కొండం కరుణ మహెందేర్రెడ్డి

1966 ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో జన్మించిన కొండముకరణ మహేందర్ రెడ్డి సికింద్రాబాద్ ఎస్పి కళాశాల నుంచి తన బిఎస్సి డిగ్రీని .., ఉస్మానియా విశ్వవిద్యాలయం లా కళాశాల నుంచి తన న్యాయవాద విద్యను పూర్తి చేశారు.

తన న్యాయవాద విద్య పూర్తి అనంతరం న్యాయవాదిగా తన ప్రత్యక్ష జీవితాన్ని మొదలుపెట్టిన మహేందర్ రెడ్డి తన వృత్తిలో అంచలంచలుగా ఎదుగుతూ హైకోర్టు న్యాయవాదిగా స్థిరపడ్డారు .

తన న్యాయవేది వృత్తితో ఎంతోమందికి ప్రత్యక్షంగా సేవ చేసిన మహేందర్ రెడ్డి ప్రజలకు మరింత సేవ చేయాలని ఉద్దేశంతోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు.

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన మహేందర్ రెడ్డి ఆ పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి వరకు అంచలంచలుగా ఎదుగుతూ వచ్చారు .

సిరిసిల్ల నియోజకవర్గంలో తెరాస బలంగా ఉన్నప్పటికీ నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారు.

మహేందర్ రెడ్డి నిబద్ధత పనితీరు తన వృత్తిపరమైన సేవ గుణాన్ని గమనించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అతనికి సిరిసిల్ల నుంచి పోటీ చేసే అవకాశాన్ని కల్పించింది .

2023 తెలంగాణ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీలో ముందున్నారు మహేందర్ రెడ్డి .

సిరిసిల్ల నియోజకవర్గంలోని బలమైన కాంగ్రెస్ పార్టీ క్యాడర్ తో పాటు నియోజకవర్గంలో తన నిర్వహించిన సేవా, సామాజిక కార్యక్రమాలు మహేందర్ రెడ్డి గెలుపుకి ముఖ్యమైన అంశాలుగా చెప్పవచ్చు .

అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కెటి రామారావు గడ్డి పోటీని ఇచ్చే అవకాశం ఉంది ఇది మహేందర్ రెడ్డి గెలుపు నెగిటివ్ వంశంగా చెప్పవచ్చు.[1]

మూలాలు మార్చు

  1. "సి ఇ ఓ తెలంగాణ అఫిడవిట్". Archived from the original on 2023-11-20.