కోట ప్రసాద్

కోట ప్రసాద్ (కోట వెంకట ఆంజనేయ ప్రసాద్) తెలుగు సినిమా నటుడు. అతను భారతీయ జనతా పార్టీ రాజకీయ నాయకుడు, విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు, సినీ నటుడు అయిన కోట శ్రీనివాసరావు కుమారుడు. [1]

జీవిత విశేషాలుసవరించు

అతను తెలుగు హాస్యనటుడు కోట శ్రీనివాసరావు, రుక్మిణి దంపతులకు జన్మించాడు. అతని స్వస్థలం విజయవాడ దగ్గర కంకిపాడు. హైదరాబాదులో నివాసం ఉండేవాడు. అతను యం.బి.ఎ చదివాడు. అతని భార్య మోనాలీ. వారికి ఇద్దరు కుమారులు. వారు శ్రీనివాసరావు, శ్రీహర్ష.

అతను జె.డి.చక్రవర్తి దర్సకత్వంలో జగపతి బాబు కధానాయకుడు గా వచ్చిన సిద్ధం చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమయ్యాడు. ప్రతినాయకునిగా నటించాడు.

అతను 2010 జూన్ 20 న బైక్ మీద వస్తుండగా శంషాబాద్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. మరణించేనాటికి అతని వయస్సు 39 సంవత్సరాలు.[2]

నటించిన చిత్రాలుసవరించు

మూలాలుసవరించు

  1. "Actor Kota's son killed in accident". The Hindu (in ఆంగ్లం). Special Correspondent. 2010-06-21. ISSN 0971-751X. Retrieved 2020-07-15.CS1 maint: others (link)
  2. "Telugu Actor Kota Srinivas Rao's Son Dies in Accident". www.daijiworld.com. Retrieved 2020-07-15.

బాహ్య లంకెలుసవరించు