వాడకట్టు హనుమంతరావు

వి.హనుమంత రావు తెలుగువారి తొలి యుద్ధ విలేఖరి. తెలుగు పాత్రికేయుడు, ఆర్ధికరంగ విశ్లేషకుడు.

జీవిత విశేషాలు

మార్చు

ఆయన తూర్పుగోదావరి జిల్లా మండపేట లో 1925లో జన్మించారు.[1] విశాఖలో ఉద్యోగం చేస్తూ కమ్యూనిస్టుగా మారారు. పుచ్చలపల్లి సుందరయ్య గారికి స్టెనోగా పనిచేశారు. 1945లో విజయవాడ లో ప్రజాశక్తి ప్రారంభించిన తొలిరోజు నుంచీ పనిచేశారు.[2]విశాలాంధ్రలో ప్రజారాజ్యం ’ పుస్తకాంశాలను సుందరయ్యగారు ఇంగ్లిష్‌లో చెబుతోండగా టైప్ చేశారు. డాంగే, అరుణా అసఫ్ అలీ లకు రిపోర్టర్‌గా పనిచేశారు. బ్రిటిష్ కమ్యూనిస్ట్‌పార్టీ (బెంగాలీ) నేత రజనీ పామే దత్ చల్లపల్లిలో చేసిన ఉపన్యాసాన్ని రిపోర్ట్ చేశారు. కమ్యూనిస్టుపార్టీ నిషేధానికి గురైనప్పుడు అండర్‌గ్రౌండ్‌కి వెళ్లారు. పార్లమెంట్ ను కవర్ చేసేందుకు 1952లో ఢిల్లీ వెళ్లిన తొలి తెలుగు పత్రికా రిపోర్టర్‌.హైదరాబాద్ ఈనాడులో న్యూస్ ఇన్‌చార్జ్‌గా చేశారు. 1977లో ‘డాటా న్యూస్ ఫీచర్స్ ’సంస్థను, తరువాత కాలేజ్ ఆఫ్ జర్నలిజంను ప్రారం భించారు.ఆయన శ్రీమతి పి.సరళ హిందీ టీచర్‌ గా రిటైరై మహిళా జర్నలిస్టు ఫౌండేషన్‌ను స్థాపించారు.మనుమరాలు స్రవంతి ముంబైలో టాటా రీసెర్చ్ సెంటర్‌లో ఆదివాసులపై పరిశోధనచేస్తోంది. 'డాటా న్యూస్ ఫీచర్స్ ’ సంస్థ ద్వారా ఉత్తమ గ్రామీణ జర్నలిస్టుల పురస్కారాలను 2016 వరకూ అందించారు.

నమ్మకాలు

మార్చు
  • అమెరికా విధానాలకు ప్రత్యామ్నాయం మార్క్సిజం-లెనినిజం మాత్రమే.అయితే, ఈ సిద్ధాంతాన్ని దేశ- కాలానుగుణంగా అన్వయించుకోవడంలో కమ్యూనిస్టు పార్టీలు విఫలం కావడమే విషాదం.
  • పత్రికారంగం కార్పొరేటీకరణ చెందింది. ‘పెయిడ్‌న్యూస్’ ప్రవేశించింది. ఇది వరకు జర్నలిస్టులు సమాజంలో తప్పు లను చూపేవారు. ఇప్పుడు సమాజం జర్నలిస్టులలో తప్పులను చూపుతోంది. రాజకీయాల్లో రాణిస్తున్నవారికి, జర్నలిస్టు సంఘాల్లో చేరి రాణిస్తున్న కొందరు జర్నలిస్టు లకు మధ్య తేడాలేకుండా పోతోంది!

రచనలు

మార్చు
  • పార్టీ పాలిటిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ [3]
  • Lal salam to Comrade P. Sundarayya : reminiscences and tributes[4]
  • renaissance of an unknown journalist
  • Andhra Pradesh at 50 : a data-based analysis ( Book )
  • Party politics in Andhra Pradesh, 1956-1983
  • Changing horizons : Andhra Pradesh : a data-view of Andhra Pradesh, 1956-1979
  • Andhra Pradesh : Changing Horizons A Data-view of Andhra Pradesh 1956-1979
  • Fifty years of Andhra Pradesh : 1956-2006
  • మీరు,నేను, ఆర్థికం
  • Industrial development of Andhra Pradesh, 1956-2010 : past, present, future
  • రైతు కంట కన్నీరు, ప్రభుత్వానికి పన్నీరు
  • ఆంధ్రప్రదేశ్ వార్షిక దర్శిని 1984 : ఐదవ వార్షిక ప్రచురణ

పురస్కారాలు

మార్చు
  • జీవిత సాఫల్య పురస్కారాన్ని రెండు సార్లు అందుకున్నారు.[5]

మూలాలు

మార్చు
  1. Hanumantha Rao, V. (Vadakattu) 1925-
  2. Bommareddy given tearful farewell
  3. "OWAISI POLITICS IN SECULAR INDIA – A Replica of Pre-Independence Islamism?". Archived from the original on 2016-08-01. Retrieved 2016-05-30.
  4. Lal salam to Comrade P. Sundarayya : reminiscences and tributes
  5. Journalist V.Hanumantha Rao Conferred With Lifetime Achievement Award[permanent dead link]

ఇతర లింకులు

మార్చు