కొండపర్తి (ఐనవోలు)

హన్మకొండ జిల్లా, ఐనవోలు మండలం లోని గ్రామం

కొండపర్తి, తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా, ఐనవోలు మండలం లోని గ్రామం.[1]

కొండపర్తి
—  రెవిన్యూ గ్రామం  —
కొండపర్తి is located in తెలంగాణ
కొండపర్తి
కొండపర్తి
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 18°13′53″N 80°15′59″E / 18.231325°N 80.266376°E / 18.231325; 80.266376
రాష్ట్రం తెలంగాణ
జిల్లా హన్మకొండ
మండలం ఐనవోలు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 6,439
 - పురుషుల సంఖ్య 3,222
 - స్త్రీల సంఖ్య 3,217
 - గృహాల సంఖ్య 1,633
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఇది మండల కేంద్రమైన ఐనవోలు నుండి 13 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన వరంగల్ నుండి 13 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లా లోని హన్మకొండ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన వరంగల్ పట్టణ జిల్లాలో, కొత్తగా ఏర్పాటు చేసిన ఐనవోలు మండలం లోకి చేర్చారు. [2][3] ఆ తరువాత 2021 లో, వరంగల్ పట్టణ జిల్లా స్థానంలో హనుమకొండ జిల్లాను ఏర్పాటు చేసినపుడు ఈ గ్రామం, మండలంతో పాటు కొత్త జిల్లాలో భాగమైంది. [3]

గణాంకాలు మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1633 ఇళ్లతో, 6439 జనాభాతో 2581 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3222, ఆడవారి సంఖ్య 3217. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2050 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 20. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 578152[4].పిన్ కోడ్: 506003.

విద్యా సౌకర్యాలు మార్చు

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల హనుమకొండలో ఉన్నాయి. సమీప మేనేజిమెంటు కళాశాల హనుమకొండలోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్‌లు వరంగల్లోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం హనుమకొండలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల వరంగల్ లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం మార్చు

కొండపర్తిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రిలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, డిస్పెన్సరీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉంది.

ప్రైవేటు వైద్య సౌకర్యం మార్చు

గ్రామంలో4 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు.

తాగు నీరు మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం మార్చు

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు మార్చు

కొండపర్తిలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు మార్చు

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు మార్చు

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 12 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం మార్చు

కొండపర్తిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 93 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 183 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 70 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 66 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 28 హెక్టార్లు
  • బంజరు భూమి: 358 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1780 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 1956 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 211 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు మార్చు

కొండపర్తిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 159 హెక్టార్లు* చెరువులు: 52 హెక్టార్లు

ఉత్పత్తి మార్చు

కొండపర్తిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు మార్చు

వరి, ప్రత్తి, మొక్కజొన్న

పారిశ్రామిక ఉత్పత్తులు మార్చు

బీడీలు, కుండలు, చాపలు

ఈ కొండపర్తి గ్రామ సమీపములో ఫణి గల రామప్ప దేవాలయము ఉన్నది. ఈ గ్రామంలో కాశీనాథ శర్మ ,నారాయణ శర్మ లాంటి పండితులు పుట్టారు.

గ్రామ విశిష్టతలు మార్చు

కాకతీయుల కాలంలో సైనిక కవాతులతో దద్దరిల్లి సామంతసేనగా వర్ధిల్లిన నేల ఇది. రుద్రదేవుడికి మంత్రిగా పనిచేసిన కాటమసేనాని.. ఆయన రెండవ కుమారుడైన చౌండసేనాని కొండపర్తి వాసులే.

కొండపర్తి పేరు మార్చు

రెండు కొండల మధ్య ఉన్న గ్రామం కాబట్టి కొండపర్తి అనే పేరు వచ్చిందని చెప్తుంటారు గ్రామస్తులు.

