కోహెడ వ్యవసాయ మార్కెట్

తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా కోహెడ గ్రామంలోని వ్యవసాయ మార్కెట్. ముఖ్యమంత్రి కి తీరిక ల

కోహెడ వ్యవసాయ మార్కెట్, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని కోహెడ గ్రామంలో నిర్మిస్తున్న అతిపెద్ద వ్యవసాయ మార్కెట్.[1] 400 కోట్ల రూపాయలకుపైగా వ్యయంతో 178 ఎకరాల విస్తీర్ణంలో ఆసియాలోనే అత్యంత పెద్దదిగా ఈ వ్యవసాయ మార్కెట్ నిర్మించబడుతోంది. ఔటర్ రింగ్ రోడ్. అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరగా ఉండడంతోపాటు రీజినల్ రింగ్ రోడ్ రానున్న నేపథ్యంలో ఈ కోహెడ మార్కెట్ అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నది.[2]

చరిత్ర మార్చు

తెలంగాణ ప్రభుత్వ మార్కెటింగ్ విభాగం కమిటీ ఈ వ్యవసాయ మార్కెట్‌ను నిర్వహిస్తుంది.

మార్కెట్ నమూనా మార్చు

మార్కెట్ నిర్మాణంకోసం కోహెడ మార్కెట్ స్థలం, బాటసింగారం మార్కెటుతోపాటు, కొన్ని దేశాలు, దేశంలోని ప్రముఖ మార్కెట్లు ఆజాద్ పూర్ (న్యూఢిల్లీ), వాసి (ముంబయి), రాజ్ కోట్, బరుదా (గుజరాత్) మార్కెట్లను సందర్శించి లే అవుట్ల నమూనాలను తయారీచేవారు. 2022 మే 27 నుండి 2022 జూలై 30 వరకు కంపెనీ నమూనా లే అవుట్లపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వ్యవసాయ శాఖ  కార్యదర్శి రఘునందన్ రావు, ప్రత్యేక కమీషనర్ హన్మంతు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీభాయి, పర్సన్ ఇంచార్జ్ అదనపు సంచాలకుడు లక్ష్మణుడు, ఇంచార్జ్ కార్యదర్శి చిలుక నర్సింహారెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు, సంస్థ ప్రతినిధులతో పలుమార్లు చర్చలు జరిగాయి.[3]

నిర్మాణ వివరాలు మార్చు

ఈ వ్యవసాయ మార్కెట్ విస్తీర్ణంలోని 41.57 ఎకరాలలో షెడ్లు, 39.70 ఎకరాలలో 681 కమీషన్ ఏజెంట్ల దుకాణాలు, 19.71 ఎకరాలలో కోల్డ్ స్టోరేజీలు, 45 ఎకరాలలో రహదారులు, 24.44 ఎకరాలలో పార్కింగ్ వంటివి నిర్మిస్తున్నారు. మార్కెట్ మాస్టర్‌ లే అవుట్, ఇంజనీరింగ్ డిజైన్స్, ఎస్టిమేట్లకు టెండరుపై వయాంట్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (గుర్ గావ్)కు అప్పగించారు.[4]

మూలాలు మార్చు

  1. India, The Hans (2022-02-19). "Hyderabad: Biggest fruit market yard in Asia to come up in Koheda". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-02-18. Retrieved 2022-08-21.
  2. "రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కోహెడ మార్కెట్ పై సమావేశం నిర్వహణ". 2022-08-01. Archived from the original on 2022-08-21. Retrieved 2022-08-21.
  3. Today, Telangana (2022-08-02). "Hyderabad: CM KCR to finalise Koheda market layout soon". Telangana Today. Archived from the original on 2022-08-01. Retrieved 2022-08-21.
  4. "Niranjan Reddy: రూ.400 కోట్లతో కొహెడలో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్‌". EENADU. 2022-08-02. Archived from the original on 2022-08-02. Retrieved 2022-08-21.