కోరుప్రోలు మాధవరావు

కోరుప్రోలు మాధవరావు తెలుగు గజల్ రచయిత.[1] 2014 డిశంబరు నుండి నేటివరకు నిర్విరామంగా గజల్ రచనా యజ్ఞంలో నిమగ్నమై దాదాపు 6000 గజల్స్ వ్రాశారు.[2] కవిత్వం, దేశభక్తి గీతాలు, లలిత గీతాలు, భక్తి గీతాలు, పద్య శతకాలు, గజళ్ళతో పుస్తకాలు ప్రచురించాడు.

కొరుప్రోలు మాధవరావు
మాధవరావు కొరుప్రోలు
జననంమాధవరావు
(1960-09-04) 1960 సెప్టెంబరు 4 (వయసు 64)
India చెఱువుమాధవరం
ఖమ్మం జిల్లా ,
తెలంగాణ
నివాస ప్రాంతంహైదరాబాద్ , తెలంగాణ
వృత్తిమిధాని ప్రభుత్వరంగ సంస్థలో ఇంజనియర్, గజల్ రచయిత
ప్రసిద్ధిగజల్ కవి
మతంభారతీయుడు
భార్య / భర్తఆండాళ్
పిల్లలుకావ్యశ్రీ, సాయిదివిజేందర్
తండ్రికొరుప్రోలు వెంకటేశ్వరరావు
తల్లిరంగనాయకమ్మ

వ్యక్తిగత జీవితం

మార్చు

మాధవరావు కొరుప్రోలు 1960, సెప్టెంబరు 4న వెంకటేశ్వరరావు - రంగనాయకమ్మ దంపతులకు ద్వితీయ సంతానంగా తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, చెఱువుమాధవరం గ్రామంలో జన్మించారు. తండ్రి వెంకటేశ్వరరావు వృత్తి రీత్యా ఉపాధ్యాయులు. మాధవరావు జన్మించిన ఆరు నెలలకు బదిలీపై ఖమ్మం జిల్లాలో చెన్నూరు చేరడంతో మాధవరావు ప్రాథమిక విద్య 8వ తరగతి సగం వరకు చెన్నూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో, పదవతరగతి వరకు సోదిమర్లపాడు గ్రామంలో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఇంటర్మీడియట్ బనిగండ్లపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగింది. ఆ తరువాత హైదరాబాద్ చేరుకుని డిగ్రీ బియస్ సి, యంపిసితో అగర్వాల్ ఈవెనింగ్ సైన్స్ కాలేజీ మదీనా పత్తర్ గట్టీలో చదివి ప్రథమశ్రేణిలో 1981లో ఉత్తీర్ణులయ్యారు.

బాలానగర్ లోని ఉషా శ్రీరాం డీజిల్స్ లో తన స్వయంప్రతిభతో టెక్నికల్ అసిస్టెంట్ గా చేరి ఒక సంవత్సరంపాటు పనిచేశారు. కొద్దినెలలకే  అప్పట్లో ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ద్వారా వచ్చిన అవకాశంతో1983 జూలై 5 కు ప్రభుత్వరంగ సంస్థ రక్షణ రంగం. MIDHANI మిధానిలో స్వయంప్రతిభతో ఉద్యోగంలో చేరి క్వాలిటీ కంట్రోల్ విభాగంలో ఇన్స్పెక్టర్ గా సేవలందించడం మొదలుపెట్టి సీనియర్ ఇంజనియర్ గా పదవీవిరమణ 2021 మేలో పొందడం జరిగింది. ఉద్యోగం చేస్తూనే తనకు ఎంతో ఇష్టమైన తెలుగులో ఎమ్ ఎ పట్టా 1991లోనే పొందడం జరిగింది.

చిన్ననాటినుండే మాతామహులైన సినీ మాటలు పాటల కవి రచయిత పద్యనాటక కర్త..నాటక కళానిధి కవిశేఖర శ్రీ ఊటుకూరు సత్యనారాయణరావు గారి స్ఫూర్తితో కవిత్వం పట్ల మక్కువ కలిగి నాటికలు కథలు వ్రాయడం ముఖ్యంగా ఎక్కువగా చదవడం అలవాటు చేసుకున్నారు. అలాగే చక్కని విప్లవాత్మక భావాలు కలిగి తనదైన శైలిలో తోటివిద్యార్థినీ విద్యార్థులకు ఆదర్శంగా ఉంటూ ఎప్పుడూ తరగతిలో ప్రథమశ్రేణిలో ఉండటమే గాక తరగతి నాయకుడుగా క్లాస్ పీపుల్ లీడర్ గా తోటివారి అభిమానం చూరగొనడం విశేషం.

