సిద్ధం

2009 సినిమా బై జ్. డీ. చక్రవర్తి

సిద్ధం 2009 లో వచిన యాక్షన్ చిత్రం. శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిరణ్ కుమార్ కోనేరు నిర్మించిన ఈ సినిమాకు జెడి చక్రవర్తి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో జగపతి బాబు, సింధు మీనన్ ప్రధాన పాత్రలు ధరించారు. అమర్ మొహిలే సంగీతం అందించాడు. ఈ చిత్రం ఒక మాదిరిగా నడిచింది. ఈ చిత్ర కథాంశం హిందీ చిత్రం అబ్ తక్ చప్పన్ నుండి ప్రేరణ పొందింది.[1][2]

సిద్ధం
(2009 తెలుగు సినిమా)
దర్శకత్వం జె.డి.చక్రవర్తి
కథ రాం గోపాల్ వర్మ
చిత్రానువాదం జె.డి.చక్రవర్తి
తారాగణం జగపతి బాబు
సిందూ మీనన్
ముకుల్ దేవ్, కోట శ్రీనివాసరావు
కోట ప్రసాద్
మల్లాది రాఘవ
సంభాషణలు జె.డి.చక్రవర్తి
నిర్మాణ సంస్థ శ్రేయ ప్రొడక్షన్స్
విడుదల తేదీ 12 ఫిబ్రవరి 2009
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథసవరించు

దయానంద్ అలియాస్ దయా ( జగపతి బాబు ) హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ లో ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్టు. అతను తన పనిని పరిపూర్ణతతో చేస్తాడు. సమాజం కొరకు నేరస్థులను చంపడం తప్పు కాదని అతడి ఉద్దేశం. అతని సహాయకులు అఖిల్ ( డాక్టర్ భరత్ రెడ్డి ), సలీం (కోట ప్రసాద్), ఫ్రాన్సిస్ ( నర్సింగ్ యాదవ్ ) మాఫియా ముఠా ప్రణాళికలను పర్యవేక్షించడంలో, సరైన సమయంలో వాటిని అమలు చేయడంలో అతనికి మార్గనిర్దేశం చేస్తారు. కమిషనర్ గురు నారాయణ్ ( కోట శ్రీనివాసరావు ) మద్దతు ఉన్న దయా తన ఉద్యోగంలో నిజాయితీగా ఉంటాడు. మీడియాలో అతడికి కీర్తిని తెచ్చిపెడుతుంది..

డిపార్ట్మెంట్ లోను, మాధ్యమాలలోనూ దయా కున్న పేరు పట్ల సబ్ ఇన్స్పెక్టర్ సలీమ్ అసూయపడతాడు. కమిషనర్ విధుల నుండి పదవీ విరమణ చేసినప్పుడు, మాఫియా డాన్ బిలాల్ ( ముకుల్ దేవ్ ) సహచరుడైన కొత్త కమిషనర్ శివలింగ ప్రసాద్ ( రాధా రవి ) తో కలిసి కుట్రపూరిత ప్రణాళికలు వేస్తాడు. ఈ ముగ్గురూ దయానంద్ కు వివిధ అడ్డంకులను కల్పిస్తారు. ప్రతీకారం కోసం అతని భార్య గౌరి ( సింధు మీనన్ ) ను హత్య చేస్తారు. కానీ, దయానంద్ తన మిషన్‌ను కొనసాగిస్తూ, శివలింగ ప్రసాద్, బిలాల్ ప్రణాళికలను విఫలం చేస్తాడు.[3]

తారాగణంసవరించు

మూలాలుసవరించు

  1. http://www.hindu.com/thehindu/thscrip/print.pl?file=2009020650290200.htm&date=2009/02/06/&prd=fr&
  2. Siddham review - Telugu cinema Review - Jagapati Babu. Idlebrain.com: (2009-02-12). URL accessed on 2012-08-05.
  3. Error on call to మూస:cite web: Parameters url and title must be specified
"https://te.wikipedia.org/w/index.php?title=సిద్ధం&oldid=3035422" నుండి వెలికితీశారు