గంగుల ప్రభాకర్ రెడ్డి

గంగుల ప్రభాకర్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీగా, ప్రభుత్వ విప్‌‌గా ఉన్నాడు.

గంగుల ప్రభాకర్ రెడ్డి

ఎమ్మెల్సీ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2017 - ప్రస్తుతం
నియోజకవర్గం ఆళ్ళగడ్డ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 18 జూన్ 1957
ఎర్రగుడిదిన్నె, రుద్రవరం మండలం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు గంగుల తిమ్మారెడ్డి , సుబ్బమ్మ
జీవిత భాగస్వామి ఇందిర
బంధువులు గంగుల ప్రతాపరెడ్డి
సంతానం గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి

జననం, విద్యాభాస్యం మార్చు

గంగుల ప్రభాకర్‌ రెడ్డి 18 జూన్ 1957లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, రుద్రవరం మండలం, ఎర్రగుడిదిన్నె గ్రామంలో గంగుల తిమ్మారెడ్డి , సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన ఆళ్లగడ్డలో ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం మార్చు

గంగుల ప్రభాకర్‌ రెడ్డి తన తండ్రి గంగుల తిమ్మారెడ్డి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆళ్ళగడ్డ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి భూమా నాగిరెడ్డి చేతిలో ఓడిపోయాడు. అయన 1999 అసెంబ్లీ ఎన్నికల్లో, 2012 ఉప ఎన్నికలో తిరిగి పోటీ చేసి ఓడిపోయాడు. గంగుల ప్రభాకర్‌ రెడ్డి టీడీపీ పార్టీకి 15 ఫిబ్రవరి 2017న రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[1]

గంగుల ప్రభాకర్‌ రెడ్డి 2017లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా 3 మార్చి 2017న ఖరారయ్యాడు. ఆయన ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా 10 మార్చి 2017న ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[2]

మూలాలు మార్చు

  1. Sakshi (15 February 2017). "వైఎస్ఆర్ సీపీలో చేరిన గంగుల ప్రభాకర్ రెడ్డి". Archived from the original on 11 December 2021. Retrieved 11 December 2021.
  2. TeluguOne News (10 March 2017). "ఏకగ్రీవంగా ఏడుగురు ఎమ్మెల్సీల నియామకం." Archived from the original on 6 February 2022. Retrieved 6 February 2022.