కొండముది శ్రీరామచంద్రమూర్తి
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
కొండముది శ్రీరామచంద్రమూర్తి ప్రముఖ రచయిత. ఇతడు 40కి పైగా నవలలు, 600 కథలు వ్రాశాడు. ఇతని నవల "చిరుమువ్వల మరుసవ్వడి" ఆధారంగా ఆనంద భైరవి సినిమాను తీశారు. ఈ సినిమాకు ఇతనికి ద్వితీయ ఉత్తమ కథారచయితగా నంది పురస్కారంతో పాటు వంశీ, కళాసాగర్ పురస్కారాలు లభించింది. ఇంకా ఇతడు మండలాధీశుడు, శ్రీరామచంద్రుడు సినిమాలకు సంభాషణలు వ్రాశాడు.
రచనలు
మార్చు- పద్మవ్యూహం (నాటకం)
- సింహకాకౌతం
- మంత్రిగారి కూతురు
- సిరిదివ్వెలు
- ధర్మదీపం
- తలుపులు తెరవకండి
- పాపం పడగనీడ
- నారీ నారీ నడుమ మురారి
- స్వయంకృతం
- కలియుగ స్త్రీ
- వెన్నెల వేడి
- యజ్ఞ సమిథలు
- మనిషి గుర్రం మనసు కళ్ళెం (నవల)
- ధర్మం చెర (నవల)
- ఒక సబల కథ (నవల)
- తెలుగు తల్లీ కళ్ళుమూసుకో
- ధనుర్దాసు (నాటకం)
- గడ్డిపూలు (నాటకం)
- రాజేంద్రప్రసాద్ (జీవిత చరిత్ర)
- కొండముది శ్రీరామచంద్రమూర్తి కథలు
- శ్రీరామచంద్రమూర్తి కథలు
- పాములాటి బ్రతుకు
- చిరుమువ్వల మరుసవ్వడి (నవల)
- అనిబీసెంట్
మరణం
మార్చుఇతడు మానస సరోవర యాత్రకు వెళ్లి నేపాల్ దేశంలోని ఖాట్మండులో 2008, సెప్టెంబరు 22వ తేదీన గుండెపోటుతో మరణించాడు[1].