కోదాడ
కోదాడు, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, కోదాడు మండలానికి గ్రామం.[1] కోదాడు హైదరాబాదు - విజయవాడ జాతీయ రహదారి మీద, హైదరాబాదు నుండి 176 కి.మీ. దూరం లోను, విజయవాడ నుండి 96 కి.మీ. దూరం లోను ఉంది. తూర్పున కృష్ణా జిల్లా, ఉత్తరాన ఖమ్మం జిల్లా హద్దులుగా కలిగి వున్న ముఖ్య వ్యాపార కేంద్రం. అంతేకాక, ముఖ్య విద్యాకేంద్రంగా కూడా భాసిల్లుతుంది. 2011లో కోదాడు పురపాలకసంఘంగా ఏర్పాటు చేయబడింది.[2]
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
మార్చు2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నల్గొండ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[3]
విద్యా సౌకర్యాలు
మార్చుకె.ఆర్.ఆర్. కళాశాల, కోదాడు సన ఇంజనీరింగ్ కళాశాల, కోదాడమిట్స్ ఇంజనీరింగ్ కళాశాల,కోదాడ కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల,కోదాడ గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల మండలంలో ఉన్నాయి.
శాసనసభ్యుడు
మార్చుబోల్లం మల్లయ్య యాదవ్:2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి తరుపున ఎన్నికైనాడు.
గ్రామ ప్రముఖులు
మార్చు- నెలకురి సిక్కిరెడ్డి: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి.
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "Basic Information of Municipality, Kodada Municipality". kodadamunicipality.telangana.gov.in. Archived from the original on 21 ఏప్రిల్ 2021. Retrieved 7 April 2021.
- ↑ "సూర్యాపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
ఇవి కూడా చూడండి.
మార్చు- కోదాడను వికీమాపియా లో, గూగుల్ మాప్స్ లో వీక్షించండి.