సాహితీ వ్యాసంగం

మార్చు

హరికథలు బుర్రకథలు వీధినాటకాలు విశేషంగా చూసి ఎంతో స్ఫూర్తి పొంది స్వయంగా చిన్నచిన్నవి సృజనాత్మకంగా వ్రాసి ప్రదర్శిస్తూ ప్రదర్శింపజేస్తూ మన్ననలు పొందారు. మిధానిలో పనిచేస్తూనే ఆకాశవాణి దూరదర్శన్ లలో అనేక కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. మిధాని గీతం తెలుగులో వ్రాసి ప్రశంసలందుకున్నారు. కవిత్వపరంగా కవితలు..పద్యాలు..గజళ్ళు ..లలితగీతాలు..భక్తిగీతాలు.. సుప్రభాతాలు..దండకాలు..దేశభక్తి గీతాలు. పుంఖానుపుంఖాలుగా వ్రాసి తెలుగు జాతికి అంకితం చేశారు.. చేస్తున్నారు.

ముఖ్యంగా 2008 నుండి విస్తృతంగా PSSM పిరమిడ్ ధ్యానం ధ్యానప్రచార కార్యక్రమాలు  చేస్తూ ఉన్నారు. తెలుగు బాషా పరిశోధన కేంద్రం, అమరావతి, ఆంధ్ర ప్రదేశ్ Archived 2021-10-30 at the Wayback Machine[3] వారు కోరుప్రోలు మాధవరావు  పేరును జాతీయ తెలుగు కవుల చెబితాలో చేర్చి, వారి రచన సంపదను భావితరాలకు అదెలా భద్రపరిచారు. [4]

రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తేజ ఆర్ట్‌ క్రియేషన్స్‌ ఆధ్వర్యంలో మాధవరావు రచించిన తెలుగు గజల్‌ సంపుటి మాధవ మందారాలు-2 పుస్తకావిష్కరణ సభ జరిగింది. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పుస్తకాన్ని ఆవిష్కరించగా, ముకుంద సుబ్రహ్మణ్యశర్మ, సాహితీవేత్త సంగనభట్ల నరసయ్య, ఇరువింటి వెంకటేశ్వరశర్మ, తమ్మూరి రామ్మోహన్‌రావు, తాళ్లపల్లి మురళీధర్‌గౌడ్‌, ఎన్వీ రఘువీర్‌ ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు.[2]

రచనలు

మార్చు
  1. నిశ్శబ్ధనాట్యం (కవితా సంకలనం)
  2. రాగదార (లలిత గీతాలు)
  3. ప్రియధరిత్రి (దేశభక్తి గీతాలు)
  4. వేణురాగం (కృష్ణ భక్తి గీతాలు)
  5. యువవసంత గీతిక (లలిత గీతాలు)
  6. శ్రీ సాయి గీతావళి (భక్తి గీతాలు)
  7. వినవో నా పాట వేంకటేశా (భక్తి గీతాలు)
  8. దండక రత్నమాల (ఏకాదశ దండకాలు)
  9. సాయి మాధవోక్తి (ఆటవెలది పద్యసహస్రం)
  10. శ్రీ సాయి సచ్చరిత్ర (నిత్యపారాయణ గ్రంథం)
  11. శ్రీ పత్రిమాధవోక్తి (ఆటవెలది పద్యశతకం)
  12. తెలుగుపద్య వసంతం (ఉత్పలమాల ద్విశతి)
  13. మాధవమోదారాలు (తెలుగు గజళ్ళు) [2]
  14. ధ్యాన మాధవోక్తి (ఆటవెలది పద్యాలు)
  15. మాధవ మందారాలు-2 (తెలుగు గజళ్ళు)
  16. మాధవ మంజరి (తెలుగు గజల్ మాలిక)
  17. మాట్లాడే మౌనం (కవితా సంకలనం)

మూలాలు

మార్చు
  1. "Amazon.in (Sri Sadguru Sai Leelamrutham: Nityaparayana Grandham)". www.amazon.in (in Indian English). Retrieved 2021-12-20.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. 2.0 2.1 2.2 మాధవరావు, కోరుప్రోలు (18 January 2019). "'మాధవ మందారాలు' పుస్తకావిష్కరణ". Andhrabhoomi. Secunderabad: Deccan Chronicle Holdings Limited. Archived from the original on 28 అక్టోబర్ 2021. Retrieved 29 October 2021. {{cite news}}: Check date values in: |archive-date= (help)
  3. "The Centre for Research in Telugu LanguagePeople Welfare Society, Vijayawada". peoplewelfaresociety.in. Archived from the original on 2021-10-30. Retrieved 2021-10-30.
  4. "మాధవరావు కోరుప్రోలు | National Registry of Telugu Poets". telugupoets.com. Archived from the original on 2021-10-30. Retrieved 2021-10-30.