ఖుర్దా రోడ్-విశాఖపట్నం రైలు మార్గం

(ఖుర్దా రోడ్-విశాఖపట్నం రైలు మార్గము నుండి దారిమార్పు చెందింది)

ఖుర్దా రోడ్-విశాఖపట్నం సెక్షన్ అనేది ఒడిషా లోని ఖుర్దా రోడ్, విశాఖపట్నంలను కలిపే రైలు మార్గం. ఇది హౌరా-చెన్నై ప్రధాన లైన్‌లో భాగం.

ఖుర్దా రోడ్-విశాఖపట్నం రైలు మార్గము
ఆలమండ రైల్వే స్టేషనులో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్
అవలోకనం
స్థితిపనిచేస్తోంది
లొకేల్ఒడిశా, ఆంధ్రప్రదేశ్
చివరిస్థానంఖుర్దా రోడ్
విశాఖపట్నం
ఆపరేషన్
ప్రారంభోత్సవం1899
యజమానిభారతీయ రైల్వేలు
నిర్వాహకులుతూర్పు తీర రైల్వే, దక్షిణ తీర రైల్వే
సాంకేతికం
ట్రాక్ పొడవు424 కి.మీ. (263 మై.)
ట్రాక్ గేజ్5 ft 6 in (1,676 mm) బ్రాడ్ గేజి
ఆపరేటింగ్ వేగంup to 130 km/h (81 mph)
మార్గ పటం
మూస:Khurda Road–Visakhapatnam section

భౌగోళికం

మార్చు

ఖుర్దా రోడ్-విశాఖపట్నం సెక్షన్ తూర్పు తీర మైదానాల గుండా వెళుతుంది. ఒడిశాలో మహానది నది డెల్టా నుండి చిలికా సరస్సు దాటి తర్వాత ఉత్తర సర్కార్ల వరకు ఉంటుంది. తీర మైదానాలు, తూర్పు కనుమలకు, బంగాళాఖాతానికీ మధ్య ఉన్నాయి. కొన్ని ప్రదేశాలలో తూర్పు కనుమలు సముద్రానికి దగ్గరగా ఉంటాయి. ఈ ప్రాంతంలో సముద్రంలోకి ప్రవహించే అనేక నదులు ఉన్నాయి - రుషికుల్య, వంశధార, నాగావళి . [1] [2] [3]

రేవు అభివృద్ధి

మార్చు

మేఘాద్రిగెడ్డ ముఖద్వారం వద్ద విశాఖపట్నం ఓడరేవును 1933లో ప్రారంభించారు. దీనిని మొదట బెంగాల్ నాగ్‌పూర్ రైల్వే అభివృద్ధి చేసింది. ఈ ఓడరేవులో ఇన్నర్ హార్బరు, ఔటర్ హార్బరు ఉన్నాయి. విశాఖపట్నం ఓడరేవు 2010-11లో 6.804 కోట్ల టన్నుల కార్గోను నిర్వహించింది. కాండ్లా తర్వాత భారతదేశంలో ఇది రెండవ అత్యధిక రవాణా. [4] [5]


చరిత్ర

మార్చు

హౌరా-చెన్నై ప్రధాన లైన్

మార్చు

1893 - 1896 మధ్య కాలంలో కటక్, విజయవాడ మధ్య 1,287 కి.మీ. (800 మై.) రైలుమార్గాన్ని ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే నిర్మించి ట్రాఫిక్‌కు తెరిచింది. [6] [7] 1899 జనవరిలో బెంగాల్ నాగ్‌పూర్ రైల్వే లైన్ కటక్ వరకు ప్రారంభమైంది. [6] 1901 లో ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే దక్షిణ భాగాన్ని (వాల్టేర్ నుండి విజయవాడ వరకు) [8] మద్రాసు రైల్వే స్వాధీనం చేసుకుంది. పూరి బ్రాంచ్ లైన్‌తో సహా కటక్‌కు ఉత్తరాన ఉన్న 514 కి.మీ. (319 మై.) పొడవైన భాగాన్ని 1902లో బెంగాల్ నాగ్‌పూర్ రైల్వే స్వాధీనం చేసుకుంది. [7] [9]

శాఖా మార్గాలు

మార్చు

79 కి.మీ. (49 మై.) విజయనగరం-పార్వతీపురం లైన్‌ను 1908-09లో ప్రారంభించారు. 1913లో సాలూరు వరకు పొడిగించారు. పార్వతీపురం-రాయ్‌పూర్ లైన్ 1931 లో [6] పూర్తయింది.

