కొత్తపల్లె (చినమండెం)

కొత్తపల్లె, అన్నమయ్య జిల్లా, చిన్నమండెం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

కొత్తపల్లె
—  రెవెన్యూయేతర గ్రామం  —
కొత్తపల్లె is located in Andhra Pradesh
కొత్తపల్లె
కొత్తపల్లె
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 13°53′54″N 78°48′39″E / 13.8984°N 78.8109°E / 13.8984; 78.8109
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అన్నమయ్య
మండలం చిన్నమండెం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 516214
ఎస్.టి.డి కోడ్

కొత్తపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని మాండవ్య నది ఒడ్డున గ్రామదేవత మల్లూరమ్మ తల్లి ఆలయం ఉంది. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందినదీ గ్రామ దేవత. ఈ ఆలయంలో తిరునాళ్ళు, ప్రతి సంవత్సరం,ఫాల్గుణ మాసంలో రెండురోజులపాటు నిర్వహించెదరు. మొదట అమ్మవారిని, తిమ్మారెడ్డిగారిపల్లె నుండి సాంప్రదాయ పద్ధతిలో ఆలయానికి తీసుకొనివస్తారు. మొదటిరోజు(ఆదివారం) సిద్ధబోనాలు అమ్మవారికి సమర్పించటంతో జాతర మొదలవుతుంది. మ్రొక్కులు ఉన్నవారు చాందినీ బండ్లు కడుచున్నారు. ఈ సందర్భంగా, భజనలు. కోలాటాలు వగైరా కార్యక్రమాలు జరుగును. సోమవారం పగలు తిరునాళ్ళు నిర్వహించెదరు. ఈ జాతరకు చుట్టుప్రక్క గ్రామాలనుండియేగాక, భక్తులు చిత్తూరు, అనంతపురం జిల్లాలనుండి గూడా విచ్చేయుదురు.

గ్రామ రాజకీయాలు

మార్చు

ఈ గ్రామస్థులు పల్లె ప్రగతికి సర్పంచిల సాయంతో ముందడుగు వేశారు. విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు బెల్లం కొండారెడ్డి ఆదర్శమార్గాన్ని అందరూ ఎంచుకున్నారు. ఆయన కుటుంబీకులు చంద్రశేఖర రెడ్డి, ఆదిశేషారెడ్డి, మురళీధర రెడ్డి, పద్మావతమ్మ రు.10 లక్షలు సమకూర్చి గ్రామంలో వైద్యాలయ అవసరాన్ని తీర్చారు. తమ స్వంత భవనాలు రు.2.75 లక్షలతో బాగుజేసి ఇవ్వటంతో ప్రభుత్వం వైద్యాలయాన్ని ఆవిష్కరించి, 2007 ఫిబ్రవరి 13 నుండి సేవలందించటం ప్రారంభించింది. వీరు పక్కా భవనాలకోసం భూదానం చేశారు. గ్రామంలోని పాఠశాలకు అవసరమైన కంప్యూటర్లను మురళీధర రెడ్డి సమకూర్చి, గ్రామపాలనలో ప్రజాభాగస్వామ్యాన్ని ఇనుమడింపజేశారు. గ్రామదేవత మల్లూరమ్మకు గర్భగుడి, మంటపాన్నీ నిర్మించారు. వీధులకు చక్కటి దీపాలను అమర్చేందుకు నిధులు ప్రోగుజేశారు. విద్యుత్తు ఉపకేంద్రం, పంచాయతీ భవనం, నీటి ట్యాంకు, సిమెంట్ రహదారులుఅమర్చుకున్నారు.[1]

మూలాలు

మార్చు
  1. ఈనాడు కడప జులై 19, 2013. 8వ పేజీ.

మూలాలు

మార్చు