సంగనభట్ల నర్సయ్య

తెలుగు నటుడు

సంగనభట్ల నర్సయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన రంగస్థల నటులు, దర్శకులు, రంగస్థల అధ్యాపకులు.

సంగనభట్ల నర్సయ్య
Sanganabhatla Narasaiah 01.jpg
జననంజూలై 23, 1954
ధర్మపురి, కరీంనగర్ జిల్లా, తెలంగాణ
ప్రసిద్ధిరంగస్థల నటులు, దర్శకులు, రంగస్థల అధ్యాపకులు.
తెలంగాణ రంగస్థల సమాఖ్య ఆధ్వర్యంలో సంగనభట్ల నర్సయ్యకు సత్కారం
సంగనభట్ల నర్సయ్యను సత్కరిస్తున్న రసమయి బాలకిషన్

జననంసవరించు

సంగనభట్ల నర్సయ్య 1954, జూలై 23న కరీంనగర్ జిల్లా, ధర్మపురి లో జన్మించారు.

విద్యాభ్యాసం- ఉద్యోగంసవరించు

తెలుగు, సంస్కృతంలో ఎం.ఏ., ఎం.ఓ.ఎల్., లింగ్విస్టిక్స్ డిప్లోమా, పిహెచ్.డి. చేశారు. 37 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహ సంస్కృతాంధ్ర కళాశాలో ప్రిన్సిపాల్ గా 28 సంవత్సరాలు పనిచేసి, 2010, డిసెంబరు 31న పదవీ విరమణ పొందారు.

రచనలుసవరించు

 1. తెలుగులో దేశిచ్ఛందస్సు (ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా కొరకు సమర్పించబడింది)[1]
 2. ధర్మపురి క్షేత్ర చరిత్ర
 3. చాటు కవిత్వం
 4. తెలివాహ గోదావరి[2]

వంటి 14 గ్రంథాలు

రంగస్థల ప్రస్థానంసవరించు

12 ఏళ్ల వయసులో 1966 డిసెంబరులో సోనేకీ వర్షా అనే హిందీ నాటకంలోని అజుని పాత్ర ద్వారా రంగస్ధలంపై అడుగుపెట్టారు. 14 ఏళ్ల వయసులో 1968 ఆగస్టు 15న కన్యాశుల్కం నాటకంలోని గిరీశం ఏకాపాత్రాభినయం పాత్ర ద్వారా తెలుగు రంగస్ధలంపై అడుగుపెట్టారు.

నటించిన నాటకాలుసవరించు

గయోపాఖ్యానం, పాండవోద్యోగం, సోనేకి వర్ష్, భువన విజయం, వీరపాండ్య కట్టబ్రాహ్మణ, నాగమనాయుడు, వీరకాపయ, వేములవాడ మహత్యం, మనిషి మనసు, ఎడ్రస్ లేని మనుషులు, కన్యాశుల్కం, సుందరకాండ, కొత్తచిగురు, రేపేంది ?, వందనోటు, నరకంలో లంచం, అంతర్వాణి, నీతులు గోతులు, మిస్టర్ వైజాగ్, ఇచ్చట సన్మానములు చేయబడును మొదలైన నాటకాలలో నటించారు.

దర్శకత్వం వహించిన నాటకాలుసవరించు

వీరపాండ్య కట్టబ్రాహ్మణ, గయోపాఖ్యానం, రేపేంది ? మొదలైనవి.

బహుమతులుసవరించు

గయోపాఖ్యానం, వీరపాండ్య కట్టబ్రాహ్మణ నాటకాలకు వివిధ సందర్భాల్లో బహుమతులు అందుకున్నారు.

పురస్కారాలుసవరించు

 1. బి.ఎన్. శాస్త్రి స్మారక చరిత్రక పరిశోధన పురస్కారం
 2. గ్రామీణ కళాజ్యోతి అవార్డు (నాటకరంగ సేవకు)
 3. సరస పద్య గాయక అవార్డు (వరంగల్)
 4. అబ్బూరి స్మారక అవార్డు (తెలుగు విశ్వవిద్యాలయం)[2]
 5. పర్యావర ప్రదూషణ సంరక్షణ పురస్కారం (గోదావరిఖని)
 6. తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం 2013, 13 జూలై 2016 (తెలివాహ గోదావరి పుస్తకానికి)[3][4]

మూలాలుసవరించు

 1. తెలుగు థీసిస్.కాం. "తెలుగులో దేశీచ్ఛందస్సు". www.teluguthesis.com. Retrieved 5 February 2017.
 2. 2.0 2.1 సురేష్ బ్లాగ్ స్పాట్. "పొట్టి శ్రీరాము తొగు విశ్వవిద్యాయం సాహితీ పురస్కారాు`2013". sureshgk2gs.blogspot.in. Retrieved 5 February 2017.[permanent dead link]
 3. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (14 July 2016). "'సమాజానికి నిజమైన వైద్యులు సాహితీవేత్తలే'". www.andhrajyothy.com. Archived from the original on 12 July 2020. Retrieved 12 July 2020.
 4. ఘనంగా సాహితీ పురస్కారాల ప్రదానోత్సవం, తెలుగువాణి, తెలుగు విశ్వవిద్యాలయ ప్రచురణ, ఏప్రిల్-ఆగస్టు 2016, హైదరాబాదు పుట. 42.