కొండపర్తి రాజుల విశేషాలు మార్చు

 
కొండపర్తిలో పురాతన ఆలయం కట్టడం

కాకతీయ రుద్రదేవుడు ఆంధ్రదేశపు కోస్తా ప్రాంతంపైన దండెత్తగా.. కాటమసేనాని ఆ ముట్టడిలో అత్యంత కీలక పాత్ర వహించాడు. అతడి ధైర్య సాహసాలకు గుర్తింపుగా రుద్రదేవుడు కోట గెలపాట అనే పిలిచేవాడు. కోటని జయించిన వాడు అని దీనర్థం. రుద్రదేవుని ఆస్థానంలో మంత్రిగా పనిచేశాడు. తర్వాతి కాలంలో కాటమసేనాని రెండవ కుమారుడు చౌండసేనాని మంత్రిగా పనిచేశాడు. కాకతీయులు చందవోలుపై దండెత్తినప్పుడు వెలనాటి పృథ్వీశ్వరుడు ఒక ద్వీపంలో దాక్కుని ఉండగా.. చౌండ సేనాని ఆ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుని అక్కడున్న ఖజానాను సైతం కొల్లగొట్టాడు. అతడి సాహసానికి మెచ్చిన గణపతి దేవుడు దివి చరాకర అని పిలిచేవాడు.

రాజ పాలనా సూత్రం మార్చు

చౌండ సేనాని మంచి పరిపాలనాదక్షుడు. కాకతీయుల పాలనాకాలంలో ఉన్నత హోదాలో పనిచేసినప్పటికీ.. కొండపర్తితో మంచి అనుబంధం ఉండేది. కాకతీయుల పాలనా సూత్రమైన ట్రిపుల్ టీని చౌండ సేనాని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ట్రిపుల్ టీ అంటే.. ట్యాంక్, టౌన్, టెంపుల్. దీని ప్రకారమే కొండపర్తిలో చౌండ సముద్రం అనే చెరువును తవ్వించి వేలాది ఎకరాలకు నీరందించాడట. ఎన్నో ఆలయాలను నిర్మించాడని అక్కడి శాసనాల ద్వారా తెలుస్తున్నది.

త్రికూటాలయం మార్చు

చౌండసేనాని కొండపర్తిలో చౌండేశ్వరాలయం పేరుతో ఒక త్రికూటాలయాన్ని నిర్మించి శాసనం వేయించాడు. దీనిని కొండపర్తి శివాలయంగా పిలుస్తారు. ఆలయంలోని శాసనం ప్రకారం దీనిని క్రీస్తుశకం 1125 రుదిరోద్గారి నామ సంవత్సరం వైశాఖమాసం శుక్లపక్షం ఏప్రిల్ 17వ తేదీన ఈ ఆలయంలో శివలింగం, విష్ణుమూర్తి, పోలేశ్వరుడి విగ్రహాలను ప్రతిష్టించారు. శాసనం ప్రకారం ఈ ఆలయాన్ని నిర్మించి 814 సంవత్సరాలు అవుతుంది. ఆలయ ధూప దీపనైవేధ్యాల కోసం చౌండ్యపురం అనే అగ్రహారాన్ని.. నారుకుర్కి అనే గ్రామాన్ని దానమిచ్చాడట రాజు. ఈ ఆలయాన్ని ఇసుక పెట్టె పరిజ్ఞానం (Sand Box Technology) ద్వారా నిర్మించినట్లు చెప్తుంటారు. ప్రస్తుతం ఆలయం లేదు కానీ నాటి ఘన చరిత్రకు ఆనవాళ్లుగా మాత్రం మిగిలి ఉన్నది. ఆ పక్కనే రెండు నంది విగ్రహాలు మట్టిలో కూరుకుపోయి ఉన్నాయి. చౌండసేనాని వేయించిన శాసనం.. గణపతిదేవుడి కాలం నాటి శాసనం.. ఆంజనేయస్వామి విగ్రహం, బైరవమూర్తి వంటి శిల్ప కళాఖండాలు ఉన్నాయి.

