ఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్

ఔటర్ రింగ్ రోడ్ (నెహ్రూ వెలి చుట్టు బాట) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ 8 వరుసలతో 158 కిలోమీటర్ల మేర నిర్మించిన రహదారి. ఈ వెలి చుట్టు బాట హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ద్వారా రూ. 6,696 కోట్ల వ్యయంతో నిర్మించబడింది.[1] జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ) రూ. 3.123 కోట్లు సహాయం చేసింది.[2] గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వాహనాలు వెళ్లేలా ఈ రహదారి రూపొందించబడింది.[3] ఈ రహదారిలోని పెద్ద భాగం అనగా 124 కిలోమీటర్ల మేర హైటెక్ సిటీ, నానక్ రాం గూడా, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఐకెపి నాలెడ్జ్ పార్క్, హార్డ్వేర్ పార్క్, తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీ, సింగపూర్ ఫైనాన్షియల్ జిల్లా, గేమ్స్ గ్రామముల మీదుగా వెళుతుంది. ఇది 2012 డిసెంబరులో ప్రారంభించబడింది.[4]

ఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్
Outer Ring Road, Hyderabad
పటం
Outer Ring Road (Nehru ORR) at Narsinghi.jpg
8 వరుసల రింగ్ రోడ్
మార్గ సమాచారం
పొడవు158 km (98 mi)
Existed2008 నుండి ప్రస్తుతం–present
Location
Statesతెలంగాణ

వెలి చుట్టు బాట 44, 65, 161, 163, 765 మొదలైన జాతీయ రహదారులను కలుపుతుంది. దీనివల్ల నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి నగరాలనుండి జాతీయ రహదారి 44 ద్వారా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణించే సమయం తగ్గుతుంది.[5]

గచ్చిబౌలి నుండి శంషాబాద్ వైపు ఔటర్ రింగు రోడ్డు
గచ్చిబౌలి నుండి శంషాబాద్ వైపు ఔటర్ రింగు రోడ్డు

ప్రారంభోత్సవ కాలక్రమం మార్చు

  1. 2008, నవంబరు 14: గచ్చిబౌలి - నార్సింగి - శంషాబాద్ (22 కిమీ) (హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం) [6]
  2. 2010, జూలై 7: శంషాబాద్ - పెద్ద అంబర్‌పేట్ (38 కిమీ) [7]
  3. 2011, ఆగస్టు 14: నార్సింగి - పటాన్ చెరువు (23.7 కిమీ) [8]
  4. 2012, డిసెంబరు 3: పటాన్ చెరువు -గౌడవెల్లి, కండ్లకోయి - శామీర్‌పేట (38 కిమీ) [9]
  5. 2015, మార్చి 4: పెద్ద అంబర్‌పేట్ - ఘటకేసర్ (14 కిమీ) [10]
  6. 2016, జూలై 15: ఘటకేసర్ - శామీర్‌పేట (23 కిమీ) [11]

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. WayBackMachine. "Another 260-km ring road planned for city". web.archive.org. Archived from the original on 6 డిసెంబరు 2010. Retrieved 23 March 2017.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. WayBackMachine. "State considering toll tax on ORR". web.archive.org. Archived from the original on 2 జనవరి 2011. Retrieved 23 March 2017.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. ORR to be drivers delight Archived 2014-12-30 at the Wayback Machine. Ibnlive.in.com (2011-08-21). Retrieved on 2013-12-06.
  4. Another Outer Ring Road stretch to be opened today - Times Of India. Timesofindia.indiatimes.com (2012-12-03). Retrieved on 2013-12-06.
  5. V6 Velugu (18 July 2021). "ఎల్ ఈడీ లైట్లతో మెరిసిపోనున్న ఔటర్ రింగ్ రోడ్" (in ఇంగ్లీష్). Archived from the original on 18 జూలై 2021. Retrieved 18 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. "First phase of Hyderabad Outer Ring Road thrown open". Thaindian News. Archived from the original on 2017-02-01. Retrieved 2017-03-23.
  7. "For smooth traffic flow". The Hindu Business Line. Retrieved 5 January 2016.
  8. "Narsingi-Patancheru ORR stretch opened". IBNLive. Retrieved 5 January 2016.
  9. "Another Outer Ring Road stretch to be opened today - Times of India". The Times of India. Retrieved 5 January 2016.
  10. "ORR: Pedda Amberpet-Ghatkesar stretch opens". The Hindu (in Indian English). 5 March 2015. Retrieved 5 January 2016.
  11. "ORR: Ghatkesar - Shameerpet stretch opens". TOI (in Indian English). 15 July 2016. Retrieved 5 July 2016.