ఖడ్గమృగం

(ఖడ్గమృగాలు నుండి దారిమార్పు చెందింది)

భారతీయ ఖడ్గమృగం (ఆంగ్లం Indian Rhinoceros) లేదా ఒంటి కొమ్ము ఖడ్గమృగం లేదా ఆసియా ఒంటికొమ్ము ఖడ్గమృగం, ఓ పెద్ద క్షీరదం, నేపాల్, భారత్ లోని అస్సాం యందు ఎక్కువగా కానవస్తుంది. హిమాలయాల పాదభాగాలలోని గడ్డిమైదానా లలోను, అడవులలోనూ కానవస్తుంది. భారత ఖడ్గమృగం గంటకు 25 మైళ్ళ వేగంతో పరుగెత్తగలదు. ఇది ఈతలో ప్రావీణ్యం గలది. దీని చూపు చాలా మందం.

భారతీయ ఖడ్గమృగం
భారతీయ ఖడ్గమృగం (వరుసగా ఎడమనుండి కుడి : శిశువు (మగ), ఆడ మృగం, లేత దశ ఆడమృగం)
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Genus:
Species:
ఆర్. యూనికార్నిస్
Binomial name
రైనోసెరాస్ యూనీకార్నిస్
భారతీయ ఖడ్గమృగాల పరిధి

ప్రాచీన శిలాజాల కాలపు జంతువులా కనబడే ఈ ఖడ్గమృగం, మందమైన 'వెండి రంగు చర్మాన్ని' గలిగి, వుంటుంది. దీని చర్మపు మడతలవద్ద చర్మం ఎర్రగావుంటుంది. మగజంతువుల మెడపై మందమైన చర్మపు మడతలుంటాయి, దీని శరీరంపై వెండ్రుకలు బహు స్వల్పం.[2]

బంధించి వుంచితే 40 యేండ్లు, స్వేచ్ఛగా వదిలేస్తే 47 యేండ్లు బ్రతుకుతాయి.[2]

వీటికి ప్రకృతిలో శత్రువులు చాలా తక్కువ. పులులు వీటి ప్రధాన శత్రువులు. ఇవి సమూహాలలో లేని దూడలను చంపివేస్తాయి. మానవులు రెండవ శత్రువుల కోవలోకి వస్తారు. మానవులు వీటిని చంపి వీటి శరీరభాగాలను అమ్ముకుంటారు.[2]

పరిధి

మార్చు

ఈ ఖడ్గమృగాలు, భారతదేశం, పాకిస్తాన్ నుండి బర్మా వరకు, బంగ్లాదేశ్, చైనా వరకు తిరుగుతూంటాయి. ఈశాన్యభారతం, నేపాల్ లో వీటి జనాభా ఉంది.

జనాభా , అపాయాలు

మార్చు

పందొమ్మిదో శతాబ్దపు ఆఖరులో, ఇరవయ్యో శతాబ్దపు ప్రారంభ దశలో, వీటిని వేటాడి చంపేవారు. ఆ కాలంలో అస్సాం లోని ఆఫీసర్లు, స్వతహాగా 200 మృగాలను వేటాడి చంపారని రికార్డులు చూపిస్తున్నాయి. 1910 లో వీటి వేట భారతదేశంలో నిషేధింపబడింది.[2]

1900 సం.లో కేవలం 100 మృగాలు మాత్రమే వుండగా, నేటికి వీటి జనాభా 2500 చేరింది. అయిననూ వీటి జనాభా అపాయస్థితిలోనే ఉంది. భారత్, నేపాల్ ప్రభుత్వాలు ప్రపంచ వన్యప్రాణుల ఫండ్ నుండి సహాయం పొంది, వీటిని కాపాడుతున్నాయి.

ఖడ్గమృగాల జనాభా వనరులు : here.

సంవత్సరం మొత్తం భారతదేశం నేపాల్
1910 100
1952 350 300 50
1958 700 400 300
1963 600
1964 625 440 185
1966 740 575 165
1968 680
1971 630
1983 1000
1984 1500
1986 1711 1334 377
1987 1700
1990 1700
1994 1900
1995 2135 1600 535
1997 2095
1998 2100
2000 2500
2002 2500
2005 2400
 
ఖడ్గమృగాల జనాభాను చూపు 'గ్రాఫు'.

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. Asian Rhino Specialist Group (1996). Rhinoceros unicornis. 2006. IUCN Red List of Threatened Species. IUCN 2006. www.iucnredlist.org. Retrieved on 11 May 2006. Listed as Endangered (EN B1+2cde v2.3)
  2. 2.0 2.1 2.2 2.3 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Laurie1983 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  • Dinerstein, Eric (2003), The Return of the Unicorns; The Natural History and Conservation of the Greater One-Horned Rhinoceros, New York: Columbia University Press, ISBN 0-231-08450-1
  • Foose, Thomas J. and van Strien, Nico (1997), Asian Rhinos – Status Survey and Conservation Action Plan., IUCN, Gland, Switzerland, and Cambridge, UK, ISBN 2-8317-0336-0{{citation}}: CS1 maint: multiple names: authors list (link)
  • R, Fulconis, ed. (2005). Save the rhinos: EAZA Rhino Campaign 2005/6. London: European Association of Zoos and Aquaria.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=ఖడ్గమృగం&oldid=4321963" నుండి వెలికితీశారు