కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి
కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాడేరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.[1]
కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2019 నుండి ప్రస్తుతం | |||
ముందు | గిడ్డి ఈశ్వరీ | ||
---|---|---|---|
నియోజకవర్గం | పాడేరు నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1983 పాడేరు గ్రామం, పాడేరు మండలం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | కొట్టగుళ్లి చిట్టినాయుడు | ||
జీవిత భాగస్వామి | తమర్భ నర్సింగరావు | ||
సంతానం | వివేక్, జస్మితశ్రీనందన, గాయిత్రి | ||
నివాసం | విశాఖపట్నం జిల్లా | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
జననం, విద్యాభాస్యం
మార్చుకొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా, పాడేరు మండలం, పాడేరు గ్రామంలో 1983లో జన్మించింది. ఆమె ఆంధ్ర యూనివర్సిటీ నుండి 2006లో ఎంఎస్సీ పూర్తి చేసింది.[2]
రాజకీయ జీవితం
మార్చుకొట్టగుళ్లి భాగ్యలక్ష్మి తన తండ్రి కొట్టగుళ్లి చిట్టినాయుడు అడుగు జాడల్లో రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి అరకు పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, 2014 నుంచి 2017 వరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేసింది. భాగ్యలక్ష్మి 2017లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2019లో జరిగిన ఎన్నికల్లో పాడేరు నియోజకవర్గం నుండి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరీ పై 42804 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టింది.[3][4]
మూలాలు
మార్చు- ↑ Sakshi (2019). "MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
- ↑ Sakshi (18 March 2019). "వైఎస్సార్‌సీపీ దళపతులు". Archived from the original on 19 జనవరి 2022. Retrieved 19 January 2022.
- ↑ Sakshi (25 May 2019). "ఉత్తరాంధ్రలోనే భాగ్యలక్ష్మికి భారీ ఆధిక్యత". Archived from the original on 2021-01-26. Retrieved 16 December 2021.
- ↑ Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.