ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన గంటి కృష్ణవేణమ్మ[1] గొప్ప కవయిత్రి. ఈమెది వాధూలస గోత్రము. ఈమె తండ్రి కఱ్ఱా రామశర్మ పోలీసు ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశాడు. తల్లి సుబ్బలక్ష్మమ్మ కవయిత్రి. చంద్రకళా విలాసము అనే ప్రబంధాన్ని రచించింది. ఈ గ్రంథం విద్వాన్ పరీక్షకు పాఠ్యగ్రంథంగా ఉండేది. గంటి కృష్ణవేణమ్మ భర్త గంటి వెంకటసుబ్బయ్య కూడా గొప్ప పండితుడు. కవులుట్ల చెన్నకేశవ శతకము ను వ్రాశాడు. ఈమె పెద్దగా చదువుకోక పోయినా తాతగారైన నాగపూడి కుప్పుసామయ్య వద్ద తెలుగు సాహిత్యం చదువుకుంది. ఒంటిమిట్టలో వావిలికొలను సుబ్బారావు నిర్వహించిన పరీక్షలను చిన్న తనంలోనే ముగించింది. హిందీ విద్యాపీఠం వార్థా నిర్వహించే భాషాకోవిద వరకు చదివింది. ఇంగ్లీషు, కన్నడ భాషలలో కూడా కొంత ప్రవేశముంది. ఈమె గృహలక్ష్మి , భారతి, త్రిలిఙ్గ పత్రికలలో పద్యఖండికలను ప్రచురించింది. గృహలక్ష్మి పత్రికాధిపతులు ఈమెకు స్వర్ణకంకణమును బహూకరించి సరసకవయిత్రి అనే బిరుదుతో సత్కరించారు. తన 86వ యేట ప్రొద్దుటూరులో మరణించింది.

గంటి కృష్ణవేణమ్మ
జననంకఱ్ఱా కృష్ణవేణమ్మ
(1920-12-20) 1920 డిసెంబరు 20
భారత తిరుపతి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
ప్రసిద్ధిగంటి కృష్ణవేణమ్మ
మతంహిందూ
భార్య / భర్తగంటి వెంకటసుబ్బయ్య
పిల్లలుగంటి దత్తాత్రేయ, మంథా లలిత
తండ్రికఱ్ఱా రామశర్మ
తల్లికఱ్ఱా సుబ్బలక్ష్మమ్మ

రచనలుసవరించు

  1. సైరంధ్రి (పద్యకావ్యము)
  2. గిరిజాకళ్యాణము
  3. పవనద్యూతము
  4. రాజరాజేశ్వరీ శతకము
  5. కామాక్షీ శతకము
  6. శ్రీ జ్ఞానప్రసూనాంబికా శతకము
  7. తలపోత[2]

రచనల నుండి ఉదాహరణసవరించు

నాడటు పాండవాత్మజులు నన్నును, తమ్మును రాజ్యమెల్ల దా
నోడి మహార్తి నున్నతరి మద్యతులై ధృతరాష్ట్ర నందనున్
పాడి దొఱంగి వల్వలొలువన్‌గని సూతసుతుండు కొల్వులో
నాడిన మాట లకటా! తలపోయ మనంబు వ్రయ్యదే!
కురుపతి, భీష్ముడున్, గృపుడు, కుంభజ ముఖ్యులు గల్గుకొల్వులో
నరసి వచింపరైరకట! యాడుది వేడిన ధర్మసంశయం
బెరుఁగరె? ధర్మ శాస్త్రముల నేటికి గాల్పనె! పెద్దవారలం
దురుగద, యేటి పెద్దలిక నేటికి వారల గౌరవింపగన్?
(సైరంధ్రి పద్యకావ్యం నుండి)

మూలాలుసవరించు

  1. రాయలసీమ రచయితల చరిత్ర రెండవసంపుటి - కల్లూరు అహోబలరావు- శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల
  2. [1]వేపచేదు