గంజివరపు శ్రీనివాస్
గంజివరపు శ్రీనివాస్, స్వతంత్ర పాత్రికేయుడు, సామాజిక కార్యకర్త.[1]
జీవిత విశేషాలు
మార్చుశ్రీనివాస్ తూర్పు కనుమల్లో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలపై పనిచేస్తున్నారు. స్వతంత్ర జర్నలిస్టుగా పర్యావరణ పరిరక్షణ, ఆదివాసుల అభివృద్ధి. ఇతర సామాజిక అంశాలపై వ్యాసాలు వ్రాస్తున్నారు. ప్రస్తుతం చైతన్య స్వచ్చంద సేవాసంస్థ అధ్యక్షుడిగా, పైలా ఫౌండేషన్, వివిఫై మీడియా సంస్థ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణలలో లోపాలను క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడం, ప్రభుత్వానికి నివేదించడం, గిరిజన, గ్రామీణ యువతకు వారి హక్కులు, పర్యావరణ అంశాలపై అవగాహన కలిగించడం వంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గిరిజన ప్రాంతాల్లో చిన్నారులకు ప్రాధమిక విద్య,గిరిజన రైతులకు అటవీ హక్కులు,మౌలిక వసతుల కల్పన వంటి కార్యక్రమాల్లో పనిచేస్తున్నారు.
గంజివరపు శ్రీనివాస్ 2013 లో అమెరికా ప్రభుత్వ అంతర్జాతీయ సందర్శకుల నాయకత్వ కార్యక్రమానికి (IVLP) ఎంపికయ్యారు. అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ సందర్శకుల నాయకత్వ కార్యక్రమం- [1] (ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్షిప్ ప్రోగ్రాం) పేరిట అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో సామాజిక, సాంస్కృతిక, పరిపాలన విషయాలను ఇతర దేశాల నాయకులకు తెలియజేయడానికి 1940 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుంది.[2] దేశవ్యాప్తంగా 9 మంది పౌర సంఘాలకు చెందిన సభ్యులతో కూడిన బృందాన్ని అమెరికా ప్రభుత్వం తమ దేశంలో సామాజిక సంస్థల పనితీరుని అధ్యయనం చేయడానికి ఎంపిక చేసింది. ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఈ IVLP బృందంలో శ్రీనివాస్ ఉన్నారు. ఈ బృందం వాషింగ్టన్, లూసియానా, ఫ్లోరిడా, ఉథా రాష్ట్రాల్లో ప్రభుత్వ, రాజకీయ, సామాజిక సంస్థల ప్రతినిధులను, విశ్వవిద్యాలయాల్లో నిపుణులను కలుసుకున్నారు.అక్కడి క్షేత్రస్తాయి క్షేత్రస్తాయి అంశాలని అధ్యయనం చేసారు. జూలై 4 న ఫ్లోరిడాలో జాక్సన్ విల్లీ నగరంలో జరిగే అమెరిక స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. లూసియానా రాష్ట్రంలో ఆదివాసులు, యువతకు సంబంధించి సామాజిక ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసారు.
ప్రజాశక్తి పత్రిక వ్యవస్థాపక సంపాదకులు మోటూరు హనుమంతరావు స్మారక అవార్డును ప్రజాశక్తి సాహితీ సంస్థ 2009 సంవత్సరానికి ఉత్తమ జర్నలిస్టుగా గంజివరపు శ్రీనివాస్‌ను ఎంపిక చేసింది.ఆంధ్ర పదేశ్ ప్రెస్ అకాడమీ మాజీ అధ్యక్షులు పొత్తూరి వెంకటేశ్వరరావు, విశాలాంధ్ర మాజీ సంపాదకులు సి రాఘవాచారి, డిఎన్‌ఎఫ్ సంపాదకులు వాడకట్టు హనుమంతరావులతో కూడిన అవార్డు ఎంపిక కమిటీ గంజివరపు శ్రీనివాస్ అటవీ సమస్యలు- పరిష్కారాలు వార్తా కథనాల పరంపర (ఈనాడులో ప్రచురితమైనవి) ను ఉత్తమ జర్నలిస్టు పురస్కారానికి అర్హమైనదిగా నిర్ణయించి ఎంపిక చేసింది.
సామాజిక కార్యకర్త
మార్చుగంజివరపు శ్రీనివాస్ కోవెల్ ఫౌండేషన్, సమత, కోస్టల్ రూరల్ యూత్ నెట్ వర్క్, శారదా ట్రస్టు వంటి సంస్థల్లో వివిధ హోదాల్లో తూర్పుకనుమలలో ఆదివాసుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ తదితర కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
పాత్రికేయుడు
మార్చుస్వతంత్ర పాత్రికేయుడుగా వివిధ సామాజిక, పర్యావరణ అంశాలపై ఈనాడు వంటి ప్రధానస్రవంతి పత్రికలకు వ్యాసాలు వ్రాస్తున్నారు.
అవార్డులు
మార్చుగంజివరపు శ్రీనివాస్ ఆదివాసుల జీవనం, సామాజిక సమస్యలు, అడవులు, పర్యావరణ పరిరక్షణ అంశాలపై రాసిన విశ్లేషనాత్మక వ్యాసాలకు, సామాజిక సేవా కార్యక్రమాలకు గాను వివిధ అవార్డులను పొందారు.
- పాలగుమ్మి సాయినాథ్ కౌంటర్ మీడియా జర్నలిస్టు అవార్డు - 2008
- మోటూరు హనుమంతరావు స్మారక ఉత్తమ జర్నలిస్టు అవార్డు - 2009,
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎం. నర్సింగరావు స్మారక ఉత్తమ గ్రామీణ జర్నలిస్టు అవార్డు - 2009,
- ఎన్ అర్ ఐ సమయ్ రేడియో చానల్ వారి ప్రభావశీల అవార్డు - 2012[3]
- సావిత్రిభాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ విశిష్ట సేవా పురస్కారం - 2017
- ఏపీ ప్రభుత్వ ఎం నర్సింగరావు ఉత్తమ గ్రామీణ జర్నలిస్టు అవార్డు - 2009
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవవైవిధ్య మండలి వారి జీవవైవిధ్య రక్షక్ అవార్డు - 2016
మూలాలు
మార్చు- ↑ "ఉత్తమ జర్నలిస్టు అవార్డు". ప్రజాశక్తి. Archived from the original on 30 జూన్ 2013. Retrieved 23 March 2018.
- ↑ "Samata coordinator invited to US". thehindu.com. The Hindu. Retrieved 23 March 2018.
- ↑ "సామజిక సేవాకార్యక్రమాలకు లాస్ ఏంజిల్స్ కు చెందిన ఎన్ అర్ ఐ సమయ్ రేడియో చానల్ వారి ప్రభావశీల అవార్డు - 2012". merinews.com. Archived from the original on 24 జూన్ 2013. Retrieved 23 March 2018.