సురా భాండేశ్వరాలయం మార్చు

కొండపర్తి గ్రామ పంచాయితీ కుడివైపున ఈ ఆలయం ఉంటుంది. ఆలయ ప్రవేశంలో రెండువైపులా ద్వార పాలక విగ్రహాలు ఆలయంలోకి ఆహ్వానిస్తున్నట్లుగా ఉన్నాయి. లోపలికి ప్రవేశించగానే వివిధ రకాల పరిమాణాల్లో మూడు నందులు ఉన్నాయి. ఇందులో కాకతీయ శైలిలో రెండు ఉండగా.. మరొకటి చాళుక్య శైలిలో ఉన్నది. అంతరాలయంలో శివలింగంపైన ఉన్న పైకప్పుపై సూక్ష్మరాతి విగ్రహాలు చెక్కి ఉన్నాయి. ఇలాంటి సూక్ష్మ విగ్రహాలు వేరే ఎక్కడా లేకపోవడం విశేషం. శివలింగం పైభాగంలో ఉన్న కప్పు మీద గుర్రంపై కూర్చొన్న ఒక యుద్ధవీరుని విగ్రహం కనిపిస్తుంది. ఇది చౌండ సేనానిది. ఆయనెంత పరాక్రమవంతుడో విగ్రహాన్ని చూస్తే అర్థమవుతుంది. ఆలయంలో పెద్ద ధ్వజస్తంభం ఉండేదని.. పది సంవత్సరాల నుంచీ కనిపించడం లేదని గ్రామస్తులు అన్నారు. ఆలయ ప్రవేశంలో నల్లరాతితో చెక్కిన 3 అడుగుల గణపతి విగ్రహం కూడా ఉన్నది.

కొండపర్తిలోని శాసనాలు మార్చు

గ్రామంలో మూడు రాతి శాసనాలు ఉన్నాయి. ఊరి చివరన చెరువుగట్టు పక్కన ఉన్న గుట్టమీద కొక్కెరగుండు అని పిలిచే రాతి బండపై ఒక శాసనం ఉన్నది. ఇది క్రీస్తుశకం 9 వ శతాబ్దం నాటి ప్రాచీన తెలుగు లిపిలో రాయబడి ఉన్నది. చౌండ సేనాని నిర్మించిన చౌండ సముద్రం వద్ద వేయించిన శాసనంలో ఇలా రాసి ఉన్నది.. ఈ ధర్మసేతువు నృపులందరికీ ఒకే రకమైనది. కాబట్టి మీతో సదా రక్షించబడాలనీ, భవిష్యత్ కాలాలలో వచ్చే రాజులందరినీ ప్రార్ధిస్తున్నాను. ధర్మం శతృవు-చేసినా సరే కష్టపడి రక్షించాలి. శతృవు శతృవేకానీ ధర్మం ఎవరికీ శతృవు కాదు అని ఈ శాసనంలో పేర్కొన్నారు. మూడవ శాసనం శక సంవత్సరం 1162 (క్రీస్తుశకం 1242)లో అంతకు ముందు నిర్మితమైన పోలేశ్వర ఆలయంలో రుద్రేశ్వర.. కేశవమూర్తులను ప్రతిష్టాపన చేసి ఆలయానికి ప్రాకారాన్ని ఏర్పరిచినట్లు రాయబడింది.

500 స్తంభాల ఆలయం మార్చు

కొండపర్తిలో ఉన్న మరొక ఆలయం 500 స్తంభాల ఆలయం. ఇలాంటివి ఇంకా జనగామ జిల్లా నిడిగొండ, సిద్దిపేటజిల్లా నంగునూరు, కరీంనగర్‌జిల్లా ఉప్పరపల్లిలో కూడా ఉన్నట్లు చరిత్రకారులు చెప్పారు. కొండపర్తిలో ఉన్న ఈ ఆలయం ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నది. ఇక గ్రామంలోని మరో ఆలయం వేణుగోపాలస్వామి ఆలయం. గ్రామ పంచాయతీ కార్యాలయానికి ఎదురుగా ఉన్నది ఈ గుడి. నల్లరాతితో చెక్కిన పద్మనాభస్వామి, గరుడ, ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నాయి. ఊరికి నలువైపులా బురుజులు.. వాటికింద నుంచి రహస్య సొరంగమార్గం ఉన్నాయి. వేణుగోపాలస్వామి పక్కనే ఉన్న రెండంతస్తుల బురుజు గ్రామానికే ప్రత్యేక ఆకర్షణ.

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 231 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "వరంగల్ గ్రామీణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. 3.0 3.1 G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
  4. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు మార్చు

  • కాకతీయుల సామంతసేన కొండపర్తి by Aravind Arya pakide.
  • 30.April.2017 నమస్తే తెలంగాణ ఆదివారం ప్రత్యేక అనుబంధ పత్రిక.