కోరిక (Desire) అనగా ఏదైనా వస్తువు, పదార్ధము లేదా వ్యక్తి కావాలని అనిపించడం.

బాలుడు పైకి ఎక్కాలని కోరిక కలిగి ఉన్నాడు

భాషా విశేషాలుసవరించు

తెలుగు భాషలో కోరిక అనే పదానికి చాలా ప్రయోగాలున్నాయి.[1] కోరు అనే క్రియకు To desire, ask, propose, pray, demand, beg. ఇచ్ఛించు అని అర్థం. దీనికి నామవాచకం కోరిక A wish. desire. ఇచ్ఛ. అభీష్టము. A vow వరము. కోరు అనగా A share లేదా భాగము అని కూడా అర్థం. ఉదా: సంగోరు (a half share), ఇరుగోరు (both shares or all the crop), మేటికోరు (the share due to the farmer) . విశేషణము (adjective) గా వాడినప్పుడు కోరు అనగా Steep అని అర్థం. ఉదా: కోరుకొండ a steep hill, కోరిల్లు a pent roofed house.

అర్థశాస్త్రంలో కోరికసవరించు

అర్థశాస్త్రంలో కోరిక పదానికి చాలా విశిష్టత ఉంది. అర్థశాస్త్ర పితామహుడు ఆడం స్మిత్ ప్రకారం చెప్పాలంటే కోరికలే వస్తువులకు డిమాండు సృష్టిస్తాయి. అయితే దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. అన్ని కోరికలు డిమాండును సృష్టించలేవు. కోరికతో పాటు ఆ వ్యక్తికి వస్తువుపై ఆసక్తి, వస్తు విలువను చెల్లించగలిగే శక్తి ఉన్నప్పుడే డిమాండు ఏర్పడుతుంది. ఒక కోరికను తీర్చడానికి అనేక వస్తువులు ఉన్నప్పుడు ఆ వస్తువులు పరస్పరం పోటీపడతాయి. అలాంటి వస్తువులను అర్థశాస్త్రంలో ప్రత్యమ్నాయ వస్తువులు అని పిలుస్తారు. ప్రత్యమ్నాయ వస్తువులలో ఏ వస్తువులను వినియోగదారుడు కోరుకుంటాడనే విషయంపై అనేక ఆర్థిక సిద్ధాంతాలు ఉన్నాయి. మానవునికి ఉన్న కోరికల పైన విశ్లేషిస్తూ కొందరు ఆర్థికవేత్తలు మానవుని మేధస్సు "కోరికల పుట్ట"గా పేర్కొన్నారు. ఒక కోరికను తీర్చగానే మరో కోరిక ఏర్పడుతుందని, అసలు మానవునికి వచ్చే అన్ని కోరికలను తీర్చడం అసాధ్యమని వివరించారు.

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కోరిక&oldid=3687060" నుండి వెలికితీశారు