శ్రీరామచంద్రుడు
ఈ సినిమా 1989, మార్చి 10న విడుదలయ్యింది. కృష్ణంరాజు ద్విపాత్రాభినయం చేసిన ఈ కుటుంబకథా చిత్రాన్ని కె.జె.సారథి నిర్మించాడు.
శ్రీరామచంద్రుడు (1989 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.భాస్కరరావు |
---|---|
తారాగణం | కృష్ణంరాజు, సుజాత, విజయశాంతి |
సంగీతం | సత్యం |
నిర్మాణ సంస్థ | లక్ష్మీ కిరణ్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
సంక్షిప్త చిత్రకథ
మార్చుశ్రీరామచంద్రుడు, లక్ష్మి భార్యాభర్తలు. వీరు కృష్ణకు అన్నావదినలైనా తల్లిదండ్రులతో సమానం. శ్రీరామచంద్రుడు జిల్లా జడ్జిగా పని చేస్తుంటాడు. బంగారయ్య అనే వ్యాపారి కల్తీ చేసిన నేరానికి వ్యాపార లైసెన్స్ రద్దు చేసి జరిమానా విధిస్తూ తీర్పు నిస్తాడు జడ్జి. తీర్పు వెలువడడానికి ముందు బంగారయ్యను రక్షించమని శ్రీరామచంద్రుడి వద్దకు రాయబారానికి వెళ్ళి అవమానానికి గురౌతాడు ఫణీంద్రరావు. దీనితో ఫణీంద్రరావు శ్రీరామచంద్రుడిపై కక్షగడతాడు. ప్రతి పంటకూ ఏదో ఒక కారణం చూపిస్తూ కౌలు చెల్లించని కారణంగా కృష్ణ వ్యవసాయం చేయించడానికి స్వగ్రామం వెడతాడు. అక్కడ బంగారయ్య కూతురు శాంతిని ప్రేమిస్తాడు. అన్న వదినలు వారి వివాహం చేస్తారు. కలిసిమెలసి ఉన్న అన్నదమ్ముల కాపురాలలో చిచ్చుపెట్టి విడదీయాలని శాంతి తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలు ఫలించవు. అవమానానికి గురైన ఫణీంద్రరావు, శిస్తు పోయిందన్న బాధలో ఉన్న గ్రామకరణం ఆడించిన నాటకంలో బంగారయ్య ఒక పావుగా మారతాడు. శ్రీరామచంద్రుడు, కృష్ణ కుటుంబాలు విడిపోతాయి. కృష్ణ కుమారుడిని బంధిస్తాడు ఫణీంద్రరావు. రక్షించబోయిన కృష్ణ, లక్ష్మి మరణిస్తారు. జీవిత భాగస్వాములను కోల్ఫోయిన శ్రీరామచంద్రుడు, శాంతి తమ వారసుడితోపాటు ప్రతీకారాన్ని కూడా పెంచి పెద్దచెస్తారు. వారసుడు పట్నంలో చదువుకుని వచ్చాక అహింస ద్వారానే అన్యాయాల్ని అంతమొందిస్తాడు శ్రీరామచంద్రుడు[1].
పాత్రలు - పాత్రధారులు
మార్చు- శ్రీరామచంద్రుడు - కృష్ణంరాజు
- కృష్ణ - కృష్ణంరాజు
- లక్ష్మి - సుజాత
- శాంతి - విజయశాంతి
- బంగారయ్య - ఎం.ప్రభాకరరెడ్డి
- ఫణీంద్రరావు - త్యాగరాజు
- గ్రామ కరణం - కోట శ్రీనివాసరావు
- ఎస్.వరలక్ష్మి
- జానకి
- శైలజ
- కె.వరలక్ష్మి
సాంకేతికవర్గం
మార్చు- కథ - ఎం.ప్రభాకరరెడ్డి
- మాటలు - కొండముది శ్రీరామచంద్రమూర్తి
- స్క్రీన్ప్లే - బి.భాస్కరరావు
- పాటలు - మైలవరపు గోపి, వెన్నెలకంటి
- నేపథ్యగానం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జేసుదాసు,పి.సుశీల, చిత్ర
- సంగీతం - సత్యం
- దర్శకత్వం - బి.భాస్కరరావు
- నిర్మాత - కె.జె.సారథి
విశేషాలు
మార్చు- ఈ సినిమ ద్వారా వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ గీత రచయితగా పరిచయమయ్యాడు.
మూలాలు
మార్చు- ↑ పెమ్మరాజు (18 March 1989). "చిత్రసమీక్ష-శ్రీరామచంద్రుడు". ఆంధ్రపత్రిక. No. సంపుటి 75 - సంచిక 347. Retrieved 1 December 2017.[permanent dead link]