డాక్టర్ కోట నీలిమ భారతీయ రచయిత్రి, పరిశోధకురాలు, రాజకీయ వ్యాఖ్యాత, కళాకారిణి. ఆమె రచనలు, కళలు, విద్యాసంబంధమైన విషయాలలో గ్రామీణ కష్టాలు, లింగభేదం, రైతు ఆత్మహత్యలు, ప్రజాస్వామ్య సమాజాల పరిధులపై దృష్టి కేంద్రీకరించింది. ఆమె తెలంగాణలోని హైదరాబాద్‌లో నివసిస్తున్నది.

కోట నీలిమ
జాతీయతభారతీయురాలు
విద్యజవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (న్యూ ఢిల్లీ)
ఢిల్లీ విశ్వవిద్యాలయం
జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ
రచనా రంగంరాజకీయ వ్యాఖ్యానం నాన్ ఫిక్షన్, కల్పన
గుర్తింపునిచ్చిన రచనలువిడోస్ ఆఫ్ విదర్భ: మేకింగ్ ఆఫ్ షాడోస్,
షూస్ ఆఫ్ ది డెడ్

2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఆమె సనత్‌నగర్‌ నియోజకవర్గం నుడి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉంది.[1]

బాల్యం, విద్యాభ్యాసం మార్చు

పాత్రికేయుడు, రచయిత దివంగత కె.వి.ఎస్. రామశర్మ, ఉమా శర్మ దంపతులకు కోట నీలిమ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జన్మించింది.[2] ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్‌లో పిహెచ్.డి, ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుండి అంతర్జాతీయ సంబంధాలలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్‌ పట్టా పొందింది.[3] ఆమె పాల్ హెచ్. నిట్జే స్కూల్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (SAIS), జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ, వాషింగ్టన్ డీసిలో దక్షిణాసియా అధ్యయనాలలో సీనియర్ రీసెర్చ్ ఫెలో కూడా.[4] ఆమె అర్పణ కౌర్ నేతృత్వంలోని అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్‌లో కూడా చదువుకుంది.[5]

పరిశోధన, రచన మార్చు

దేశంలోని పేదలు, మహిళలపై ఆమె ఫిక్షన్, నాన్-ఫిక్షన్ అనే రెండు శైలులలో పుస్తకాలు రాస్తుంది. గ్రామీణ రైతుల ఆధారంగా ఆమె నవలలు రివర్‌స్టోన్స్, మనీలెండర్ రూపొందించబడ్డాయి.[6] రైతుల ఆత్మహత్యలపై దృష్టి సారించిన ఆమె షూస్ ఆఫ్ ది డెడ్ అనే నవల రచించింది.[7] 2016లో, చిత్రనిర్మాత వెట్రిమారన్ షూస్ ఆఫ్ ది డెడ్‌ని చలనచిత్రంగా రూపొందించడానికి ఎన్నుకున్నాడు.[8][9] ఆమె నవల ది హానెస్ట్ సీజన్ ఒక మహిళా జర్నలిస్ట్ ప్రధాన పాత్రతో రాజకీయ థ్రిల్లర్.[10]

జైపూర్ లిటరరీ ఫెస్టివల్[11][12], అపీజే కోల్‌కతా లిటరరీ ఫెస్టివల్, డెహ్రాడూన్ లిటరేచర్ ఫెస్టివల్, ఒడిషా లిటరరీ ఫెస్టివల్[13], ఊటీలిట్‌ఫెస్ట్[14], టైమ్స్ లిట్‌ఫెస్ట్[15], ఢిల్లీ లిటరరీ ఫెస్టివల్‌తో సహా సాహిత్య ఉత్సవాల్లో ఆమె పాల్గొంటుంది.

