గిడ్డి ఈశ్వరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే. ఆమె 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాడేరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.[1]

గిడ్డి ఈశ్వరీ

మాజీ ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014 నుండి 2019
ముందు పసుపులేటి బాలరాజు
తరువాత కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి
నియోజకవర్గం పాడేరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి అడపా నాగంనాయుడు
సంతానం అడపా కీర్తి మాన్విత & అడపా దీప్తి మోహిత
నివాసం విశాఖపట్నం జిల్లా
వృత్తి రాజకీయ నాయకురాలు

జననం, విద్యాభాస్యం మార్చు

గిడ్డి ఈశ్వరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా , పాడేరులో జన్మించింది. ఆమె 2001లో ఆంధ్రా యూనివర్సిటీ నుండి ఎంఏ పూర్తి చేసింది.

రాజకీయ జీవితం మార్చు

గిడ్డి ఈశ్వరీ 2013లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆమె పాడేరు నియోజకవర్గానికి పార్టీ సమన్వయకర్తగా నియమితులైన పార్టీ నిర్వహించిన సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిర్వహించింది. ఆమె 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాడేరు నియోజకవర్గం నుండి వైఎస్సార్‌సిపి నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సి.పి.ఐ అభ్యర్ధి జీ దేముడు పై 26141 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైయింది. ఆమె 28 జులై 2016 లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అరకు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకురాలిగా నియమితురాలైంది.[2] ఆమె 27 నవంబర్ 2017లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీ లో చేరింది.[3]

గిడ్డి ఈశ్వరీ 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాడేరు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్‌సిపి అభ్యర్ధి కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి చేతిలో 42,804 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యింది.[4]

మూలాలు మార్చు

  1. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  2. Sakshi (28 July 2016). "అరకు పరిశీలకురాలిగా గిడ్డి ఈశ్వరి". Archived from the original on 23 July 2021. Retrieved 23 July 2021.
  3. "YSRCP Paderu MLA Giddi Eswari joins TDP". Business Standard. 27 November 2017. Archived from the original on 23 July 2021. Retrieved 23 July 2021.
  4. Sakshi (2019). "Paderu Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 23 July 2021. Retrieved 23 July 2021.