అబ్దుల్లాపూర్‌మెట్ మండలం
అబ్దుల్లాపూర్‌మెట్ మండలం,తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1] అబ్దుల్లాపూర్ మెట్ ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన హైదరాబాదు నుండి 29 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] దానికి ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం కొత్తగా ఏర్పాటైన ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సరూర్‌నగర్ డివిజనులో ఉండేది. ఈ మండలంలో 35 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 4 నిర్జన గ్రామాలు.
అబ్దుల్లాపూర్‌మెట్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°18′33″N 78°41′12″E / 17.309277°N 78.686764°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండల కేంద్రం | అబ్దుల్లాపూర్ |
గ్రామాలు | 31 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 255 km² (98.5 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 1,56,067 |
- పురుషులు | 79,754 |
- స్త్రీలు | 76,313 |
పిన్‌కోడ్ | 501505 |
నూతన మండల కేంద్రంగా గుర్తింపు
మార్చులోగడ అబ్దుల్లాపూర్‌మెట్ గ్రామం రంగారెడ్డి జిల్లా,సరూర్‌నగర్ రెవెన్యూ డివిజను పరిధిలోని హయాత్‌నగర్ మండలానికి చెందింది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా అబ్దుల్లాపూర్ మెట్ గ్రామాన్ని (1+34) ముప్పైఐదు గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా రంగారెడ్డి జిల్లా పరిధిలోనే,ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4] 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 255 చ.కి.మీ. కాగా, జనాభా 156,067. జనాభాలో పురుషులు 79,754 కాగా, స్త్రీల సంఖ్య 76,313. మండలంలో 37,246 గృహాలున్నాయి.[5]
సమీప మండలాలు
మార్చుదక్షిణం ఇబ్రహీంపట్నం, తూర్పున పోచంపల్లి, ఉత్తరము ఘట్కేసర్, దక్షిణాన మంచాల్ మండలాలు ఉన్నాయి. ఈ ప్రాంతము రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లాల సరిహద్దులో ఉంది.
మండలంలోని సంస్థలు
మార్చు- సెంట్రల్ బాంక్ ఆఫ్ ఇండియా, బాటసింగారం, ఆబ్దుల్లాపూర్ మెట్
- సిండికేట్ బాంక్, కోహెడ
- నాగోల్ ఇనిస్టిస్టూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, కుంట్లూరు గ్రామం.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
మార్చు- అబ్దుల్లాపూర్
- అనాజ్పూర్
- బాచారం
- బల్జగూడ
- బండ రావిరాల
- బాటసింగారం
- పిగ్లిపూర్
- గుంటపల్లి
- ఇనాంగూడ
- కవాడిపల్లి
- లష్కర్గూడ
- సుర్మైగూడ
- మజ్జిద్పూర్
- ఒమర్ఖాన్ దాయిరా
- తారామతిపేట్
- కోహెడ
- కుంట్లూరు
- హాథీగూడ
- పసుమాముల
- పెద్ద అంబర్పేట్
- తట్టి అన్నారం
- తట్టిఖానా
- మర్రిపల్లి
- గౌరెల్లి
- మన్నెగూడ
- ముంగనూర్
- కుత్బుల్లాపూర్
- తిమ్మాయిగూడ
- తొర్రూర్
- తుర్కయంజాల్
- ఇంజాపూర్
గమనిక:నిర్జన గ్రామాలు 4 పరిగణించబడ లేదు
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2019-01-04.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 250 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.