సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం
కరీంనగర్ జిల్లాలోని 13 శాసనసభ స్థానాలలో సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం ఒకటి.

నియోజకవర్గంలోని మండలాలు సవరించు
- ఎల్లారెడ్డిపేట్
- గంభీర్‌రావ్‌పేట్
- ముస్తాబాద్
- సిరిసిల్ల
ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు సవరించు
సం. | ఎ.సి.సం. | నియోజకవర్గ పేరు | రకం | విజేత పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2018 | 29 | సిరిసిల్ల | జనరల్ | కల్వకుంట్ల తారక రామారావు | పు | టీఆర్ఎస్ | 125213 | కె.కె.మహేంద్రరెడ్డి | పు | కాంగ్రెస్ పార్టీ | 36204 |
2014 | 29 | సిరిసిల్ల | జనరల్ | కల్వకుంట్ల తారక రామారావు | పు | టీఆర్ఎస్ | 92135 | కొండూరి రవీందర్ రావు | పు | కాంగ్రెస్ పార్టీ | 39131 |
2010 | By Polls | సిరిసిల్ల | జనరల్ | కల్వకుంట్ల తారక రామారావు | పు | టీఆర్ఎస్ | 87876 | కె.కె.మహేంద్రరెడ్డి | పు | కాంగ్రెస్ పార్టీ | 19657 |
2009 | 29 | సిరిసిల్ల | జనరల్ | కల్వకుంట్ల తారక రామారావు | పు | టీఆర్ఎస్ | 36783 | కె.కె.మహేంద్రరెడ్డి | పు | స్వతంత్ర | 36612 |
2004 | 259 | సిరిసిల్ల | జనరల్ | చెన్నమనేని రాజేశ్వరరావు | పు | టీడీపీ | 64003 | రేగులపాటి పాపారావు | పు | టీఆర్ఎస్ | 46995 |
1999 | 259 | సిరిసిల్ల | జనరల్ | రేగులపాటి పాపారావు | పు | కాంగ్రెస్ పార్టీ | 58638 | చెన్నమనేని రాజేశ్వరరావు | పు | టీడీపీ | 48986 |
1994 | 259 | సిరిసిల్ల | జనరల్ | చెన్నమనేని రాజేశ్వరరావు | M | CPI | 36154 | రేగులపాటి పాపారావు | M | IND | 31637 |
1989 | 259 | సిరిసిల్ల | జనరల్ | ఎన్.వి.కృష్ణయ్య | M | IND | 26430 | రేగులపాటి పాపారావు | M | IND | 25906 |
1985 | 259 | సిరిసిల్ల | జనరల్ | చెన్నమనేని రాజేశ్వరరావు | M | CPI | 43664 | రుద్ర శంకరయ్య | M | INC | 20101 |
1983 | 259 | సిరిసిల్ల | జనరల్ | వుచ్చిడి మెహన్ రెడ్డి | M | IND | 27508 | రేగులపాటి పాపారావు | M | INC | 19809 |
1978 | 259 | సిరిసిల్ల | జనరల్ | చెన్నమనేని రాజేశ్వరరావు | M | CPI | 28685 | నాగుల మల్లయ్య | M | INC (I) | 18807 |
1972 | 254 | సిరిసిల్ల | జనరల్ | జువ్వాడి నరసింగరావు | M | INC | 25821 | చెన్నమనేని రాజేశ్వరరావు | M | CPI | 23135 |
1967 | 254 | సిరిసిల్ల | జనరల్ | సి.ఆర్.రావు | M | CPI | 23525 | జువ్వాడి నరసింగరావు | M | INC | 15193 |
1962 | 261 | సిరిసిల్ల | జనరల్ | జువ్వాడి నరసింగరావు | M | INC | 15811 | గుడ్ల లక్ష్మీనరసయ్య | M | IND | 6703 |
1999 ఎన్నికలు సవరించు
1999 ఎన్నికలలో సిట్టింగ్ శాసనసభ్యుడు సీనియర్ సి.పి.ఐ. నేత సీహెచ్. రాజేశ్వరరావు తెలుగుదేశం పార్టీ టికెట్టుతో పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటి చైర్మెన్ అయిన ఆర్.పాపారావు చేతిలో 9561 ఓట్ల తేడాతో పరాజయం పొందినాడు.
2004 ఎన్నికలు సవరించు
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన చెన్నమనేని రాజేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి అయిన తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి రేగులపాటి పాపారావుపై 17008 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. రాజేశ్వరరావుకు 64003 ఓట్లు రాగా, పాపారావుకు 46995 ఓట్లు లభించాయి.
2009 ఎన్నికలు సవరించు
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎర్రబెల్లి చంద్రశేఖరరావు పోటీ చేయగా[1] మహాకూతమి తరఫున తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు కుమారుడు కె.తారక రామారావు పోటీపడ్డాడు. కాంగ్రెస్ తరఫున గుడ్ల మంజుల, ప్రజారాజ్యం పార్టీ నుండి గాజుల బాలయ్య, లోక్‌సత్తా తరఫున సంతోష్ బాబు పోటీచేశారు.[2]