కొవ్వూరు

ఆంధ్రప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరు మండల పట్టణం


కొవ్వూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లా,కొవ్వూరు మండలానికి చెందిన పట్టణం, మండలకేంద్రం. ఇది గోదావరి నదీ తీరాన ఆధ్యాత్మిక నేపథ్యంగల ఊరు. చారిత్రక, సాహిత్య ప్రాధాన్యత ఉన్న రాజమహేంద్రవరం గోదావరి నదికి ఒకవైపున ఉండగా, దానికి ఎదురుగా రెండవ వైపున కొవ్వూరు ఉంది. గోదావరి పుష్కరాల సమయం ఇక్కడ చాలా విశేషం. వాడపల్లి మీదుగా రాజమండ్రి వెళ్ళుతున్నప్పుడు గోదావరి దాటడానికి రైలు-రోడ్డు వంతెన, కొత్త రైలు వంతెనలు ఇక్కడే ప్రారంభం అవుతాయి.

గోదావరి ఒడ్డున కొవ్వూరు
పట్టణం
నిర్దేశాంకాలు: 17°01′N 81°44′E / 17.02°N 81.73°E / 17.02; 81.73అక్షాంశ రేఖాంశాలు: 17°01′N 81°44′E / 17.02°N 81.73°E / 17.02; 81.73
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతూర్పు గోదావరి జిల్లా
మండలంకొవ్వూరు మండలం
విస్తీర్ణం
 • మొత్తం24.56 కి.మీ2 (9.48 చ. మై)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం39,667
 • సాంద్రత1,600/కి.మీ2 (4,200/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1061
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 8813 Edit this on Wikidata )
పిన్(PIN)534350 Edit this on Wikidata
జాలస్థలిEdit this at Wikidata

పేరు వ్యుత్పత్తిసవరించు

కొవ్వూరు పేరు బ్రిటిషు వారు భారత దేశాన్ని పాలించడానికి మునుపు గోవూరుగా ఉండేది. కాలక్రమంలో అది కొవ్వూరుగా మారింది. గోవు సంచరించిన ప్రాంతం కాబట్టి, గోవూరు అయింది. పశువు వేదన పడిన ప్రదేశం "పశువేదన"గా పేరుగాంచి, కాలక్రమంలో "పశివేదల"గా రూపాంతరం చెందింది. అఖండ గోదావరి పాయలుగా విడిపోయిన ప్రాంతం విగ్నేశ్వరంగా పేరు. కాలక్రమంలో అది విజ్జేశ్వరంగా మారింది.[2]

చరిత్రసవరించు

స్థల పురాణంసవరించు

నేటి కాలంలో కొవ్వూరుగా ప్రసిధ్దమైన ఈ పుణ్యక్షేత్రం గోవూరు లేక గోష్పాద క్షేత్రంగా పిలువబడేది. గౌతమ మహర్షి ఈ నదీ తీరాన తపమాచరించినట్టు పురాణగాధలు వివరించాయి. గోదావరీ తీరాన ఉన్న 'గోపాదాల రేవు' ఆశేష జన సందోహాన్ని ఆకర్షిస్తుంది. పూర్వము ఒకసారి పదిహేను సంవత్సరాలు వర్షాభావంతో కరువు సంభవించింది. చాలామంది ప్రజలకు, మునులకు ఒక్క గౌతమ మహర్షి ఆశ్రమం మాత్రమే సుభిక్షంగా ఉందని తెలిసింది. గౌతమ మహర్షి గాయత్రీ దేవిని ప్రార్థించగా ఆమె కృపతో ఒక రోజులో ఎంతమందిని అయినా పోషించగల బంగారు పాత్ర పొందగలిగాడు. తన తపో శక్తితో, గాయత్రీ మాత అనుగ్రహంతో ఉదయం పొలంలో విత్తనాలు చల్లితే సంధ్యా సమయానికి పంట వచ్చేది. గౌతమ మహర్షి ఆశ్రమం ఒక్కటే కరువు లేకుండా ఉండటం చూసి ఓర్వలేకపోయిన ఇతర మునులు ఒక మాయ గోవును సృష్టించి గౌతమ మహర్షి పొలంలోకి పంపినారు. మహర్షి ఆ సమయంలో ధ్యానంలో ఉన్నాడు. అలికిడికి కళ్ళు తెరిచి చూడగా గోవు పంట తినుచున్నదని గ్రహించి దర్భతో అదిలించాడు. మాయాగోవు కావున అది కొంచెం దూరం పారిపోయి వేదన అనుభవించి మృతి చెందింది. గోహత్యాపాతకం పోవాలంటే పవిత్ర గంగానదిని ప్రవహింపచేయాలని అందరు నిశ్చయించారు. గౌతమ మహర్షి తపస్సు చేసి మహా శివుని అనుమతితో గంగను తీసుకొని వచ్చాడు. గంగను విడుచునప్పుడు మహా శివుని షరతు ఏమనగా గౌతముడు వెనుతిరిగి చూడరాదు. అఖండ గోదావరి నాశిక్, త్రయంబకేశ్వరం నుంచి బాసర, ధర్మపురి, భద్రాచలం మీదుగా గోవూరులో ప్రవేశించింది. గౌతముడు నీటి శబ్దం వినిపించుటలేదు అని వెనుతిరిగి చూడగా ఆ ప్రదేశంలో అఖండ గోదావరి పాయలుగా విడిపోయింది.

