కొత్తపల్లి సుబ్బా రాయుడు

కొత్తపల్లి సుబ్బారాయుడు భారతీయ రాజకీయ నాయకుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత. [1]న‌ర‌సాపురం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి ఎంపీగా విజ‌యం సాధించిన సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌. మాజీ మంత్రి.

కొత్తపల్లి సుబ్బారాయుడు

పదవీ కాలం
1996-1998
నియోజకవర్గం నరసాపురం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్
జీవిత భాగస్వామి ఇందిరా ప్రియదర్శని
మూలం http://loksabhaph.nic.in/writereaddata/biodata_1_12/3807.htm

వ్యక్తిగత జీవితం మార్చు

రాయుడు 1959లో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లో జన్మించారు. నరసాపురం వై ఎన్ ఎన్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 1981లో ఇందిరా ప్రియదర్శిని ను వివాహం చేసుకున్నారు ఇతనికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. ఇతని కుమారుడు నారాయణ రాయుడు అనారోగ్యం కారణంగా మరణించాడు [2]

రాజకీయ జీవితం మార్చు

రాయుడు 1989, 1994, 1999, 2004 సంవత్సరాల్లో వరుసగా 4 సార్లు తెలుగుదేశం పార్టీ తరఫున నర్సాపురం శాసనసభ నియోజకవర్గం నుండి గెలిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. అతను ఆంధ్రప్రదేశ్ లో పశ్చిమగోదావరి జిల్లాలో నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున 1996 సంవత్సరంలో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో గెలిచారు. 2009లో ప్రజారాజ్యం తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో నర్సాపురం శాసనసభ నియోజకవర్గం స్థానం నుండి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత తెలుగుదేశం పార్టీ లో చేరి కాపు కార్పొరేషన్ చైర్మన్ గా కూడా పనిచేశారు. [3] [4] [5] 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. [6]

వైసీపీ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌ మార్చు

కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడిని పార్టీ నుంచి బ‌హిష్క‌రించినట్టు వైసీపీ అధినేత‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 2022 జూన్ 1న ప్ర‌క‌టించారు.[7] రాబోయే 2024 ఎన్నిక‌ల్లో అతని వ్యూహం వెళ్లడించిన తీరుపై పార్టీ నిబంధ‌నావ‌ళిని అతిక్ర‌మించార‌ని క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీ వైసీపీ అధినేత‌కు నివేదించింది. ఈ నివేదిక‌ను ఆధారం చేసుకుని కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడిని పార్టీ నుంచి బ‌హిష్క‌రణ నిర్ణయం తీసుకున్నారు.

మూలాలు మార్చు

  1. "Rayudu Biodara".
  2. "Rayudu son Narayana Rayudu died".
  3. "Kothapalli Subbarayudu takes charge as chief of Kapu Corporation". The New Indian Express. 29 April 2018. Retrieved 6 January 2021.
  4. "N Chandrababu Naidu lures Kapu leader to strengthen Telugu Desam". Sampat G Samaritan. Deccan Chronicle. 12 May 2016. Retrieved 6 January 2021.
  5. Andhra Pradesh (India) (2000). Andhra Pradesh Acts and Ordinances. Government of Andhra Pradesh, Law Department. p. 236. Retrieved 6 January 2021.
  6. "Rayudu join YCP".
  7. "kothapalli subbarayudu suspended: YSRCP నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడు సస్పెండ్.. ఆ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే! - ex minister kothapalli subbarayudu suspended from ysrcp | Samayam Telugu". web.archive.org. 2022-06-01. Archived from the original on 2022-06-01. Retrieved 2022-06-01.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బాహ్య లింకులు మార్చు