"గంజివానిపాలెం" కృష్ణా జిల్లా మోపిదేవి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గంజివానిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం.  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మోపిదేవి
ప్రభుత్వం
 - సర్పంచి కొల్లి చక్రపాణి
పిన్ కోడ్ 521 125
ఎస్.టి.డి కోడ్ 08671

సముద్రమట్టానికి 6 మీ.ఎత్తులో ఉంది.

గ్రామానికి రవాణా సౌకర్యాలు

మార్చు

మోపిదేవి, అవనిగడ్డ నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 64 కి.మీ.దూరంలో ఉంది

గ్రామంలో విద్యా సౌకర్యాలు

మార్చు

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయినిగా పనిచేయుచున్న మండవ సుధారావు బి.యే., ఎం.యే., ఎం.యే., ఎం.ఇ.డి, 2016, సెప్టెంబరు-5వ తేదీనాడు, కృష్ణాజిల్లా ఉత్తమ ఉపాధ్యాయినిగా పురస్కారం అందుకున్నారు. [2]

గ్రామ పంచాయతీ

మార్చు

గంజివాని పాలెం గ్రామం, మోపిదేవి గ్రామ పంచాయతీలోని ఒక శివారు గ్రామం.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

శ్రీ పోతరాజుస్వామి, గ్రామ దేవత శ్రీ అంకమ్మ తల్లి ఆలయం

మార్చు

ఈ గ్రామ ఎస్.సి.వాడలో 2015, సెప్టెంబరు-27వ తేదీ ఆదివారం ప్రతిష్ఠించనున్న శ్రీ పోతురాజు, శ్రీ అంకమ్మ తల్లి విగ్రహాల గ్రామోత్సవం, శనివారం వైభవంగా నిర్వహించారు. విగ్రహప్రతిష్ఠా మహోత్సవం, ఆదివారం ఉదయం 11-32 గంటలకు అంగరంగవైభవంగా నిర్వహించారు. [1]

ఈ ఆలయంలోని గ్రామదేవతల వార్షిక సంబరాలు, 2017, ఫిబ్రవర్-4వతేదీ శనివారం, 5వతేదీ ఆదివారంనాడు, వైభవంగా నిర్వహించారు. రెండు రోజులపాటు గ్రామస్థుల, భక్తబృందాల సహాయ సహకారాలతో ఈ ఉత్సవాలను కోలాహలంగా నిర్వహించారు. అమ్మవారలకు, పోతరాజుకు, రైతులు ఈ సంవత్సరం కొత్తగా పండించిన బియ్యంతో చద్ది నైవేద్యాలు, మొక్కుబడులు సమర్పించి కొలిచారు. [3]

గ్రామంలో ప్రధాన పంటలు

మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామములోని ప్రధాన వృత్తులు

మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు

మార్చు

[1] ఈనాడు అమరావతి; 2015, సెప్టెంబరు-28; 40వపేజీ. [2] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016, సెప్టెంబరు-16; 2వపేజీ. [3] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017, ఫిబ్రవరి-6; 1వపేజీ.

వెలుపలి లింకులు

మార్చు