పెయింటింగ్, ఫోటోగ్రఫీ మార్చు

ఆమె కళాఖండాలు ఢిల్లీలోని లలిత్ కళా అకాడమీ[16], ఇండియా హాబిటాట్ సెంటర్‌లలోనే కాక ముంబై, బెంగళూరు, కోల్‌కతాలలో కూడా కళా ప్రదర్శనలలో ప్రదర్శించబడ్డాయి.[17] ది నెహ్రూ సెంటర్, లండన్, మ్యూజియం, చైనా ఆర్ట్ మ్యూజియం, నేషనల్ మ్యూజియం ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, బిష్కెక్, కిర్గిజిస్తాన్లతో సహా అనేక అంతర్జాతీయ ప్రదర్శనలలో కూడా ఆమె పెయింటింగ్స్ ప్రదర్శించబడ్డాయి.[18] అలాగే, బెల్జియంలోని మ్యూజియం ఆఫ్ సేక్రేడ్ ఆర్ట్స్‌లో శాశ్వత సేకరణలో భాగంగా కూడా ఉన్నాయి.[19]

రాజకీయ జీవితం మార్చు

ఆమె భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా భార్య.[20] ఆమె తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసింది.[21][22]

మూలాలు మార్చు

  1. "పరిశోధనలో గెలిచారు.. ప్రజాక్షేత్రంలో నిలిచారు." EENADU. Retrieved 2023-11-11.
  2. "Senior journalist passes away". The Hindu. 20 December 2008.
  3. D’Souza, Ornella (August 25, 2019). "Thorns in the fields of women farmers". The New Indian Express. Retrieved 18 September 2021.
  4. Jayan, TV (25 March 2018). "Unseen victims of farm distress". The Hindu Business Line. Retrieved 18 September 2021.
  5. Kapoor, Aekta (February 12, 2018). "It's Near Impossible to Write the Woman's Whole Truth, Says Kota Neelima". eShe. Retrieved 19 September 2021.
  6. Express News Service (October 7, 2009). "Kota Neelima's new novel released in city". The Indian Express. Retrieved 18 September 2021.
  7. Balantrapu, Mihir (3 August 2013). "Gritty realities". The Hindu. Retrieved 18 September 2021.
  8. Srinivasan, Latha (April 2, 2016). "Meet Neelima Kota - the author who writes about farmer suicides in India". DNA. Retrieved 18 September 2021.
  9. "Neelima Kota is confident that Vetrimaaran will do justice to her book". India Today. IANS. 19 March 2016. Retrieved 18 September 2021.
  10. Dubey, Divya (21 May 2016). "The Honest Season review: An engrossing political thriller that moves at a good pace". Hindustan Times. Retrieved 18 September 2021.
  11. Banerjee, Poulomi (27 January 2018). "India's invisible widows: Its time for a separate kind of feminism in rural India". Hindustan Times.
  12. Chatterjee, Rituparna (24 January 2018). "Apologise or we won't allow to participate in Jaipur Lit Fest, Karni Sena Threatens Author Kota Neelima". Huffpost.
  13. "Eastern India's biggest literary show from today". The New Indian Express (in Indian English). 2018-09-29. Retrieved 2018-01-18.
  14. "Ooty Lit Festival, 2021". OotyLitFest (in Indian English). 2021-09-29. Archived from the original on 2022-10-07. Retrieved 2022-10-08.
  15. "Times LitFest Speakers". The Times of India (in Indian English). 2018-09-29. Retrieved 2021-09-16.
  16. "Farmers' widows inspire Kota Neelima's art". Business Standard. IANS. May 18, 2018. Retrieved 18 September 2021.
  17. "The Manifest Absence". Nehru Centre. 10 September 2018.
  18. "Indian Contemporary Arts Exhibition in Bishkek". 18–23 October 2016.{{cite news}}: CS1 maint: date format (link)
  19. "Reflections of farmers' suicides, widows in Kota Neelima's paintings". The Quint. IANS. September 12, 2019. Retrieved 18 September 2021.
  20. "Congress leaders' families move SC for intervention in Sudarshan TV case". The Indian Express. PTI. September 24, 2020. Retrieved 18 September 2021.
  21. "Telangana Congress plans 'guarantee card' for Dharani glitches". The New Indian Express. January 5, 2023. Retrieved 19 February 2023.
  22. Pulipaka, Balu (December 16, 2022). "Nearly a million farmers losing out on MSP in Telangana". Deccan Chronicle. Retrieved 19 February 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=కోట_నీలిమ&oldid=4165302" నుండి వెలికితీశారు