క్షిపణి సాంకేతికత నియంత్రణ వ్యవస్థ
క్షిపణి సాంకేతికత నియంత్రణ వ్యవస్థ (MTCR) క్షిపణులు, మానవరహిత వైమానిక వాహనాలకు సంబంధించిన సాంకేతికతను ఎగుమతి చెయ్యడాన్ని నియంత్రించే వ్యవస్థ. 500 కి.గ్రా. కంటే బరువును, 300 కి.మీ. కంటే దూరం మోసుకుపోగలిగే క్షిపణులు, మానవరహిత విమానాల వ్యాప్తిని ఇది నియంత్రిస్తుంది.
చరిత్ర
మార్చు1987 ఏప్రిల్లో MTCRను ఏర్పాటు చేసారు[1] అప్పట్లో ఉన్న G7 దేశాలు -కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, ఇంగ్లండు, అమెరికాలు కలిసి ఈ వ్యవస్థను ఏర్పాటు చేసాయి. మానవరహితంగా అణుబాంబులను ప్రయోగించే వ్యవస్థలు, విశేషించి 500 కి.గ్రా. కు పైబడిన బరువును 300 కి.మీ. పైబడిన దూరానికి మోసుకెళ్ళే వ్యవస్థలు వ్యాప్తి చెందకుండా నివారించడమే దీని లక్ష్యం.
1992 జూన్ 29 నుండి జూలై 2 వరకు ఓస్లోలో జరిగిన వార్షిక సమావేశంలో MTCR పరిధిని సామూహిక జనహనన ఆయుధాలను మోసుకెళ్ళగలిగే మానవరహితంగా ఎగిరే వాహనాలకు కూడా విస్తరించారు. నిషేధించిన వస్తువులను రెండు వర్గాలుగా విభజించారు. సభ్యదేశాల సంఖ్య 35 కు పెరిగింది. 2016 జూన్ 27 న భారత్ కూడా MTCR లో చేరింది.[2]
MTCR ఏర్పడ్డాక, అనేక బాలిస్టిక్ క్షిపణుల అభివృద్ధి కార్యక్రమాలు ఆగడం గానీ, నెమ్మదించడం గానీ జరిగింది. ఆర్మ్స్ కంట్రోల్ ఎసోసియేషన్ ప్రకారం, "అర్జెంటైనా, ఈజిప్టు, ఇరాక్ దేశాలు సంయుక్తంగా చేపట్టిన కాండర్-2 బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాన్ని ఆపేసాయి. బ్రెజిల్, దక్షిణాఫ్రికా కూడా తమ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలను లేదా అంతరిక్ష వాహనాల కార్యక్రమాలను ఆపేసాయి. పోలండు, చెక్ రిపబ్లిక్ వంటి తూర్పు ఐరోపా దేశాలు MTCR లో చేరే అవకాశాలను మెరుగుపరచుకునేందుకు తమ వద్ద ఉన్న బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేసాయి.” 1994 అక్టోబరులో MTCR మార్గదర్శకాలను మరింత సమానంగా అమలుచేసేందుకు, సభ్యదేశాలు "నో అండర్‌కట్” విధానాన్ని ఏర్పరచుకున్నాయి. దీని ప్రకారం, ఒక సభ్యదేశం ఏదైనా దేశానికి సాంకేతికతను ఇచ్చేందుకు తిరస్కరిస్తే, మిగతా సభ్యదేశాలన్నీ దాన్ని పాటించాలి.[3]
చైనా MTCR లో సభ్యురాలు కాదుగానీ, 1987 నాటి మార్గదర్శకాలను స్వచ్ఛందంగా పాటించేందుకు అంగీకరించింది. 1991 లో చెప్పిన ఈ మాటనే, 1992 లో విదేశాంగ మంత్రి ఇచ్చిన లేఖలోనూ తెలిపింది. 1997 అక్టోబరులో చైనా అమెరికాలు చేసిన సంయుక్త ప్రకటనలో క్షిపణి వ్యాప్తి నిరోధంపై 1994 నాటి తమ సంయుక్త ప్రకటనకు కట్టుబ్వడి ఉన్నట్లుగా ప్రకటించారు[4] 2004 లో చైనా MTCR లో చేరేందుకు అభ్యర్ధించినప్పటికీ, దాని ఎగుమతి నియంత్రణ ప్రమాణాలపై తమకున్న అభ్యంతరాల కారణంగా సభ్యదేశాలు సభ్యత్వాన్ని ఇవ్వలేదు.[5][6]
ఇజ్రాయిల్, రుమేనియా, స్లొవేకియాలు కూడా సభ్యులు కానప్పటికీ స్వచ్ఛందంగా MTCR నియమాలను పాటించేందుకు అంగీకరించాయి.[7]
MTCR కు కొన్ని పరిమితులూ ఉన్నాయి. సభ్యదేశాలు వ్యవస్థ నియమాలను గోప్యంగా అతిక్రమించిన దాఖలాలున్నాయి.[8] చైనా, ఇరాన్, ఇజ్రాయిల్, ఉత్తర కొరియా, పాకిస్తాన్‌లు తమ క్షిపణి కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నాయి. వీటిలో కొన్ని దేశాలు, వివిధ స్థాయిల్లో విదేశీ సహకారంతో 1000 కి.మీ. పైబడిన దూరం ప్రయాణించే మధ్యమ పరిధి బాలిస్టిక్ క్షిపణులను మోహరించాయి. ఇంకా ఎక్కువ పరిధి గల క్షిపణుల కోసం చూస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇజ్రాయిల్, చైనాలు వ్యూహాత్మక అణ్వాయుధయుత ఖండాంతర క్షిపణులను, జలాంతర్గామి ప్రయోగిత బాలిస్టిక్ క్షిపణులను, ఉపగ్రహ వాహక నౌకల వ్యవస్థలనూ మోహరించాయి. వీటిలో MTCR సభ్యత్వం లేని కొన్ని దేశాలు అంతర్జాతీయ విపణిలో ఆయుధాలు కొనడమే కాక, అమ్ముతున్నాయి కూడా. ఉదాహరణకు, ప్రపంచవ్యాప్తంగా బాలిస్టిక్ క్షిపణుల వ్యాప్తిలో ఉత్తర కొరియాది ప్రాథమిక పాత్రగా భావిస్తున్నారు. చైనా, పాకిస్తాన్‌కు బాలిస్టిక్ క్షిపణులను, సాంకేతికతనూ సరఫరా చేసింది.[9] సౌదీ అరేబియాకు DF-3A మధ్యంతర పరిధి బాలిస్టిక్ క్షిపణులను సరఫరా చేసింది.[10] ఇరాన్, సిరియాకు క్షిపణి సాంకేతికతను సరఫరా చేసింది.[11] MTCR లో సభ్య దేశంకాని ఇజ్రాయిల్‌కు తమ షావిత్ అంతరిక్ష ప్రయోగ వ్యవస్థను ఎగుమతి చేసే వీలు లేదు. కానీ 1994 లో క్లింటన్, అమెరికా కంపెనీలు దాన్ని దిగుమతి చేసుకునేందుకు వీలుగా దిగుమతి నిర్బంధాన్ని ఎత్తేసాడు.[12]