1960లో, భారతీయ రైల్వే మూడు ప్రాజెక్టులను చేపట్టింది. అవి కొత్తవలస-కోరాపుట్-జీపూర్-కిరండౌల్ లైన్ (దండకారణ్య ప్రాజెక్ట్), టిట్లాగఢ్-బోలంగీర్-ఝర్సుగూడ ప్రాజెక్టు, రూర్కెలా-కిరిబురు ప్రాజెక్టు. మొత్తం మూడు ప్రాజెక్టులను కలిసి DBK ప్రాజెక్ట్ లేదా దండకారణ్య బోలంగీర్ కిరిబురు ప్రాజెక్టు అని అంటారు. [10] కొత్తవలస-కిరండోల్ లైన్‌ను 1966-67లో ప్రారంభించారు. [7]


పర్లాకిమిడి లైట్ రైల్వే 1900 - 1931 మధ్య నౌపడా-గుణపూర్ లైన్‌ను ప్రారంభించింది [6] [11] 2011లో ఈ లైన్ను బ్రాడ్ గేజ్‌గా మార్చారు. [12]

విద్యుద్దీకరణ

మార్చు

1965లో హౌరా-చెన్నై మెయిల్ ఈ మార్గంలో డీజిల ఇంజనుతో నడిచింది. [13] సౌత్ ఈస్టర్న్ రైల్వేలో డీజిల్ ఇంజనుతో నడిచిన మొదటి రైలు.

ఖుర్దా-విశాఖపట్నం సెక్షన్ 2002 నాటికి విద్యుదీకరించబడింది. హౌరా-చెన్నై మార్గం 2005 లో [14] పూర్తిగా విద్యుదీకరించబడింది.

ప్రస్తావనలు

మార్చు
  1. "Coastal Plains of India". Country facts – the world at your finger tips. Archived from the original on 2013-05-30. Retrieved 2013-01-17.
  2. "The Coastal Plains of India". Zahie.com. Archived from the original on 2019-09-18. Retrieved 2013-01-17.
  3. "Mahanadi River Delta, India, Asia". The World Delta Database. Retrieved 2013-01-17.
  4. "Port of Visakhapatnam". History. vizagport. Archived from the original on 11 November 2012. Retrieved 2013-01-24.
  5. "Vizag port feels the heat of competition from Gangavaram". The Hindu Business Line. 19 April 2011. Retrieved 2013-01-24 – via Access My Library.
  6. 6.0 6.1 6.2 6.3 "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 1 April 2013. Retrieved 2013-01-02.
  7. 7.0 7.1 7.2 "History of Waltair Division". Mannanna.com. Archived from the original on 11 October 2012. Retrieved 2013-01-02.
  8. "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.
  9. "History". East Coast Railway. Archived from the original on 31 January 2011. Retrieved 2013-01-02.
  10. Baral, Chitta. "History of Indian Railways in Orissa" (PDF). Retrieved 2012-11-27.
  11. "Paralakhemedi Light Railway". The Indian Express. 28 May 2009. Retrieved 2012-12-10.
  12. "Performance of Waltair Division in 2011-12". Waltair Division of East Coast Railway. Retrieved 2012-11-27.
  13. "IR History: Part - IV (1947–1970)". IRFCA. Retrieved 2012-11-21.
  14. "IR History Part VII (2000–present)". IRFCA. Retrieved 2013-01-02.