కోరాపుట్ జంక్షన్ రైల్వే స్టేషన్
కోరాపుట్ జంక్షన్ రైల్వే స్టేషన్ అనేది ఒడిషా రాష్ట్రంలో ఉంది. కోరాపుట్ జిల్లాలోని కోరాపుట్ పట్టణానికి రైల్వే సేవలు అందిస్తోంది.
కోరాపుట్ జంక్షన్ రైల్వే స్టేషన్ | |
---|---|
భారతీయ రైల్వేలు జంక్షన్ స్టేషన్ | |
సాధారణ సమాచారం | |
Location | కోరాపుట్, ఒడిశా భారతదేశం |
Coordinates | 18°47′32″N 82°43′09″E / 18.7921°N 82.7191°E |
Elevation | 870 మీ. (2,854 అ.) |
లైన్లు | కొత్తవలస-కిరండల్ రైలు మార్గము ఝార్సుగూడ-విజయనగరం లైన్ |
ఫ్లాట్ ఫారాలు | 5 |
పట్టాలు | 5 ft 6 in (1,676 mm) బ్రాడ్ గేజ్ |
నిర్మాణం | |
పార్కింగ్ | ఉంది |
ఇతర సమాచారం | |
Status | వినియోగంలో ఉంది |
స్టేషను కోడు | KRPU |
జోన్లు | తూర్పు తీర రైల్వే |
డివిజన్లు | రాయగడ |
History | |
Opened | 1963 |
Location | |
చరిత్ర
మార్చుభారతీయ రైల్వే 1960లో కొత్తవలస-కోరాపుట్-జీపూర్-కిరండౌల్ లైన్ (దండకారణ్య ప్రాజెక్ట్ ), టిట్లాగఢ్-బోలంగీర్-ఝర్సుగూడ ప్రాజెక్ట్, రూర్కెలా-కిరిబురు ప్రాజెక్ట్ అనే మూడు కొత్త ప్రాజెక్టులను చేపట్టింది. మొత్తం ఈ మూడు ప్రాజెక్టులు కలిసి డిబికె ప్రాజెక్ట్ లేదా దండకారణ్య బోలంగీర్ కిరిబురు ప్రాజెక్ట్ అని ప్రసిద్ధి చెందాయి.[1] కోరాపుట్-రాయగడ రైలు లింక్ ప్రాజెక్ట్ 1998, డిసెంబరు 31న పూర్తయింది.[2]
రైళ్ళు
మార్చువిశాఖపట్నం-కిరండూల్ ప్యాసింజర్ కోరాపుట్ మీదుగా వెళుతుంది. హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రాయగడ, విజయనగరం మీదుగా కోరాపుట్ నుండి భువనేశ్వర్‌ను కలుపుతుంది. హౌరా-కోరాపుట్ సమలేశ్వరి ఎక్స్‌ప్రెస్ ఝర్సుగూడ, సంబల్‌పూర్, రాయగడ మీదుగా ప్రయాణిస్తుంది. దుర్గ్-జగ్దల్పూర్ ట్రై-వీక్లీ ఎక్స్‌ప్రెస్ తిట్లాగఢ్, రాయగడ, కోరాపుట్ మీదుగా ప్రయాణిస్తుంది.
ప్రయాణీకులలు
మార్చుకోరాపుట్ రైల్వే స్టేషన్ నుండి ప్రతిరోజూ దాదాపు 27,000 మంది ప్రయాణికులు సేవలు అందుకుంటున్నారు.
మూలాలు
మార్చు- ↑ Baral, Chitta. "History of Indian Railways in Orissa" (PDF). Retrieved 2012-11-27.
- ↑ "Koraput–Rayagada Rail Link Project". Process Register. Retrieved 2012-11-27.
బాహ్య లింకులు
మార్చు- Koraput travel guide from Wikivoyage