కొత్తదాస్ గౌడ్ హైదరాబాదు నగరంలో 1970-1980వ దశకంలో పేరుమోసిన గూండా, రాజకీయనాయకుడు. కొత్తదాస్ రంగారెడ్డి జిల్లాకు చెందిన హయాత్‌నగర్‌ మండలంలోని బండ రావిరాల గ్రామంలో జన్మించాడు. 30 ఏళ్లుగా హైదరాబాదులోని చంచల్‌గూడా ప్రాంతంలో స్థిరపడ్డాడు.[1] ఈయనపై అనేక కేసులు ఉన్నాయి. ఒక కేసులో హైకోర్టు కొత్తదాసు నిందితుడిగా తీర్పు ఇవ్వగా, దానిపై సుప్రీంకోర్టులో సవాలు చేశాడు.[2]

కొత్తదాస్ గౌడ్
జననం
కొత్తదాస్ గౌడ్

(1964-07-01)1964 జూలై 1
మరణం2001 నవంబరు 30(2001-11-30) (వయసు 37)
జాతీయతభారతీయుడు

కొత్తదాస్ 1978లో మలక్‌పేట శాసనసభా నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా శాసనసభకు పోటీచేశాడు. 1989లో తిరిగి మలక్‌పేట నియోజకవర్గం నుండే మజ్లిస్ ఇత్తెహదుల్ ముస్లిమీన్ (ఎం.ఐ.ఎం) పార్టీ అభ్యర్థిగా పోటీచేశాడు. 1998లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా నల్గొండ నియోజకవర్గం నుండి లోక్సభకు పోటీచేశాడు. ఎన్నికలలో ఎన్నడూ గెలవకపోయినా స్థానిక రాజకీయాల్లో ప్రభావవంతమైన వ్యక్తిగా పేరొందాడు.[1] ఇతడు 1996లో విడుదలైన తెలుగు చిత్రం ఓంకారం లో తన నిజ జీవిత పాత్రను పోషించాడు.

కొత్తదాస్ పెద్ద పెద్ద రాజకీయనాయకులతో సంబంధాలు ఉండేవి. అంజయ్య ప్రభుత్వంలో హోం శాఖామంత్రిగా పనిచేసిన కె.ప్రభాకర్ రెడ్డితో ఉన్న సంబంధాలు అప్పటి హైదరాబాదు పోలీసు కమీషనరు పి.వి.పవిత్రన్ కు ప్రభాకరరెడ్డికి మధ్య ఘర్షణకు దారితీసింది. 1981 ఏప్రిల్ 28 సాయంత్రం అబీడ్సు ప్రాంతంలో కొత్తదాసు గ్యాంగు చేసిన అల్లర్లకుగాను పోలీసు కమీషనరు పవిత్రన్, కొత్తదాసుతో పాటు ఆయన బృందాన్ని ఏప్రిల్ 30వ తేదీన అరెస్టు చేశాడు. ఈ అరెస్టు జరిగిన వెంటనే పవిత్రన్ ను సెలవుపై పంపించారు. కొత్తదాసు పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో "పార్టీలకతీతంగా నా గ్యాంగు ప్రస్తుత హోం మంత్రి కె.ప్రభాకర్ రెడ్డికి రాజకీయంగా మద్దతునిస్తుందని" చాటుకున్నాడు.[3] ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల కె.ప్రభాకర్ రెడ్డి తన మంత్రిత్వశాఖను మార్పించుకొని వేరే శాఖకు మంత్రి అయ్యాడు. పోలీసు కమీషనరు పి.వి.పవిత్రన్ బదిలీ అయ్యాడు.[4]

2001, నవంబరు 30న కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మరణించాడు.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Kotha Das dead". The Times of India. No. Dec 9, 2001. Retrieved 10 April 2015.
  2. Pachauri, Pankaj (November 30, 1989). "Day of the don - Criminals in elections 1989". India Today. No. November 30, 1989. Retrieved 10 April 2015.
  3. Ghosh, Srikanta (1997). Indian Democracy Derailed Politics and Politicians. APH Publishing. p. 149. ISBN 9788170248668. Retrieved 13 April 2015.
  4. "Andhra Pradesh: The gangster connection?". India Today. No. June 15, 1981. Retrieved 13 April 2015.