కొండ్రు సుబ్బారావు

భారత రాజకీయనాయకుడు

కొండ్రు సుబ్బారావు (జ: 1918) భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు 1వ లోక్‌సభకు ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి బయ్యా సూర్యనారాయణ మూర్తితో కలిసి ఎన్నికయ్యాడు.[1]

కోడ్రు సుబ్బారావు, శ్రీమతి కోండ్రు బిక్షమ్మ

ఇతడు దెందులూరు సమీపంలోని అప్పారావు పాలెం గ్రామంలో 1918లో జన్మించాడు. వృత్తిరీత్యా వ్యవసాయదారుడైన సుబ్బారావు ఏలూరులోని మునిసిపల్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. 1942 నుండి హరిజనోద్ధరణ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని జిల్లా హరిజన సంఘానికి అధ్యక్షునిగా సేవచేశాడు.

ఇతను కమ్యూనిష్టు భావజాలాలకు ఆకర్షితులై జిల్లా కమ్యూనిష్టు సంఘం సభ్యునిగా చేరి భారతీయ కమ్యూనిస్టు పార్టీ తరపున పోటీచేశాడు.

ఇతని వివాహం భిక్షమ్మతో 1942లో జరిగింది; వీరికి 3 కుమారులు, ఒక కుమార్తె.

మూలాలు

మార్చు