గండ్ర జ్యోతి
గండ్ర జ్యోతి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2019లో వరంగల్ గ్రామీణ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైంది.[1]
గండ్ర జ్యోతి | |||
వరంగల్ గ్రామీణ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్
| |||
పదవీ కాలం 2019 - ప్రస్తుతం | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | 3 జూన్ 1970 హసన్‌పర్తి, హసన్‌పర్తి మండలం, హనుమకొండ జిల్లా, తెలంగాణ | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | గండ్ర వెంకట రమణారెడ్డి | ||
సంతానం | ఇద్దరు కుమారులు |
రాజకీయ జీవితం
మార్చుగండ్ర జ్యోతి రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుండి రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె భర్త గండ్ర వెంకట రమణారెడ్డి భూపాలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆమె 2004 నుంచి 2018 వరకు తన భర్తతో పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగింది. జ్యోతి 2019లో కాంగ్రెస్ పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరింది. ఆమె2019లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో శాయంపేట మండలం నుంచి జడ్పీటీసీగా పోటీ చేసి గెలిచి వరంగల్ గ్రామీణ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైంది.
గండ్ర జ్యోతి 26 జనవరి 2022న జయశంకర్ భూపాలపల్లి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలిగా నియమితురాలైంది.[2][3]
మూలాలు
మార్చు- ↑ The Hindu (8 June 2019). "New zilla parishad chairpersons" (in Indian English). Archived from the original on 25 ఫిబ్రవరి 2021. Retrieved 28 January 2022.
- ↑ Mana Telangana (26 January 2022). "33 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను ప్రకటించిన సిఎం కెసిఆర్". Archived from the original on 28 జనవరి 2022. Retrieved 28 January 2022.
- ↑ Namasthe Telangana (26 January 2022). "జిల్లా సారథులు". Archived from the original on 28 జనవరి 2022. Retrieved 28 January 2022.