కొడైకెనాల్ సరస్సు

కొడైకెనాల్ సరస్సు, కొడైకెనాల్ పట్టణంలోని మానవ నిర్మితమైన, అతి ప్రసిద్ధమైన సరస్సు. తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ జిల్లాలో ఉంది ఈ పట్టణం.  ఈ సరస్సును 1863 లో అప్పటి మదురై కలెక్టర్ సర్ వెరే హెన్రీ లెవింగ్ నిర్మించాడు.[1] ఈ పట్టణాన్ని కూడా బ్రిటీష్ అధికారులు, మిషనరీలు ఎక్కువగా అభివృద్ధి చేశారు.[2][3] కొడైకెనాల్ హిల్ స్టేషన్‌లో ముఖ్యమైన పర్యాటక ప్రదేశం ఇదే.

ఇక్కడ ఒక బోట్ క్లబ్బు, పడవ విహార సేవలూ సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి. వేసవిలో పడవ ప్రదర్శనలు, పూల ప్రదర్శనలూ ఇక్కడ సాధారణం.[4]

చేరుకోవడం

మార్చు

తిరునల్వేలి నుండి కోడై రోడ్డు రైల్వే స్టేషనుకు రైలుద్వారా చేరుకోవచ్చు. అక్కడి నుండి 80 కి.మీ. రోడ్డు దారిలో కొడైకెనాల్ చేరుకోవచ్చు. లేదా 18 కి.మీ. కాలి నడక దారిలోనైనా చేరుకోవచ్చు. పళని రైల్వే స్టేషను నుండి కొడైకెనాల్ 64 కి.మీ. మదురై నుండి 121 కి.మీ., కోయింబత్తూరు నుండి 135 కి, మీ. ఉంటుంది. తమిళనాడు లోని వివిధ ప్రాంతాల నుండి బస్సు సర్వీసులు కూడా ఉన్నాయి.[5]

ఆకృతి, నిర్మాణం, శీతోష్ణస్థితి

మార్చు
 
పొగమంచులో సరస్సులో పడవ విహారం

ఈ సరస్సు నక్షత్రం ఆకారంలో, కొడైకెనాల్ పట్టణానికి నడిమధ్యన ఉంది. చుట్టూ పచ్చని పళని కొండలతో రమణీయంగా ఉంటుంది. సరస్సుకు ప్రధాన నీటి వనరు ఈ కొండలే.[6]

 
Outflow[permanent dead link] from the lake goes over the Silver cascade fall

మూడు వాగులు ప్రవహించే చోట ఒక మట్టి కట్ట కట్టి సరస్సును నిర్మించారు. సరస్సు పరీవాహక ప్రాంతంలో 1650 మి.మీ. వార్షిక వర్షపాతం ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రతలు 19.8 °C (గరిష్ఠ) and 11.3 °C (కనిష్ఠ) గాను, శీతాకాలంలో 17.3 °C (గరిష్ఠ) and 8.3 °C (కనిష్ఠ) గానూ ఉంటాయి. [6] ఈ సరస్సు నుండి బయటికి ప్రవహించే నీటి ప్రవాహంతో 8 కి.మీ. దూరాన సిల్వర్ కాస్కేడ్ అనే జలపాతం ఏర్పడింది. దీని ఎతు 180 అడుగులు ఉంటుంది.[6]

నీటి నాణ్యత

మార్చు

సరస్సు లోని నీటి నాణ్యతను పరీక్షించినపుడు [7] కింది విషయాలను గమనించారు:

  1. హిందూస్తాన్ యునిలీవర్ కంపెనీ వారి థర్మామీటరు తయారీ సంస్థ విడుదల పాదరసం వలన సరస్సు నీరు కలుషితమైంది.[8]
  2. మైక్రోబియల్ విశ్లేషణ ప్రకారం సరస్సు నీరు తాగేందుకు పనికిరాదు. గృహావసరాలకు వాడే ముందు దీన్ని శుద్ధి చెయ్యాలి.
  3. ప్లవకాల విస్తరణ అనేక పర్యావరణ విషయాల వలన ప్రభావితమైంది
  4. ఎనిమిది జాతుల సూక్ష్మ జలచరాలను గమనించారు.
  5. నీటి కాలుష్యానికి పర్యటకులు, దగ్గరలో నివసించే ప్రజలూ కారణం
  6. సరసు కట్ట నుండి 200 అడుగుల లోపు నిర్మాణాలు చెయ్యకూడదనే కోర్టు ఆదేశాలను ధిక్కరించి నిర్మాణాలు చేసారు.
  7. సరస్సు లోకి కొత్త నీటి రాక, పాత నీటి పోక జరుగుతూ ఉంటుంది కాబట్టి నీటి నాణ్యతపై ఉన్న కాలుష్య కారకల ప్రభావం మారుతూ ఉంటుంది.
  8. చుట్టుపక్కల ఉన్న హోటళ్ళు మొదలైనవాటి నుండి వచ్చే సేద్రియ కాలుష్య కారకాలు నీటిని కలుషితం చేస్తున్నాయి
  1. Sir Vere Henry Levinge 1819 - 1885. "{Sir} Vere Henry LEVINGE". Genealogy.links.org. Retrieved 2012-06-18.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "Hillstation :::". Tamil Nadu Tourism. Retrieved 2012-06-18.
  3. Shiva. "Kodai hills". Kodaihills.blogspot.com. Retrieved 2012-06-18.
  4. http://dspace.iimk.ac.in/bitstream/2259/599/1/543-554.pdf Archived 2011-07-21 at the Wayback Machine Managing Lake Tourism: Challenges Ahead
  5. "Hillstation :::". Tamil Nadu Tourism. Retrieved 2012-06-18.
  6. 6.0 6.1 6.2 "Hillstation :::". Tamil Nadu Tourism. Retrieved 2012-06-18.
  7. P261 Ecological and of Kodai Lake, Palni Hills of South India[permanent dead link]
  8. The Hindu,
    1. A study on water quality assessment on diatom indicators
    "Prevent mercury pollution" Archived 2007-11-04 at the Wayback Machine, (2007-8-23),