేయ భజన కీర్తనలు
  11. శ్రీ అయ్యప్ప భజన కీర్తనలు
  12. మహమ్మాయి భజన కీర్తనలు
  13. శ్రీ ప్రసన్నాంజనేయ భజన కీర్తనలు

నాటకాలు మార్చు

  1. సీతాపతి సినిమా సందడి
  2. నేటి భారతం

ఆవార్డులు, సన్మానాలు మార్చు

  • నరసింహులు ప్రతిభను చూసిన గోరేటి వెంకన్న స్వయంగా నరిసింహులు ఇంటికి వెళ్ళి ఘనంగా సన్మానించాడు.

మరణం మార్చు

నరసింహులు అనారోగ్యంతో 2021, నవంబరు 4న తన స్వగృహంలో మరణించాడు.[1]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "పోచంపల్లి 'పోతన' నరసింహులు కవి మృతి". andhrajyothy. 2021-11-06. Archived from the original on 2021-11-06. Retrieved 2021-11-06.
  2. శ్రీరామ శతకము, కైరంకొండ నరసింహులు, తేజ పబ్లికేషన్స్, ప్రథమ ముద్రణ, 2021, పుట 17.
  3. "Lokal Telugu - తెలుగు వార్తలు". telugu.getlokalapp.com. 2021-11-06. Archived from the original on 2021-11-06. Retrieved 2021-11-06.
  4. "చేనేత సాహిత్యం తెలుపు : చంద్రునికో నూలుపోగు చందం". Telupu TV - Telugu News (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-08-06. Archived from the original on 2021-11-06. Retrieved 2021-11-06.