దేవి పురాణం ప్రకారం, పార్వతీ దేవి సవతి పోరుని దూరం చేసుకొనుటకు ఒక మాయ ఆవును సృష్టించి తపమాచరించుచున్న గౌతమ మహర్షి దగ్గరకి పంపగా తపోభంగం కలిగిన మహర్షి ఆ అవును తన తపశ్శక్తితో ధగ్దం చేశాడు. గోహత్యాపాతకం తనకంటకండా ఉండాలంటే దివి నుండి గంగను తీసుకువచ్చి ఆ గోవు మరణించిన ప్రదేశంలో ప్రవహింపచేయాలని చెప్పిన పార్వతీ దేవి ఆనతి మేర గౌతముడు తపస్సు చేసి గంగను దివి నుండి భువికి తెప్పించాడు. ఆ హిమగంగ పారిన ప్రదేశమే గోష్పాద క్షేత్రంగా, ఆ గంగే గౌతమి (గోదావరి) గా ప్రసిద్ధి చెందాయి. మరణించిన గోవును గోదావరి నదీ ప్రవాహంతో పునరుజ్జీవితుల్ని చేశారు.[2]

జిల్లా మార్పుసవరించు

2022 ఏప్రిల్ 4 కు ముందు ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో వుండేది.

భౌగోళికంసవరించు

జిల్లా కేంద్రమైన రాజమండ్రినుండి పశ్చిమ దిశలో 11 కి.మీ దూరంలో వుంది.

జనగణన గణాంకాలుసవరించు

2011 జనగణన ప్రకారం మొత్తం జనాభా 39,667.

పరిపాలనసవరించు

 
కొవ్వూరు సబ్ కలెక్టర్ కార్యాలయం

కొవ్వూరు పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

విద్యా వ్యవస్థసవరించు

ఇక్కడ 1902లో నిర్మింపబడిన ఆంధ్రగీర్వాణవిద్యాపీఠము గలదు. దీనినందు శ్రీ వాడ్రేవు జోగమ్మ వేదసంస్కృత కళాశాల, శ్రీమావులేటి సోమరాజు సంస్కృతోన్నతపాఠశాలలున్నాయి.

రవాణా వ్యవస్థసవరించు

 
కొవ్వూరు రైల్వే స్టేషను
 
కొవ్వూరు బస్ స్టాండ్

జాతీయ రహదారి 16 పైనున్నది. అలాగే చెన్నై -హౌరా రైలు మార్గంలో నున్నది.

దర్శనీయ ప్రదేశాలు/ దేవాలయాలుసవరించు

 
వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం

గోదావరి పుష్కరాల ఘాట్సవరించు

కొవ్వూరు నుండి రాజమహేంద్రవరం వరకు గోదావరి పై కట్టిన మూడు వంతెనలు ఇక్కడి ప్రత్యేకత. సుమారు నూరు సంవత్సరాల క్రితము ఆర్థర్ కాటన్ కట్టించిన రైలు వంతెన ఇప్పటికి చెక్కుచెదరకండా ఉండటం విశేషం. పన్నెండు వత్సరములకొక సారి వచ్చే గోదావరి పుష్కరములందు దేశపు నలుమూలల నుండి ఆశేష భక్తజనం ఈ గోష్పాద క్షేత్రమును దర్శించి, పవిత్ర గోదావరి నదిలో స్నానమాచరిస్తారు.

ఇవీ చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
  2. 2.0 2.1 బదరీనాథ్, కానూరి (ఫిబ్రవరి 2012). "నాటి 'వేంగీ విషయం'లోని (నేటి ప.గో.జిల్లా) కొన్ని గ్రామ నామాలు- వివరణలు". సుపథ సాంస్కృతిక పత్రిక. 12 (2): 35. {{cite journal}}: line feed character in |title= at position 63 (help)

వెలుపలి లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కొవ్వూరు&oldid=3602408" నుండి వెలికితీశారు