కొంపల్లి పురపాలకసంఘం

తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ

కొంపల్లి పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] కొంపల్లి పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం లోని కుత్బుల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

కొంపల్లి పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
కొంపల్లి పురపాలకసంఘం is located in తెలంగాణ
కొంపల్లి పురపాలకసంఘం
కొంపల్లి పురపాలకసంఘం
అక్షాంశరేఖాంశాలు: 17°32′40″N 78°29′20″E / 17.544579°N 78.488841°E / 17.544579; 78.488841
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మేడ్చల్ మల్కాజిగిరి
మండలం దుండిగల్ గండిమైసమ్మ‌
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌
 - వైస్ చైర్‌పర్సన్‌
వైశాల్యము
 - మొత్తం 17 km² (6.6 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 22,377
 - పురుషుల సంఖ్య 11,306
 - స్త్రీల సంఖ్య 11,071
 - గృహాల సంఖ్య 12,550
పిన్ కోడ్ - 500014
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

చరిత్ర మార్చు

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న కొంపల్లి, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2019లో పురపాలక సంఘంగా ఏర్పడింది.

భౌగోళికం మార్చు

కొంపల్లి 17 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 17°32′10″N 78°29′02″E / 17.536°N 78.484°E / 17.536; 78.484 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 22377 మంది కాగా, అందులో 11306 మంది పురుషులు, 11071 మంది మహిళలు ఉన్నారు. 12550 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 2 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[3]

పౌర పరిపాలన మార్చు

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి దీనిని 18 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[4] వీరు ఎన్నికైననాటినుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

వార్డు కౌన్సిలర్లు మార్చు

  1. ఎడమ శకుంతల
  2. జంధా మంజుల
  3. సన్న శ్రీశైలం యాదవ్
  4. మడమశెట్టి సువర్ణ
  5. బి. శ్రీవిద్య
  6. పూజారి వసంత
  7. యస్. సూర్యకళ
  8. ఎ. రజిని
  9. ఆదిరెడ్డి రాజిరెడ్డి
  10. తాళ్ళ కృష్ణవేణి
  11. జ్యోత్స్నాదేవి కందాడి
  12. దన్నమనేని శిరీష
  13. సన్న రవి యాదవ్
  14. రత్లావత్ గంగయ్య
  15. బి. సరిత
  16. రవీందర్ చింతల
  17. చింతల లక్ష్మి
  18. డప్పు కిరణ్ కుమార్

మూలాలు మార్చు

  1. "Kompally Municipality". kompallymunicipality.telangana.gov.in. Archived from the original on 2020-10-23. Retrieved 2021-04-01.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 1 April 2021.
  3. "Basic Information of Municipality, Kompally Municipality". kompallymunicipality.telangana.gov.in. Archived from the original on 2020-09-25. Retrieved 2021-04-01.
  4. "Council, Kompally Municipality". kompallymunicipality.telangana.gov.in. Archived from the original on 2020-09-25. Retrieved 2021-04-01.

వెలుపలి లంకెలు మార్చు