2002 లో ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎగెనెస్ట్ బాలిస్టిక్ మిస్సైల్ ప్రాలిఫరేషన్ (ICOC) (దీన్నే హేగ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అని కూడా అంటారు) ను స్థాపించారు. ఇది సామూహిక జనహనన ఆయుధాలను మోసుకెళ్ళగలిగే క్షిపణుల వ్యాప్తిని నిరోధిస్తుంది. దీనిలో 119 మంది సభ్యులున్నాయి. ఇది MTCR కు సమాంతరంగా పనిచేస్తుంది. కాకపోతే తక్కువ నియంత్రణలను అమలు చేస్తూ ఎక్కువ మంది సభ్యులను కలిగి ఉంటుంది.
భారత్ 2105 జూన్‌లో MTCR లో సభ్యత్వం కోసం అమెరికా, ఫ్రాన్సుల మద్దతుతో దరఖాస్తు చేసింది.[13] 2016 జూన్ 27 న 34 మంది సభ్యదేశాల ఏకాభిప్రాయంతో అధికారికంగా సభ్యురాలైంది.[14][15][16]
సభ్యదేశాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "MTCR Index". mtcr.info. Archived from the original on 14 మే 2016. Retrieved 29 June 2016.
- ↑ "Research Library: Country Profiles: Israel". NTI. 2 October 2009. Archived from the original on 3 జూన్ 2004. Retrieved 2010-06-11.
- ↑ "The Missile Technology Control Regime at a Glance". Arms Control Association. Retrieved 2010-06-11.
- ↑ "James Martin Center for Nonproliferation Studies | Combating the spread of weapons of mass destruction with training & analysis". Cns.miis.edu. Retrieved 2016-02-13.
- ↑ "China and Multilateral Export Control Mechanisms". Ministry of Foreign Affairs of the People's Republic of China. 27 May 2010. Retrieved 2010-06-11.
- ↑ "Missile Regime Puts Off China". Arms Control Today. Arms Control Association. November 2004. Archived from the original on 2016-07-04. Retrieved 2010-06-11.
- ↑ "The Missile Technology Control Regime at a Glance | Arms Control Association". Armscontrol.org. Retrieved 2016-02-13.
- ↑ "China Secretly Sold Saudi Arabia DF-21 Missiles With CIA Approval". The Diplomat. 31 January 2014. Retrieved 30 June 2016.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-12-29. Retrieved 2016-11-05.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-04-09. Retrieved 2016-11-05.
- ↑ "Syria | Country Profiles". NTI. Archived from the original on 2016-01-02. Retrieved 2016-02-13.
- ↑ "Israel-U.S. Trade Grows but Missile-related Exports are Still Controlled". Wisconsinproject.org. Archived from the original on 2016-03-04. Retrieved 2016-02-13.
- ↑ "India Fails to get MTCR Membership, But Wins Wide Support". www.indiastrategic.in. Archived from the original on 21 జూన్ 2016. Retrieved 27 June 2016.
- ↑ "India joins Missile Technology Control Regime. Top 5 things to know". The Hindu (in Indian English). 27 June 2016. Retrieved 27 June 2016.
- ↑ "India joins Missile Technology Control Regime as full member". The Indian Express. 27 June 2016. Retrieved 27 June 2016.
- ↑ "The Missile Technology Control Regime". www.mtcr.info. Archived from the original on 2016-03-04. Retrieved 2016-06-27.
బయటి లింకులు
మార్చు- Missile Technology Control Regime website
- Sarah Chankin-Gould & Ivan Oelrich, "Double-edged shield," Bulletin of the Atomic Scientists, May/June 2005.