తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టిపిసిసి)

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అనేది తెలంగాణ రాష్ట్రంలోని భారత జాతీయ కాంగ్రెస్ యొక్క రాష్ట్ర విభాగం..[1] పొన్నాల లక్ష్మయ్య దీనికి మొదటి అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ పార్టీ విభాగం యొక్క ప్రస్తుత అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి . ఈ పార్టీ నుండి ప్రస్తుతం దేశం లోని అతి పెద్ద పార్లమెంటు స్థానమైన భువనగిరి నుండి కోమటిరడ్డి వెంకట్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

తెలంగాణ కాంగ్రెస్
ప్రధాన కార్యాలయంగాంధీ భవన్, నాంపల్లి, హైదరాబాద్, తెలంగాణ
యువజన విభాగంతెలంగాణ యువ కాంగ్రెసు
మహిళా విభాగంతెలంగాణ మహిళా కాంగ్రెసు
సిద్ధాంతం
  • Populism
  • Social liberalism
  • Democratic socialism
  • Social democracy
  • Secularism
కూటమిఐక్య ప్రగతిశీల కూటమి
తెలంగాణ శాసనసభ
6 / 119
(తెలంగాణ శాసన సభ)
ఓటు గుర్తు
Hand INC.svg
Political parties
Elections

ప్రధాన కార్యాలయంసవరించు

ప్రస్తుతం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి. . 2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. రేవంత్‌ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్ష్యుడిగా 26 జూన్ 2021లో జాతీయ కాంగ్రెస్ పార్టీ నియమించింది.రేవంత్ రెడ్డి 2021 జులై 7న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ సమక్షంలో టీపీసీపీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాన కార్యాలయం తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని నాంపల్లికి సమీపంలో ఉన్న గాంధీ భవన్ వద్ద ఉంది.

మూలాలుసవరించు

  1. "Congress names PCC chiefs for Seemandhra, Telangana - Economic Times". Economictimes.indiatimes.com. Retrieved 2014-03-13.